ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
8, ఆగస్టు 2023, మంగళవారం
మన మహర్షులు - పాణిని మహర్షి
26, జులై 2023, బుధవారం
కృతజ్ఞత - పూజ్య దాజీ
పూజ్య గురుదేవులు దాజీ, పూజ్యశ్రీ చారీజీ జన్మదినోత్సవ సందర్భంగా (జూలై 23,24,25, 2023 తేదీల్లో) "కృతజ్ఞత" ను గురించి ఇచ్చిన సందేశంలో నుండి కొన్ని అద్భుత వాక్యాలు ఈ విధంగా ఉన్నాయి; ప్రతి ఒక్కరూ సత్సంగాల్లో మన గురుపరంపర అందించిన ఆధ్యాత్మిక స్థితులను కొనసాగించుకునే ప్రయత్నంలో ధ్యానించుకోవలసిన మహావాక్యాలు:
కృతజ్ఞత
లేని వ్యక్తి బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత పట్ల
మళ్ళాలంటే, ఈ కృతఘ్నతకు సంబంధించిన అలవాట్లను మానుకోవాలి. – లాలాజీ
పాపం అంటూ ఏదైనా ఉందీ అంటే, అది కృతజ్ఞతారాహిత్యమే. – బాబూజీ
కృతజ్ఞతను ఎలా ఆపగలం? కృతజ్ఞత జీవితంలో కళ్ళల్లో నుండి హృదయ ప్రవాహం ధారగా వస్తున్నప్పుడు దాన్ని సంస్కృతంలో అశ్రుధార అంటారు. కళ్ళల్లో నుండి వచ్చే రెండు అశ్రుధారలను గంగాయమునలతో పోలుస్తారు. అటువంటి అశ్రులు పవిత్రమైనవి, ధన్యమైనవి. అటువంటి అశ్రులు హృదయ లోలోతుల్లో పాతుకుపోయిన అపరాధ భావానికి సంబంధించిన భారాన్ని తొలగించి, హృదయంలో ఆనకట్ట వేయబడిన కృతజ్ఞత స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేలా చేస్తాయి. ఆ ఆనకట్ట పగిలినప్పుడు మనం ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. ఇది చాలా గొప్ప అనుభవం. అభ్యాసికి ఇటువంటి అనుభవం జరుగుతున్నప్పుడు ఆపకండి, జరగనివ్వండి. – చారీజీ
కృతజ్ఞత. అఖలాఖ్ కు సంబంధించిన లక్షణాలైన స్వార్థరహితంగా ఉండటం, వినమ్రత, ఆ సర్వశక్తిమంతుని పట్ల సమర్పణ భావము, పెంపొందిస్తుంది. - దాజీ
గుండె నిండా కృతజ్ఞత వరదలై పొంగాలంటే, గుండె పూర్తిగా ఖాళీ అయిపోవాలి. ఇంతకంటే ఏమాత్రం తక్కువగా ఉన్నా కుదరదు.- దాజీ
అద్భుతాలు సృష్టించే సామర్థ్యం అనుగ్రహంలో ఉంటుంది. దివ్యలోకంలో ఉన్న మహనీయులు ఆనందంగా ఉండి, సూక్ష్మంగా మనతో ఉన్నప్పుడు ఈ కృప వర్షించడం జరుగుతుంది.= దాజీ
కృతజ్ఞత అనేది పువ్వు యొక్క పరిమళం లాంటిది, దానికి ప్రత్యేకమైన గమ్యం అంటూ ఏదీ ఉండదు. మీరు భగవంతుని నమ్మినా ఫర్వాలేదు, నమ్మకపోయినా ఫర్వాలేదు; మీరు కృతజ్ఞతను అనుభూతి చెందడమే ముఖ్యం.- దాజీ
నిజాయితీగా కృతజ్ఞతను అనుభూతి చెందే స్థితిలో నుండి వెలువడే నిశ్శబ్ద ప్రార్థన తప్పక తన నిర్ధారిత గమ్యాన్ని చేరి తీరుతుంది, నిజానికి అటువంటి ఉద్దేశం లేకపోయినా సరే. - దాజీ
ఆ పరతత్వంతో అనునాదం కలిగి ఉన్నప్పుడు మాత్రమే నిజమైన కృతజ్ఞత ఆవిర్భవిస్తుంది; ఇక బాహ్య సంఘటనలపై గాని లేక ఆధ్యాత్మికపరమైన ఆశీస్సులపై గాని ఆధారపడటం ఉండదు. సమస్త రకాల కోరికలూ అంతరించినప్పుడే ఆ పవిత్ర స్థితిలోకి ప్రవేశించగలుగుతాం. - దాజీ
పైన తెలిపిన ఒక్కొక్క వాక్యాన్ని మన ఆధ్యాత్మిక సాధనలో, శ్రవణ,మనన, నిధిధ్యాసనల ద్వారా మన జీవ వ్యవస్థలోని ప్రతీ కణంలోనూ శాశ్వతంగా ఇంకిపోయేలా చేసుకునే ప్రయత్నం చేద్దాం.
21, జులై 2023, శుక్రవారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 6
గురోరంఘ్రి పద్మే మనస్చైన లగ్నం
తత: కిమ్ తత: కిమ్, తత: కిమ్ తత: కిమ్
I regret I cannot be with you all but... but I am with you in spirit. And I hope you can feel it. Please believe me when I say that I shall be with you all, all the time, whether here or in your Russia or in other countries... does not matter... Distance does not make any difference... there is no difference... I pray for you all and wish you the best, blessings to all of you!
ప్రియతమ చారీజీ చివరి సందేశం
ప్రియమైన సోదరీసోదరులారా,
నేను మీ అందరితో ఉండలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.. కానీ నేను మీతో స్ఫూర్తిగా ఉన్నాను. మీరు దాన్ని అనుభూతి చెందుతున్నారని ఆశిస్తున్నాను. నేను మీతో ఎప్పుడూ ఉంటాను అని అన్నప్పుడు నన్ను నమ్మండి.. అది ఇక్కడైనా, లేక మీ రష్యాలోనైనా, లేక ఇతర దేశాల్లోనైనా.. ఏమీ తేడా ఉండదు .. దూరంతో పని లేదు. దాని వల్ల ఏ తేడా రాదు. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను, మీ అందరికీ శుభం జరగాలని కోరుతున్నాను. అందరికీ ఆశీస్సులు!
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 5
ఏ ఆధ్యాత్మిక సాంప్రదాయానికైనా మానవాళికి తమ బోధలతో మార్గదర్శనం చేయడానికి, ఆయా ధ్యాన పద్ధతులను సంరక్షించుకోడానికి గురుపరంపర అవసరం. లేకపోతే అద్భుతమైన ధ్యాన పద్ధతులు కాలగర్భంలో కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. అలా ఎన్నో పద్ధతులు కనుమరుగయ్యాయో మనకు తెలియదు.
అలా కాలగర్భంలో కనుమరుగైన విద్యే ప్రాణాహుతి ప్రసరణ విద్య. ఈ రాజయోగ విద్య దశరథమహారాజుకు 72 తరాల పూర్వం వినియోగంలో ఉండేదట. అంటే రాముని కాలంలో లేదు, కృష్ణుని కాలంలో కూడా లేదన్నట్లే. అటువంటి విద్యను పూజ్య లాలాజీ పునరుద్ధరించడం జరిగింది. మానవాళికి అతి త్వరితంగా మోక్షసిద్ధి కలగాలంటే ఏమైనా మార్గం ఉండేమోనని వారు అన్వేషణ చేసినప్పుడు వెల్లడైన మహా సత్యం. ఆ అపూర్వ పద్ధతినే గురుపరంపర ద్వారా ఒకరి తరువాత ఒకరికి మరలా కోల్పోకుండా పదిలంగా సంరక్షిస్తూ అందజేయడం జరుగుతోంది. సాధకులు ఈ విద్యనభ్యాసం చేస్తేనే ఇది కాపాడబడుతుంది.
కానీ పూజ్య చారీజీ 2011 లోనే పూజ్య దాజీని తన వారసునిగానూ, పూజ్య బాబూజీ యొక్క రెండవ ప్రతినిధిగానూ ప్రకటించడం జరిగింది. 2006 వ సంవత్సరం నుండే దాజీ చెన్నైలో చారీజీ ఆజ్ఞ మేరకు అమెరికాలోని తన వ్యాపారాలన్నీ తన పుత్రులకు అప్పగించి చెన్నైలోనే ఉండిపోయారు. 2012 నుండి శ్రీరామచంద్ర మిషన్ వైస్-ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించారు. 2011 నుండి చారీజీ ప్రతీ సమావేశంలోనూ, ప్రతీ నగరంలోనూ, స్వయంగా అభ్యాసులందరికీ పరిచయం చేశారు.
20, జులై 2023, గురువారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 4
19, జులై 2023, బుధవారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 3
18, జులై 2023, మంగళవారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 2
ఛాదస్తం
ఛాదస్తం మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడ...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
బాబూజీ చెప్పిన 7 శ్లోకాలు, పూజ్య దాజీ ద్వారా వెల్లడియైన 7 శ్లోకాలు 7 రత్నాలు: శ్లోకం 1 ప్రజాహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ...




.jpg)

