చతుర్విధ పురుషార్థాలు - ధర్మార్థకామమోక్షాలు
ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ నాల్గిటిని చతుర్విధ పురుషార్థాలంటారు. పురుషార్థం అంటే ఆత్మ యొక్క ప్రయోజనం లేక ధర్మం. ఇక్కడ పురుష అంటే ఆత్మ అని అర్థం. ఈ భూమ్మీద ఆత్మ ఈ నాలుగు పురుషార్థాల్లో పాల్గొనవలసి ఉంది. బృందావన వైష్ణవ సంప్రదాయం ప్రకారం, ఐదవ పురుషార్థం ప్రేమ.
ధారయతి ఇతి ధర్మః
అని ధర్మానికి నిర్వచనం చెప్తున్నాయి మన శాస్త్రాలు. పడకుండా నిలబెట్టేది ధర్మం. ధరించేది ధర్మం. ఇది మొట్టమొదటి పురుషార్థం, ఆత్మ మనుగడకి పునాది - ధర్మాన్ని తెలుసుకోవడం, ఆచరించడం. తక్కిన పురుషార్థాలు ధర్మాన్ని ఆధారంగా ఉంచుకొని నిర్వర్తించాలి. అంటే ధర్మంగా అర్థాన్ని అంటే ధనాన్ని ఆర్జించాలి. కామం కూడా ధర్మానికి అనుగుణంగా నిర్వర్తించాలి. అటువంటి ధర్మ జీవనం మోక్షానికి దారి తీస్తుందని మన శాస్త్రాలు నొక్కి చెబుతున్నాయి.
చక్కగా, సరళంగా వివరించారు. భళా !
రిప్లయితొలగించండి