మానవ సేవే మాధవ సేవ
ఈ వాక్యాన్ని మనందరం ఈ దేశంలో చిన్నప్పటి నుండి వింటున్నాం. మనందరికీ అర్థమైపోయిందని అనుకుంటాం కూడా. చాలా తేలికగా వాడుకభాషలో వాడేస్తూ ఉంటాం.
మానవునిలో మాధవుని దర్శిస్తూ చేసే సేవ మాధవ సేవ. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సేవ మాధవ సేవ.
చిన్నప్పుడు చిత్తూరు నాగయ్య గారి "భక్త పోతన" సినిమాలో ఎటువంటి మానవ సేవ మాధవ సేవో ఒక పాటలో చెప్పడం జరిగింది. అది ఇలా ఉంది -
భోగ-భాగ్యముల రోసి
ఆడంబరము తెగత్రోసి
అహము మమత త్యాగము చేసి
తనువు ధనము హరిపరముగ చేసే
మానవ సేవ మాధవ సేవ.
దీని భావాన్ని అందరూ గ్రహింతురు గాక.
సహజ్ మార్గ్ ప్రకారం మనిషి చేయగల అత్యున్నత సేవ తనను తాను సంపూర్ణంగా దివ్యంగా పరివర్తన చెందేలా సాధన చేయడమే. పాశవిక మానవుడు, మానవత్వం గల మానవుడిగాను, మానవత్వం గల మానవుడు దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే మనిషి చేయగల అతి ఉత్కృష్ట సేవ అన్నారు చారీజీ. అదే అత్యున్నత గురుదక్షిణ కూడా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి