2, జూన్ 2025, సోమవారం

సంక్లిష్టతలు (Complexities) - మాలిన్యాలు (Impurities)

 


చిక్కుపడిన ఆలోచనలు (సంక్లిష్టతలు) పోయినప్పుడు సరళత్వం సంభవిస్తుంది 



మాలిన్యాలు (భయము, బద్ధకాలతో పాటు కామక్రోధ ..) పోయినప్పుడు స్వచ్ఛత ఏర్పడుతుంది. 

సంక్లిష్టతలు (Complexities) - మాలిన్యాలు (Impurities)

సాధకులు నిత్యం చేసుకునే హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ ఆధ్యాత్మిక రాజయోగ ధ్యాన పద్ధతిలోని రెండవ యౌగిక ప్రక్రియ జీవుడిలో గతంలోనూ, వర్తమానంలోనూ ఏర్పడిన ముద్రలను/సంస్కారాలను/వాసనలను/కర్మలను, క్రమమక్రమంగా కొంచెం-కొంచెంగా తొలగిస్తుంది. తద్వారా ఆత్మశుద్ధి జరుగుతుంది. సాధకుడు సరళంగానూ, పవిత్రంగానూ తయారావుతాడు. సహజ్ మార్గ్ పదజాలంలో ఈ సంస్కారాలనే సంక్లిష్టతలు-మాలిన్యాలని కూడా వాడతారు. 

సంక్లిష్టతలంటే ఏమిటి? పైన చిత్రంలో చూపించినట్లుగా, చిక్కుపడిన దారంలా, చిక్కుపడిన ఆలోచనల వలలో ఇరుక్కుపోయి తత్ఫలితంగా వచ్చే ఆలోచనాధోరణులనే సంక్లిష్టతలంటారు. ఇవే జటిలమైన మనస్తత్వాలుగా ఏర్పడటం జరుగుతుంది. మనసు ఈ చిక్కుపడిన ఆలోచనల వలలో ఇరుక్కుపోయి అక్కడక్కడే తిరుగుతూ, బయట పడలేకపోతూంటాడు. ఫలితంగా అదో రకమైన మనస్తత్వాలలో ఇరుక్కుపోవడం వల్ల, స్పష్టంగా గ్రహించలేకపోవడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వ్యక్తిత్వం జటిలంగా తయారవడం జరుగుతూ ఉంటుంది. ఈ శుద్ధీకరణ లేక నిరమాలీకరణ ప్రక్రియను గనుక నిర్దేశించిన విధంగా ప్రతి నిత్యం అనుసరించినట్లయితే ఈ చిక్కుమూడులు క్రమక్రమంగా విడిపోయి, ఆలోచనా విధానంలో సరళయత్వం ఏర్పడటం, వ్యక్తిత్వం సరళంగా తయారవడం ఎవరికి వారే గమనించవచ్చు.  

మాలిన్యాలంటే, బద్ధకం, భయం, కామ క్రోధ లోభ మోహ మద్య మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు. మాలిన్యాలంటే మనలో ఉండే అశుద్ధ తత్త్వాలు. ఈ అశుద్ధ తత్త్వాలు పోతున్న కొద్దీ సాధకునిలో ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటుంది.

మనిషి ఆలోచన, ఈ మాలిన్యాలచే ప్రభావితం అవడం చేత, ఈ ఆలోచనల వాలల్లో చిక్కుపడిపోవడం, ఫలితంగా ఈ సంక్లిష్టతలు ఏర్పడటం జరుగుతూ ఉంటుంది.

మనందరికీ శరీరాన్ని రోజూ స్నానంచేయడం ద్వారా, కనీసం వారానికొకసారి తలంటు పోసుకోవడం ద్వారా శుచిగా  ఉంచుకోవడం తెలుసును గాని, మన మనసును కూడా అదే విధంగా శుచిగా ఎలా ఉంచుకోవాలో తెలియదు. ఈ శుద్ధీకరణ లేక నిర్మలీకరణ ప్రక్రియ ఈ వెలితిని పోగొడుతుంది. ఎవరికి వారు అనుభవంలో తెలుసుకోవాడమే దీనికి నిదర్శనం.     

5 కామెంట్‌లు:

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం -మహోన్నత వ్యక్తిత్వం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - మహోన్నత వ్యక్తిత్వం   పూజ్య గురుదేవులను చూస్తే మహోన్నత వ్యక్తిత్వం అంటే ఇదేనేమోననిపి...