5, జనవరి 2026, సోమవారం

ఏడు మాసాలలో సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయండి - పూజ్య దాజీ పిలుపు


ఇక్కడ క్లిక్ చెయ్యండి 👇


ఏడు మాసాలలో సంపూర్ణ ఆధ్యాత్మిక యాత్రను  పూర్తి చేయండి - పూజ్య దాజీ పిలుపు 
మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతకు ముందే నూతన సంవత్సర సందేశాన్ని పంచుకోవడం జరిగింది. అయినా వ్యక్తిగతంగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరం మంగళకరంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. 
మానందరమూ ఈ 2026 లో మన యాత్రను సంపూర్ణంగా పూర్తి చేయడానికి కృషి చేద్దాం. అభ్యాసంలో పూర్తిగా మునిగిపోండి. మీ సాధనను తీవ్రతరం చేసుకోండి. అప్పుడు చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో. ఈ యాత్ర కేవలం ఏడు మాసాల్లోనే పూర్తి చేయవచ్చుననేవారు. ఒక సంవత్సరం మరీ ఎక్కువ. సహజ మార్గ సిద్ధాంతాళం అనుసరించండి; మీ జీవన శైలిని మార్చుకోండి; సహజమార్గం కోరుతున్నది; సహజమార్గ పథం కోరుతున్నది; మాస్టర్లు ఎప్పుడూ కోరరు. సహజమార్గ సూత్రాలను అనుసరించడం అనేది ఈ పాఠ్యం యొక్క అవసరం. 
కాబట్టి ఈ సంవత్సరం నిజంగా ఆత్మావిష్కరణ  సంవత్సరంగా, ఆత్మసాక్షాత్కార సంవత్సరంగా పరిణమించుగాక. తథాస్తు!  
ధన్యవాదాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మానవ సేవే మాధవ సేవ

  మానవ సేవే మాధవ సేవ  ఈ వాక్యాన్ని మనందరం ఈ దేశంలో చిన్నప్పటి నుండి వింటున్నాం. మనందరికీ అర్థమైపోయిందని అనుకుంటాం  కూడా. చాలా తేలికగా వాడుకభ...