లాలాజీ మహాసమాధి - 14 ఆగష్ట్ 1931
శ్రీ రామ చంద్ర మిషన్, ఆదిగురువులైనటువంటి సమర్థ గురు మహాత్మా శ్రీ రామ చంద్రజీ మహారాజ్, కాలగర్భంలో కనుమరుగైపోయిన ప్రాణాహుతి-ప్రసరణ విద్యను, క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుపోయి, జీవితగమనాన్ని దారి తెలియక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఆధునిక మానవుల త్వరిత విముక్తి కోసం, అతిస్వల్ప కాలపరిధిలో, ఒకే జన్మలో మానవ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునే మహడవకాశాన్ని, ఈ విద్యను, కాలగర్భంలో నుండి తన యోగశక్తితో వెలికి తీసి పునరుద్ధరించి మానవాళిని ఉద్ధరించిన మహనీయుడు పూజ్య లాలాజీ మహారాజ్.
వారి మహాసమాధి రోజు ఈ రోజు. ఫిబ్రవరి 2, 1873 న బసంత్ పంచమి నాడు జన్మించి, ఆగష్ట్ 14, 1931 న మహాసమాధిని పొడడం జరిగింది. ఇప్పటికీ వారు దివ్యలోకాల నుండి సందేశాల ద్వారా మనకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు, మన బాబూజీతో పాటుగా.
ఈ సందర్భంగా వారి సచ్ఛీలతను, వారు అందించిన సంభాషణా సూత్రాలు, జీవిత పరమార్థాన్ని తెలుసుకునే జీవన విధానాన్ని, సంసార జీవితాన్ని కొనసాగిస్తూ అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకునే జీవన విధానాన్ని, బోధలను మనం పునః స్మరించుకుని, ప్రత్యేకమైన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఎంతో భక్తిశ్రద్ధలతో ధ్యానించుకోవలసిన సందర్భం ఈ రోజు.
మనందరమూ వారి అనుగ్రహానికి పాత్రులమై మన జీవితాలను సార్థకం చేసుకోవాలని పూజ్య లాలాజీని ప్రార్థిస్తూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి