ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
30, మార్చి 2026, సోమవారం
అభ్యాసి దినచర్య
29, మార్చి 2026, ఆదివారం
మన ఆధ్యాత్మిక పథము - సహజ్ మార్గ్ పథము
ఆధ్యాత్మిక పథం ద్వారా చేసే ప్రయాణం ఆధ్యాత్మిక యాత్ర. ఈ యాత్ర భూమిపైన చేసే ప్రయాణం లాంటిది కాదు; ఆకాశంలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; నీటిలో చేసే ప్రయాణం లాంటిది కూడా కాదు; ఆఖరికి అంతరిక్షయానం లాంటిది కూడా కాదు. మరి ఈ యాత్ర ఎలా జరుగుతూ ఉంటుంది? ఈ యాత్ర చేస్తున్నదెవరు?
ఇక్కడ యాత్ర చేస్తున్నది 'నేను' అనే జీవుడే. జీవుడంటే ఒక చేతనం. తన ప్రస్తుత చేతనంలో ఉన్న వెలితి వల్ల మరింత ఉన్నత చేతనం పొందాలన్న తపనతో ఈ యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు. అంటే ఈ యాత్ర చేతనాపరమైన యాత్ర అన్నమాట. ఈ చేతననే మనం ఎరుక, స్పృహ, చైతన్యం అన్నపదాలతో కూడా సంభోదయిస్తూ ఉంటాం. ఈ యాత్రను అందుకే చైతన్య వికాస యాత్ర అని కూడా అంటాం. ఈ వికాసం చరమ స్థాయికి చేరుకునే వరకూ, అంటే ఇక వికాసం చెందడానికి, పరిణామం చెందడానికి అవకాశం లేని అవస్థకు చేరుకునేంత వరకూ జీవుడు ప్రశాంతంగా ఉండలేడు, తాపిస్తూనే ఉంటాడు. ఈ యాత్ర ద్వారా జీవుడు తన అస్తిత్వాన్ని, తన ఉనికిని, కొంచెం-కొంచెంగా యాత్ర కొనసాగుతున్న క్రమంలో యథాతథంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఈ యాత్రలో కొన్ని ప్రధాన మైలురాళ్ళే - ముక్తి, మోక్షం, ఆత్మ సాక్షాత్కారం, లయావస్థ, అలా యాత్ర అనంతంగా కొనసాగే యాత్ర.
ఈ యాత్ర పూర్తవడానికి ఎన్ని రోజులైనా కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, ఎన్ని జనమలైనా పట్టచ్చు, క్షణంలో అయిపోవచ్చు, కొన్ని మాసాలలో అయిపోవచ్చు; అంతా జీవుడి తపన, శ్రద్ధాసక్తులపై, తన నిష్ఠపై, ఎంచుకున్న మార్గంపై, అన్నిటికంటే ముఖ్యం ఎంచుకున్న గురువుపై ఆధారపడి ఉంటుంది.
25, మార్చి 2026, బుధవారం
నాలుగు మహావాక్యాలు
24, మార్చి 2026, మంగళవారం
సహజ్ మార్గ్ లో మార్చ్ 24, 1945 ప్రాశస్త్యం
23, మార్చి 2026, సోమవారం
హార్ట్ఫుల్నెస్ లో ధ్యాన కేంద్రాల ప్రారంభోత్సవాలు
14, మార్చి 2026, శనివారం
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7
12, మార్చి 2026, గురువారం
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6
తెలంగాణా గ్రామాల్లో ధ్యానం
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 6
భారత దేశ గ్రామాల్లో ధ్యానం పరిచయం చేసే సౌభాగ్యం మనందరికీ గురుదేవుల దయ వల్ల కలుగుతూ ఉంది. అది ఒక చక్కని అనుభూతి. పైన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. ఇందులో మాట్లాడుతున్నవాళ్ళందరూ ధ్యానం సాధన చేస్తున్న మన అభ్యాసులే. ఈ వీడియో మన గురుదేవులైన పూజ్య దాజీకి బాగా నచ్చిన వీడియో.
ఆయా గ్రామాల సర్పంచ్ ల సహాయంతో లేక మన అభ్యాసుల సహాయంతో అక్కడ ప్రవేశించి అనేక గ్రామాల్లో 3 రోజుల గ్రామ-ధ్యానోత్సవాలు నిర్వహించడం కొనసాగుతూ ఉంది. ఒక గుడిలోనో లేక బడిలోనో లేక గ్రామ పంచాయితీ కేంద్రంలోనో లేక గ్రామ గ్రంథాలయంలోనో నిర్వహించడం జరుగుతూ ఉంది. కొన్ని కేంద్రాలలో సాధన చక్కగా కొనసాగిస్తున్నారు కూడా; అటువంటి చోట మన పరాశిక్షకులు తమ సేవలు అందిస్తున్నారు కూడా.
నేను నిర్వహించిన మొట్టమొదటి గ్రామం కరీంనగర్ జిల్లాలోనో హుజూరాబాద్ మండలంలోని ధర్మరాజజూపల్లిలో ధ్యానోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. హనుమంతుడి గుడిలో నిర్వహించాం. ఇప్పటికీ ఆ కేంద్రం కొనసాగుతూ ఉంది.
ఆ తరువాత అనేక గ్రామాల్లో ఈ గ్రామ-ధ్యాయణోత్సవాలు నిర్వహించడం జరిగింది. కుల, జాతి, మత బేధం లేకుండా ఆసక్తి గలవారందరికీ ఈ ధ్యానాన్ని పరిచయం చేయగలగడం మన గొప్ప అదృష్టం. మనిషి చేయగల ఉత్కృష్ట సేవ మనిషి హృదయానికి ప్రశాంతత, మనసును స్థిరంగా చేయడమే గదా. అది మన ధ్యానం ఎటువంటి నేపథ్యం నుండి వచ్చినవారికైనా తేలికగా అందిస్తుంది.
మన గ్రామాలన్నీ సాధ్యమైనంత త్వరగా ధ్యానమయమవ్వాలని అందరూ ప్రార్థిద్దాం, కృషి చేద్దాం.
లాలాజీ మహాసమాధి - 14
లాలాజీ మహాసమాధి - 14 ఆగష్ట్ 1931 శ్రీ రామ చంద్ర మిషన్, ఆదిగురువులైనటువంటి సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్రజీ మహారాజ్, కాలగర్భంలో కనుమరుగై...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...