ఏప్రిల్ 19, బాబూజీ మహాసమాధి రోజు
సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (షాజహాన్ పూర్, ఉ. ప్ర.), అందరూ ఆప్యాయంగా బాబూజీ మహారాజ్ అని పిలుచుకునేవారు. శ్రీరామ చంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఆధ్యాత్మిక సంస్థను తమ గురుదేవులైన సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (ఫతేగఢ్, ఉ. ప్ర.), అందరూ లాలాజీ మహారాజ్ అని పిలుచుకునేవారు, వారికి గురుదక్షిణగా ఈ సంస్థను 1945 లో షాజహాన్ పూర్ లో స్థాపించడం జరిగింది. సహజ్ మార్గ్ జన్మస్థానం షాజహాన్ పూర్. అక్కడే ఏప్రిల్ 30, 1899 న జన్మించిన పూజ్య బాబూజీ మహారాజ్ ఏప్రిల్ 19, 1983 న మహాసమాధిని కూడా పొందడం జరిగింది.
మహాసమాధి అంటే మాస్టర్ భౌతిక దేహం చాలించి, ఆఅ పరతతత్వంలో లీనమైన రోజు; అయినా ఒక సూక్ష్మ స్థితిలో అభ్యాసులకు తమ-తమ అంతరంగం ద్వారా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఆధ్యాత్మికంగా మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు.
ప్రతీ సంవత్సరమూ అభ్యాసులు ఈ రోజున ఏప్రిల్ 19 న, వారి దివ్య స్మృతిలో ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడం, వారి బోధనలను, వాక్కులను, జీవితాన్ని మరలా-మరలా నెమరువేసుకోవడం, వారి సాహిత్యాన్ని చదువుకోవడం చేస్తూంటారు శ్రద్ధా-భక్తులు గల అభ్యాసులు.
మన పూజ్య గురుదేవులు, ప్రస్తుత సహజ్ మార్గ్ మాస్టర్ అయిన దాజీ మహారాజ్, రేపు ఉదయం 7.30 గంటలకు ఈ సందర్భంగా వారణాసి నుండి ధ్యానం నిర్వహించనున్నారు. అందరూ శ్రద్ధతో పాల్గొందురుగాక.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి