పరమ పూజ్య గురుదేవులు దాజీ 68 వ జన్మదినోత్సవ సందర్భంగా, హార్దిక శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు.
వారు దీర్ఘాయుష్కులై, ఆరోగ్యంగా, భూమ్మీదకు తాను వచ్చిన కార్యసిద్ధి జరగాలని, వారి ఆశయసిద్ధిలో విజయం చేకూరాలని, మానవాళిలో వారు ఆపేక్షిస్తున్న పరివర్తన త్వరితంగా సంభవించాలని, హృదయపూర్వకంగా మన గురుపరంపరలోని మహానీయులందరినీ వేడుకుందాం.
అలాగే వారి అభ్యాసులుగా, భక్తులుగా, శిష్యులుగా, స్వచ్ఛంద సేవకులుగా, కృతజ్ఞతాపూర్వకంగా అందుబాటులో ఉంటూ స్వయం పట్ల, సంస్థ పట్ల మనం మన వంతుగా చేయవలసిన కృషిని, బాధ్యతను, నెరవేరుస్తామని మనకు మనమే త్రికరణశుద్ధిగా వాగ్దానం చేసుకుందాం.
(పూజ్య దాజీ ఈ సందర్భంగా "అందుబాటులో ఉండటం" అనే విషయంపై ఇచ్చిన సందేశాన్ని పైన వీడియో ద్వారా వినవచ్చు, చూడవచ్చు.)
సందేశ మననం
విషయం - అందుబాటులో ఉండటం. భౌతికంగానూ, ఆధ్యాత్మికపరంగానూ కూడా శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండటం అని ముఖ్యంగా దీని అర్థం. అంటే వారికి వ్యక్తిగత సేవాలని కాదు అర్థం; శిష్యుడు గురువుకు అందుబాటులో ఉండేది, కేవలం తన ఆధ్యాత్మిక పరిణతి కోసం, చైతన్య వికాసం కోసం, దివ్యయచేతన దిశగా జీవనం కొనసాగడం కోసం, నిష్కారణ ప్రేమ పెంపొందడం కోసం, ఇంకా చెప్పాలంటే ప్రేమగా మారడం కోసం, గురువు చేసే కార్యంలో సహకరించడం కోసం, గురుసేవలో ఉండటం కోసం, ఇంకా చెప్పలేనివెన్నో..
ఈ సందేశంలో బాబూజీ పలికిన 3 విస్పర సందేశాల్లోని వాక్యాలతోనూ, ఒక వాక్యం ది వెనరబుల్ అనే మాస్టరు పలికిన వాక్యంతోనూ, 2 కథలతోనూ మనందరికీ అందుబాటులో ఉండటాన్ని గురించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మానాకేదో సందేశాన్నివ్వడం జరిగింది. ఈ సందేశం ద్వారా పూజ్య దాజీ మనందరికీ ఒక్కొక్కరికీ వారికి వర్తించే సందేశం ప్రత్యేకంగా ఒక్కటైనా ఉండుంటుందని నా ప్రగాఢ విశ్వాసం. అవునో కాదో, ఎవరికి వారు శోధించి తెలుసుకోవాలని నా ప్రార్థన. ఫలితంగా మన సంస్థ సేవాలనందించడంలో గణనీయమైన మార్పు సంభావిస్తుందనిపిస్తున్నది. ఇది ఆయన ఇచ్చే ప్రతి సందేశానికి వర్తించినా, ముఖ్యంగా ఈ సందేశానికి వర్తిస్తుందనిపిస్తోంది. .
బాబూజీ విస్పర్స్ లో వ్రాసిన వాక్యంతో ప్రారంభిస్తారు; "సేవ అంటే, ఇక తన జీవితం తనది కానట్లే.. " అంటారు. విస్పర్స్ అందుకున్న మదర్ హెలీన పైరే గారు ఎన్ని వ్యక్తిగత విపత్కర పరిస్థితులున్నా, ఎన్ని అనారోగ్య సమస్యలున్నా బాబూజీ సందేశాలందుకోడానికి, తనను తాను యే విధంగా అందుబాటులో ఉంచుకునేదో ఊహిస్తే మనకు ప్రేరణ కలగాలి. అలా అందుబాటులో ఉండటం మూలంగానే ఆమె అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకుందని చెప్తున్నారు దాజీ.
అందుబాటులో ఉండటం అనే అద్భుత లక్షణానికి అద్వితీయ నిదర్శనం, ఉదాహరణాల్లో పరాకాష్ఠ సాక్షాత్తు బాబూజీ మహారాజే. వారు యే విధంగా నిరంతరం లాలాజీకి అందుబాటులో ఉండేవారో, వారి ఆజ్ఞలకు ఎంత అప్రమత్తంగా ఉండేవారో, యే విధంగా హుక్కా పీలుస్తూనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితుల్లో లాలాజీకి అందుబాటులో ఉంటూ పని చేసేవారో చాలా మంది అభ్యాసులు గమనించారని కూడా గుర్తు చేశారు.
కానీ మనలాంటి మామూలు జనం యే విధంగా అనవసరమైన విషయాలకు అందుబాటులో ఉంటూ నష్టపోతూ ఉంటామో కూడా విడమర్చి చెప్పడం జరిగింది ఈ సందేశంలో.
బావిలో కప్ప కథ ద్వారా, యే విధంగా సముద్రపు కప్ప, బావిలో కప్పకూ సముద్రం గురించి చెప్పడంలో కష్టపడుతుందో, అయినా దానికి అర్థం కాకపోవడం చెప్పడం జరిగింది. ఇక్కడ సముద్రపు ఒక రకంగా గురువు, బావిలో కప్పలా ఉన్నది మనం. బావిలో కప్పను సముద్రపు కప్పగా మార్చాలంటే మనం వ్యక్తిగతంగా సృష్టించుకున్న లోకాన్ని నాశనం చేసుకోవాలి, మన బావి అన్నాడానిలో నుండి బయట పడాలి; దీనికి సహజమార్గం సహకరిస్తుందన్నారు.
సహాజమార్గ ధ్యాన-శుద్ధీకరణాలు ఏ విధంగా విజ్ఞతకు దారి తీస్తాయో, ఏ విధంగా విజ్ఞత కూడా బావిగా మారుతుందో, అక్కడి నుండి తప్పించుకునే మార్గం అధిచేతనా స్ఫూర్తి ద్వారా మాత్రమే సాధ్యమంటారు దాజీ. ఆ స్ఫూర్తి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమన్నారు.
ఎత్తైన దృష్టికోణంతో చూసే వ్యక్తి యే విధంగా గతాన్ని, భవిష్యత్తును స్పష్టంగా వర్తమానంలో చూడగలుగుతాడో అని చెప్పడానికి మరో కథ దాజీ చెప్పడం జరిగింది. ఇది వికసించిన చేతనం వల్లే సాధ్యపడుతుంది.
అలాగే మహాభారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద అన్ని రోజులు ప్రయాణం పోకుండా పడుకోవలసి రావడాన్ని గురించిన కారణం 100 జన్మలకు పూర్వం తాను చేసిన కర్మేనని తెలుసుకునేలా శ్రీకృష్ణుడు వరం ఇవ్వడం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. అప్పుడు గాని భీష్ముని మనసుకు శాంతి కలుగదు. భగవానుడికి అందుబాటులో ఉన్నప్పుడే మనసుకు శాంతి కలుగుతుందని మరోసారి తేటతెల్లమయ్యింది.
(ఇంకా ఉంది ..)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి