ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
3, ఏప్రిల్ 2024, బుధవారం
బాబూజీ సందేశమాలిక 13 - నేతి నేతి - Neti Neti
బాబూజీ సందేశమాలిక 12 - సహజ మార్గ మూల సిద్ధాంతాలు - Fundamental Principles of Sahaj Marg
2, ఏప్రిల్ 2024, మంగళవారం
సందేశమాలిక 11 - భగవంతుని సరళంగా సాక్షాత్కరించుకోవచ్చు - God can be realised in a simple way
భగవంతుని సరళంగా సాక్షాత్కరించుకోవచ్చు
(బెంగుళూరు 20 జూన్ 1967)
God can be realised in a simple way
(Bangalore 20 June 1967)
The time has come that man is awakened to the need of spirituality. The force of creation has created outward tendencies in man. That is why, over the course of time he has created several worlds which has resulted in making him complex. The present imperfect state of mind is the result of his own doings. Unfortunately, the basic fact that God is simple and can be achieved by simple means is lost sight of.
God is the subtlest being and in order to realise Him the subtlest means are the only way. This does not mean that for realising God one has to ignore the needs of the physical body or the empirical world. If perchance we fall upon the means which go on adding grossness we shall definitely remain away from the vision of Absolute Reality. It is an established fact that meditation is a subtle method, provided the object of meditation is not concrete. That is why under Sahaj Marg we advise to meditate supposing the presence of Divine light in the heart. The upanishads also corroborate this. This practice supported by the transmission of the Divine Effulgence becomes subtler and subtler until it becomes the subtlest.
మనిషి ఆధ్యాత్మికత యొక్క ఆకసారానికి మేల్కొనే సమయం ఆసన్నమయ్యింది. సృష్టిలోని శక్తి, మనిషిలో బాహ్య ప్రవృత్తులను బాగా సృష్టించింది. అందుకే కాలక్రమేణా మనిషి అనేక ప్రపంచాలను సృష్టించుకున్నాడు, ఫలితంగా అవన్నీ మనిషిని జటిలంగా తయారు చేశాయి. ప్రస్తుత అపరిపూర్ణమైన మనసుకు కారణం మనిషి స్వయంగా తాను చేసుకున్న కృత్యాలే. దురదృష్టవశాత్తు, భగవంతుడు సరళుడని, ఆయనను తెలుసుకోవడం కూడా సరళమేనన్న మౌలిక యదార్థం మనిషికి కనుమరుగైపోయింది.
భగవంతుడు అతి సూక్ష్మ అస్తిత్వం; ఆయన్ని సాక్షాత్కరించుకోవాలంటే అతి సూక్ష్మ మార్గం మాత్రమే ఏకైక మార్గం. అంటే దీనర్థం శారీరక అవసరాలను లేక ప్రాపంచిక అవసరాలను గాని నిర్లక్ష్యం చేయమని కాదు. ఒకవేళ దురదృష్టవశాత్తు రోజురోజుకూ మనలో జడత్వాన్ని పెంపొందించే మార్గంలో ఉన్నామనుకోండి, తప్పనిసరిగా ఆ పరమ అస్తిత్వం నుండి దృష్టి మరలిపోయి దూరంగా ఉండిపోతాం. ధ్యాన వస్తువు జడమైనది కాకపోయినట్లయితే, ధ్యానం అనేది చాలా సూక్ష్మ పద్ధతి అనేది స్థాపించబడిన సత్యం. అందుకే సహజ మార్గంలో హృదయంలో ఒక దివ్య వెలుగుందన్న భావనపై ధ్యానించమంటాము. ఉపనిషత్తులు కూడా దీనితో ఏకీభవిస్తాయి. ఈ సాధన దివ్య తేజస్సు యొక్క ప్రసరణ సహాయంతో మరింత మరింత సూక్ష్మంగా తయారై, సూక్ష్మాతిసూక్ష్మంగా అయ్యేవరకూ కొనసాగుతుంది.
సందేశమాలిక 10 - భగవంతుని కలిగి ఉండటమే అసలు ఆధ్యాత్మికతలోని విషయం - Having God is the real subject of spirituality
(యోగాశ్రమ ప్రారంభం హైదరాబాదు, 28 మే 1967)
Having God is the real subject of spirituality
(Opening of Yogashram, Hyderabad, 28 May 1967)
There are so many among us who have the idea that simply knowing of God is enough. This is their wrong conception. Having God is the real subject of spirituality.
If we proceed methodically, experiences are there and transformation takes its root from the very first day.Of course, there are experiences in the beginning which are mixed up with imaginary ideas, but as we proceed on we come to that sort of experience in the end which requires no other experience.
In our Sahaj Marg system a teacher takes out the hurdles in the progress of the seeker and side by side, imparts the divine effulgence in him, which if the abhyassi does it himself takes hundreds of years and often fails to clean his system. We start with meditation upon the heart, taking the object of meditation as subtle as possible.
I earnestly pray that all of us, leaving our prejudices, may come to the path of righteousness which promises Liberation.
కేవలం భగవంతుని గురించి తెలుసుకుంటే చాలని భావించేవాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ఇది వారి పొరపాటు భావన. భగవంతుని కలిగి ఉండటం అనేది ఆధ్యాత్మికత యొక్క అసలు విషయం.
పద్ధతిగా ముందుకు కొనసాగితే, అనుభవాలున్నాయి, మొట్టమొదటి రోజు నుండే పరివర్తన కూడా చోటు చేసుకుంటుంది. అయితే మొదట్లో మన ఊహాత్మక ఆలోచనలతో కలిసిన అనుభవాలుంటాయి, కానీ ముందుకు సాగుతున్న కొద్దీ, చివరిలో ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే, ఇహ దాని తరువాత మరే అనుభవమూ అవసరం ఉండని అనుభూతి కలుగుతుంది.
సహజ మార్గ పద్ధతిలో గురువు సాధకుడికి ఏర్పడే అవరోధాలను తొలగిస్తూ ఉంటాడు, అలాగే ప్రక్కప్రక్కనే అతనిలో దివ్య ప్రకాశాన్ని కూడా నింపుతూ ఉంటాడు. అదే సాధకుడు తన స్వంతంగా చేసుకుంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, తన శరీరవ్యవస్థను శుద్ధి చేసుకోలేకపోవచ్చు కూడా. మనం ఇక్కడ హృదయంపై ధ్యానిస్తాం, మనం ధ్యాన వస్తువును సాధ్యమైనంత సూక్ష్మంగా ఉంచి ధ్యానిస్తాం.
మనందరం ఏర్పరచుకున్న దురభిమానాలు, అభిప్రాయాలు అన్నీ విడిచిపెట్టేసి, తప్పక మోక్షాన్ని ప్రసాదించే ఈ ధర్మ మార్గంలోకి రావాలని త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తున్నాను.
1, ఏప్రిల్ 2024, సోమవారం
బాబూజీ సందేశమాలిక 9 - భగవంతునిలో లయం - Becoming one with God
బాబూజీ సందేశమాలిక 8 - ఆత్మసమర్పణ - Self - surrender
బాబూజీ సందేశమాలిక 7 - అభ్యాసి పాత్ర - Role of an abhyasi
అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు
అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...