మానవ శరీర వ్యవస్థలో
3 శరీరాలు - 5 కోశాలు
మన మహర్షులు మన అస్తిత్వానికి, మన చుట్టూ ఉన్న అస్తిత్వానికి గల మూల కారణం ఏమిటో తెలుసుకునే క్రమంలో, వాళ్ళ తపోధ్యానాదుల ద్వారా ఈ మానవ శరీరాన్ని ఈ విధంగా దర్శించారు.
మనందరికీ కనిపించే మానవ శరీరం, నిజానికి 3 శరీరాల వ్యవస్థ అని మహర్షులు దర్శించారు. వాటినే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని చెప్తారు. అలాగే ఈ శరీర వ్యవస్థను పంచ కోశాల వ్యవస్థగా కూడా దర్శించడం జరిగింది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలు. ఈ 5 కోశాలకు అతీతమైనది శుద్ధ చైతన్యం లేక ఆత్మ అని అంటాం.
ఇది కనిపించే భౌతిక శరీరం. అంటే బయటున్న అవయవాలు, లోపలున్న అవయవాలు, యముకలు, రక్తం, నరాలు, రక్తనాళాలు, కండరాలు ఉతయాదివన్నీ కలిపిస్తే స్థూల శరీరం అవుతుంది. అన్నమయ కోశం స్థూల శరీరానికి సంబంధించినది.
సూక్ష్మ శరీరం
5 కరమేమదరుయాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 వాయువులు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. మొత్తం కలిపి 19 సూక్ష్మ శరీరాలంటారు మన శాస్త్రకారులు. సహజ్ మార్గ్ ఆధ్యాత్మిక పథంలో ప్రధానంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తము అనే నాలుగ సూక్ష్మ శరీరాలపైనే పని జరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు సూక్ష్మ శరీరాలను అంతఃకరణ అని కూడా అంటారు. అంతఃకరణ శుద్ధి అనే పద్యం వాడుతూ ఉంటాం; దీని అర్థం ఈ 4 సూక్ష్మ శరీరాల శుద్ధి జరగటమే. అప్పుడే మనిషిలో ఆత్మ పరివర్తన జరుగుతుందని సహజ్ మార్గ్ బోధిస్తుంది.
సూక్ష్మ శరీరంలోనే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలుటాయి.
కారణ శరీరం
ఆత్మకు అతి సమీపమైన ఆవరణను ఆనందమయ కోశం అని లేక అతి సమీపంగా ఉండే శరీరాన్ని కారణ శరీరం అని అంటారు. మూడ్ శరీరాలకు అతీతమైనది ఆత్మ; లేక శుద్ధ కైతన్యం. అలాగే 5 కోశాలకు అతీతమైనది ఆత్మ ఇనికి లేక శుద్ధ కజాయితన్యం ఉనికి. దీని స్పర్శ కేవల ధ్యానం వల్లనే సాధ్యం.
భగవద్గీత 7 వ అధ్యాయం, 7 వ శ్లోకం
మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥
భావం
హృదయంలో ఉన్న ఆ ఆత్మే, ఆఅ శుద్ధ చైతన్యమే, ఆ అంతర్యామియే, ఆ దివ్యత్వమే, ఆ “సూత్రం”, ఆ దారం మనం ధ్యానం ద్వారా ఆ అంతర్యామిని అనుభవిస్తాము. అన్ని హృదయాలను (మణులను) ఒకే దైవ శక్తి (సూత్రం) కలిపి ఉంచుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి