ప్రపంచ ధ్యాన దినోత్సవం - పూజ్య దాజీ ఆహ్వానం
ప్రియ మిత్రులారా,
ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం. డిశంబర్ 21 న, మీలో ప్రతి ఒక్కరినీ కొన్ని నిమిషాలపాటు అంతర్ముఖులై, ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం, కాస్త విరామం తీసుకుని అందరమూ కలిసి హయానాం చేయాలని ఆహ్వానిస్తున్నాను. వేల మంది, లక్షల మంది ఒకే ధ్యానపూరిత సంకల్పంతో కలిసి కూర్చున్నప్పుడు ఒక సామరస్యంతో కూడన సూక్ష్మమైన క్షేత్రం, సమిష్టి చేతనం చేత సృష్టింపబడుతుంది. ఒక ఎగ్రెగోర్ ఏర్పడుతుంది. ఈ క్షేత్రంలో గనుక ప్రేమను నిక్షిప్తం చేయగలిగితే, అది పరివర్తన తీసుకురాగలిగే శక్తిగా మారుతుంది. కలిసి ధ్యానం చేసే ఏర్పడే శక్తి, నమ్మకంతో సంబంధించిన విషయం కాదు, కోరుకుంటే వచ్చేది కాదు. ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కనుగొన్నదేమిటంటే, ఇలా విశ్వవ్యాప్తంగా చేసే ప్రధాన ధ్యాన కార్యక్రమాల్లో, కొలిచే భౌతిక పరికరాలు క్రమపద్ధతిలో వాటంతటవే సర్దుకోవడం ద్వారా వెల్లడి అయ్యిందేమీటంటే సమిష్టి చైతన్యంలో ఒక పొందిక కనిపించింది.
శరీరంలో అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటిక్ క్షేత్రం సృష్టించేది ఈ హృదయమే. అనేక హృదయాలు ఒక్కటిగా కలిసినప్పుడు, శాంతి అనే ఒకే ఒక్క సంకల్పంతో కూర్చున్నప్పుడు కలిగే ఫలితాలు మనం కళ్ళ ముందే చూడవచ్చు, మనమే సాక్షులమవుతాం. ఈ ధ్యానం అనేది ప్రత్యేకంగా యే మతానికీ పరిమతం కాదు. అలాగే యే నమ్మకానికి గాని, యే సంస్కృతికీ పరిమితం కాదు. ఇది విశ్వజనీనంగా అందరూ స్మరించుకునే ఒక ప్రక్రియ; అన్ని హృదయాలూ కలిసే చోటుని, అత్యున్నత విజ్ఞతను తిరిగి పొందడానికి చేసే ప్రక్రియ.
మనం మౌనంగా నెమ్మదిగా కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు, శాంతి, సామరస్యం వర్ధిల్లాలన్న సత్సంకల్పాన్ని చిత్తశుద్ధితో ధారణ చేసి కూర్చున్నప్పుడు, మనకు తెలియకుండానే ఎంతో గొప్ప ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీన్ని దృవీకరిస్తోంది కూడా - దీనికి, కళ్ళూ మూసుకుని కూర్చోవడానికి ప్రత్యేకమైన శిక్షణ యేమీ అవసరం లేదని; ప్రత్యేకమైన భంగిమ అవసరం లేదని; యే మతానికి సంబంధించి ఉండవలసిన అవసరం లేదని ధృవీకరిస్తోంది.
మీ అవగాహనకు తగిన విధంగా, మీ సంప్రదాయానికి తగిన విధంగా ధ్యానించండి: మీరు హిందువైతే హృదయంలోని దివ్య వెలుగుపై, దివ్యజ్యోతిపై ధ్యానించండి; మీరు ఇస్లాం కి చెందినవారైతే నూర్-ఎ-ఇలాహీ, భగవంతుని వెలుగు అన్న భావనపై ధ్యానించండి; మీరు క్రైస్తవులైతే యేసు క్రీస్తు యొక్క ప్రేమపై ధ్యానించండి; మీరు మరేదైనా మార్గాన్ని అవలంబిస్తున్నట్లైతే, మీ అవగాహనకు తగ్గట్టుగా దివ్యవెలుగుపై ధ్యానించండి. ఒకవేళ మీరు యే దేవుణ్ణీ నమ్మనివారైతే యేమీ ఫర్వా లేదు; మీరు కేవలం మీ హృదయంలో ఉన్న ప్రేమపై ధ్యానించండి. దీన్ని మరింత సరళం చేయడానికి యూ-ట్యూబ్ లో ప్రపంచ ధ్యాన దినోత్సవం నాడు ధ్యానాన్ని చేయడానికి అంచెలంచెలుగా ఆదేశాలివ్వడం జరుగుతుంది.
దయచేసి మాతో కలవండి. కేవలం 5 నిముషాలయినా కూడా చాలా తేడా వస్తుంది. ప్రపంచానికి కాకపోయినా కనీసం మీకు ప్రయోజనం ఉంటుంది. మీ సంకల్పంలో విపరీతమైన శక్తి ఉంది. మీరు మీ పాల్గొనే విషయంలో దాని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేసుకోకండి; చిత్తశుద్ధితో ధ్యానం చేసే యే హృడయమైనా ఈ సమిష్టి చేతనాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది పరోక్షంగా చేసే ఆశాభావం కాదు; ఇది మానవ చైతన్య వికాసంలో క్రియాశీలకంగా పాల్గనడం; మనందరం విడివిడిగా ఎవరికి వారు ఉండే మనుషులం కాదన్న సత్యాన్ని గుర్తించడం; మనందరమూ ఒకరితో ఒకరు సంబంధం ఉన్న జీవులమని, వాళ్ళ శ్రేయస్సు ఒకరి మీద మరొకరిపై ఆధారపడుండన్న సత్యాన్ని గుర్తించడం.
ప్రియ మిత్రులారా, ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవంలో మనందరమూ మరోసారి నిరూపిద్దాం: మానవాళి ప్రేమపూరితంగా ఏకమైనప్పుడు, అందరికీ కావలసిన ప్రయోజనం, అద్భుతాలు కేవలం జరగడమే కాదు; అనివార్యం కూడా. అందరికీ శుభం కలుగుగాక.
దయచేసి మాతో కలవండి.
- దాజీ
తెలుగు రిజిస్ట్రేషన్ లింక్:
https://meditationday.global/te/
తప్పకుండా !! ఇది మనందరి కర్తవ్యం కూడా ! హృదయాలన్నీ ఏకమైనప్పుడు జరిగేది అద్భుతమే !!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి