17, జూన్ 2025, మంగళవారం

ఇంటెన్స్ అభ్యాసి - తీవ్ర సాధకుడు

 


    Meditate like never before          Clean like never before                    Pray like never before


ఇంటెన్స్ అభ్యాసి - తీవ్ర సాధకుడు 

పూజ్య చారీజీ మహారాజ్ ఒక సందర్భంలో సహజ్ మార్గ్ లో గమ్యాన్ని చేరే సోపానం ఏమిటో ఇలా సూచించారు. 
అభ్యాసి -> సరైన అభ్యాసి -> ఇంటెన్స్ అభ్యాసి -> గమ్యం. 
ప్రశిక్షకుడు (ప్రిసెప్టర్) అంటే ఇంటెన్స్ అభ్యాసి అని తెలిపారు. మూడు పరిచయాత్మక ధ్యాన సిట్టింగులు తీసుకున్నవాడు అభ్యాసి; ప్రతి రోజూ అభ్యాసం చేసేవాడు సరైన అభ్యాసి; ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాధన చేసేవాడు ఇంటెన్స్ అభ్యాసి. 


ఇంటెన్స్ అభ్యాసి అంటే పూజ్య దాజీ ఒక్క వాక్యంలో చెప్పేశారు:
Practice like never before 

అంటే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభ్యాసం చేయడం.  అంటే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ధ్యానించడం 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శుద్ధీకరణ చేసుకోవడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రార్థించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నిరంతర స్మరణలో ఉండటం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సేవలో పాల్గొనడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా దశనియమాలను పాటించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా శీలనిర్మాణ పనిలో నిమగ్నమవడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మన కర్మలలో కుశలత కనిపించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాహిత్యాన్ని చదవడం;
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంభాషించడం; 
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రేమించగలగడం; 
వెరసి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జీవించడం.  

4 కామెంట్‌లు:

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...