పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం - 2
సందేశాలలోనే నిక్షిప్తమైన సమాధానాలు: మొదటి సందేశంలో 2026 సంవత్సరం అంతా పసిహృదయం నిలుపుకుంటూ జీవించడం ఎలాగో విపులంగా తెలియజేయడం జరిగింది. క్లుప్తంగా ఇచ్చిన రెండవ సందేశంలో సుస్పష్టంగా చేయవలసిన అంశాలను తెలియజేశారు: 1) సహజ్ మార్గ్ సిద్ధాంతాలను అనుసరించడం 2) సహజ్ మార్గ్ అభ్యాసాన్ని - ధ్యాన, శుద్ధీకరణ, ప్రార్థనాదులను సంపూర్ణంగా అభ్యాసం చేయడం 3) ఆధ్యాత్మిక యాత్రను సంపూర్ణంగా ఏడు మాసాలలో పూర్తి చేయడం.
వీటన్నిటినీ మాస్టర్లు కోరరు కానీ, సహజ్ మార్గ్ పథం, పద్ధతి కోరుతున్నది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మన చేతనాన్ని పరిశుద్ధీకరించే అంశాలు కావున, మన చేతన వీటి సారంగా మారవలసిన అవసరం ఉంది. అంటే సాధన చేసేటప్పుడు ఉండే భావాలు, భక్తి వైఖరులు రోజు- రోజుకీ మరింత-మరింత సూక్ష్మంగా మారాలి. సూక్ష్మంగా మారాలీ అంటే వీటి యొక్క స్పష్టమైన అవగాహన సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి. అవగాహన మరింత-మరింత స్పష్టంగా అవుతున్న కొద్దీ ఆత్మవికాశం, ఆత్మ సహుదధీ అంతా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. స్పష్టమైన అవగాహన లేకపోతే సక్రమంగా సాధన ఎలా చేస్తారు? అని అంటూండేవారు పూజ్య చారీజీ. కాబట్టి మనందరమూ ఆ ప్రయత్నంలో ఉందాం.
పైవన్నీ పూర్తి చేసిన సజీవ ఉదాహరణ ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే ఆయన సాక్షాత్తు, మన కళ్ళెదురుగా ఉన్న మన సజీవ మాస్టరే - పూజ్య దాజీయే. వాయి అనుగ్రహం ఉండనే ఉంది. వారు చెప్తున్నది, బహుశా మనలో లేనిదీ మన ప్రయత్నమే. ఆ ప్రయత్నాన్ని లేక ప్రయత్న లోపాలను సరిదిద్దే మార్గాలే మనకు వారు సూచించడం జరిగింది. ఆ విధంగా మనం సాధనలో మునిగిపోవడం, సాధన తీక్షణంగా అవడం అని వారు సూచించినవి యదార్థమవుతాయి. నిజాయితీగా ప్రయత్నిద్దాం.
(సశేషం ..)
🙏🙏🙏🙏
రిప్లయితొలగించండి