2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
సాధకుడికి ప్రతి క్షణమూ ఒక నూతన సంవత్సర ఆరంభమే. ఎందుకంటే సాధకుడు ప్రతీ క్షణమూ దృష్టిలో ఉంచుకుంటూ, యే పని చేసినా, యే సంకల్పాలు చేసుకున్నా, యే ప్రయత్నాలు చేసినా, ఆధ్యాత్మిక వికాస దిశగానే ఉండాలి. మనిషి జీవించే జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థల్లో కూడా శారీరక శ్వాసతో పాటు ఆధ్యాత్మిక శ్వాస కూడా కొనసాగాలి. ప్రతీ క్షణమూ మనిషి బాహ్యంగా కూడా అన్నీ విధాలా మరింత మరింత మెరుగైన మానవునిగా తయారయ్యే పనిలో నిమగ్నమవ్వాలి.
గత సంవత్సరంలో ఆధ్యాత్మికంగా గురుదేవుల నుండి అనేక సత్సంగాలు, అనేక ప్రత్యేక సత్సంగాలు(భండారాల్లో), అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు, పరాశిక్షకుల నుండి అనేక వ్యక్తిగత ధ్యాన సిట్టింగులు, అనేక సందేశాలు, అనేక ప్రత్యేక సమావేశాలు, అనేక చర్చలు, అనేక ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం, వ్యక్తిగత సాధన, వలంటీరు సేవ, వృత్తిపరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైన బాధ్యతలు, నిర్వహించి ఉంటాం. చేతనా పరమైన వికాసాన్ని, పురోగతిని సాధించిన అనుభూతిని మనం పొందుతున్నాం. అందుకు 2025 వ సంవత్సరానికి సర్వదా కృతజ్ఞులమై ఉంటూ, పూజ్య దాజీ 2026 వ సంవత్సరం గడుపవలసిన విధానాన్ని, అనుక్షణం మనసులో ఉంచుకుంటూ, వారి సంకల్పానికి తగినట్లుగా పసిహృదయాన్ని నిలుపుకుంటూ జీవన గమనాన్ని ముందుకు సాగిద్ధాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి