ఆధ్యాత్మిక అధిరోహణలో సాధకుడు తాను ఉన్న స్థితి నుండి అత్యున్నత స్థితి వరకూ ఉండే అవస్థలను శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భగవద్గీతలో అర్జునుడికి, అర్జునుడి ద్వారా మానవాళికి ఉల్లేఖించడం జరిగింది. అత్యున్నత స్థితినే హార్ట్ఫుల్నెస్-సహజ్ మార్గ్ పద్ధతిలో సహజ సమాధి అంటారు. అంటే చంచలంగా అశాంతితో కూడిన మనసు నుండి మనిషి ఆధ్యాత్మికంగా ఏకత్వ స్థితిని సాధించే క్రమంలో ఎదురయ్యేటువంటి భగవానుడు తెలియజేసిన అవస్థలను/స్థితులను పరిశీలిద్దాం. వీటిని సహజ్ మార్గ్ లో ప్రతీ సాధకుడు తన అనుభవంలోకి రావడం గమనించగలుగుతాడు.
1. విక్షిప్త మనస్సు: చంచల మనస్సు, అన్నీ దిశల్లోనూ అడుపులేకుండా తిరుగుతూ ఉండే మనస్సు. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 34)
2. ఏకాగ్ర మనస్సు: చంచలమైన మనస్సు నిశ్చల ఏకాగ్ర స్థితికి చేరుకోవడం. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 26)
3. స్థితప్రజ్ఞ స్థితి: సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా చలించకుండా, మనస్సు కదలని స్థితి; సమస్థితి. (భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 56)
4. యుక్త స్థితి: జ్ఞానంతోనూ, అనుభవంతోనూ తృప్తితో ఉండే స్థితి యుక్త స్థితి. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 8)
5. బ్రహ్మభూత స్థితి: బ్రహ్మభూత స్థితిలో మనస్సు దుఃఖించదు, ఆశించదు, అందరి పట్ల సామాన్య దృష్టితో వ్యవహరిస్తుంది. (భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 54)
6. పరాభక్తి స్థితి: ఎవరి పట్ల ద్వేషం లేకుండా స్నేహంతోనూ, కారుణతోనూ ఉండే మనఃస్థితి.(భగవద్గీత అధ్యాయం 12, 13, )
7. తురీయ స్థితి: మనిషి జీవించే మూడు అవస్థలకతీతంగా (జాగృత, స్వప్న, సుషుప్తావస్థలు) ఉండే నాల్గవ స్థితే తురీయావస్థ. (భగవద్గీత అధ్యాయం 6, శ్లోకం 20,)
8. తామరాకుపై నీటి బొట్టులా ఉండటం: నీటిలో ఉంటూ కూడా తామరాకు నీటి బొట్టు అంటకుండా యే విధంగా ఉంటుందో, అలాగే మానవుడు కూడా సంసారంలో ఉంటూ కూడా సంసారం అంటకుండా జీవించగలడు. (భగవద్గీత అధ్యాయం 5, శ్లోకం 10)
9. నిష్కామ కర్మ: యే ఫలితమూ ఆశించకుండా తన కర్మలను తాను ఈశ్వరార్పణ భావంతో తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తూ పోవడం. (భగవద్గీత అధ్యాయం 2, శ్లోకం 47)
10. శరణాగతి: అన్ని ధర్మాలూ విడిచిపెట్టేసి, సంపూర్ణ భారం ఆయణపైనే ఉంచి జీవించడం. (భగవద్గీత అధ్యాయం 18, శ్లోకం 66)
11. పరమ గమ్యం: అక్కడ సూర్యని వెలుగు కానీ, చంద్రుని వెలుగు కానీ, మరే రకమైన వెలుగూ ఉండదు. అక్కడికి చేరుకున్నవాడు ఇక తిరిగి రావడం ఉండదు. (భగవద్గీత అధ్యాయం 15, శ్లోకం 6)
భగవద్గీత మార్గాన్ని చూపిస్తుంది, హార్ట్ఫుల్నెస్-సహజ్ మార్గ్ ఆఅ మార్గంలో నడిపిస్తుంది, అనుభవాన్నిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి