23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

గురువు లేక మాస్టర్ - 1

గురువు లేక మాస్టర్ - 1 

బాబూజీ ప్రకారం నిజమైన మాస్టర్ అంటే ఆ పరతతత్వమే, ఆపరమాత్మే.  భూమిపై అవతరించిన మాస్టర్లందరూ ఆ పరతత్త్వం యొక్క ప్రతినిధులు మాత్రమే. 

దుర్లభం త్రయం యేవ యేతద్ దేవానుగ్రహ హేతుకమ్ |
మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః ||
- వివేకచూడామణిలో ఆదిశంకరులు

తాత్పర్యం:  
 మానవ జన్మ, మోక్షం కోసం తపన, మహాపురుషుడు, అంటే సమర్థుడైన గురువు యొక్క ఆశ్రయం - ఈ మూడూ చాలా దుర్లభం అంటారు ఆదిశంకరులవారు. 

సంస్కృత భాషలో 'గు' అంటే అంధకారం, ఆవిద్యా, అజ్ఞానం. 'రు' అంటే  ఆధ్యాత్మిక ప్రకాశంతో అంధకారాన్ని పోగొట్టేవాడు. కాబట్టి 'గురు' అంటే ఆధ్యాత్మిక వెలుగుతో అజ్ఞానాన్ని పోగొట్టేవాడని అర్థం. 

సహజమార్గంలో గురువు ప్రాముఖ్యత 
సహజ మార్గ ఆధ్యాత్మిక ధ్యాన పద్ధతిలో గురువును మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే కేవలం ఆచార్యుడో లేక బోధించేవాడో మాత్రమే కాదు. మాస్టర్ అంటే కేవలం మార్గదర్శకుడు మాత్రమే కాదు. భగవంతునికి, మనిషికీ మధ్య వారధి గురువు అంటే. 

మాస్టర్ అంటే గమ్యాన్ని చేరుకునున్నవాడు; ఆ మార్గం గుండా పైకి-క్రిందకీ ఎన్నో మార్లు ప్రయాణించినవాడు; మన చేయిపట్టుకుని మనం ప్రస్తుత స్థితి నుండి చేరవలసిన గమ్యం వరకూ తీసుకు వెళ్ళగలిగే సమర్థుడు. మాస్టర్ అంటే ఉదాహరణగా జీవించేవాడు; మాస్టర్ అంటే ప్రాణాహుతి ప్రసరణ చేయగలిగినవాడు. మాస్టర్ అంటే మనలో క్రమశిక్షణ పెంపొందించగలిగేవాడు; మాస్టర్ అంటే పరిపూర్ణతను సిద్ధించుకున్న మహనీయుడు; మాస్టర్ అంటే మానవ స్థాయి నుండి అతీతంగా దైవిక స్థాయికి చేరుకున్న మహానుభావుడు; పరిశుద్ధ హృదయుడు. 
 
సహజ మార్గ పద్ధతిలో మాస్టర్ తమలాగే ఇతరులను కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. మాస్టర్ అంటే అన్నీ విధాలా తనపై తాను పట్టు సంపాదించుకున్నవాడు; మాస్టర్ అంటే స్వచ్ఛమైన ప్రేమ తత్త్వము, ప్రేమ స్వరూపుడు; మాస్టర్ నిస్వార్థ సేవకుడు, తనను తాను పట్టించుకోకుండా ఆవిశ్రాంతంగా నిరంతరమూ సేవలనందించేవాడు. మాస్టర్ లేనిదే సాధకునిలో ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమవడమే సాధ్యం కాదు. సహజ మార్గంలో అభ్యాసి పాత్ర కంటే మాస్టర్ పాత్రే అధికం; కానీ అభ్యాసి సహకారం లేనిదే వారి ప్రయత్నం సరిగ్గా నెరవేరదు. సహజ మార్గ మాస్టర్లు తయారు చేసేది శిష్యులను కాదు, తమ వంటి మాస్టర్లను తయారు చేస్తారు. 

21, ఫిబ్రవరి 2024, బుధవారం

బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 4

 బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము  - 4










 

బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 3

బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము  - 3 













బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 2

 

బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము  - 2












బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథము - 1

 

బాబూజీ ఆవిష్కరించిన  సహజ మార్గ ఆధ్యాత్మిక పథము












యాత్ర అంటే ఏమిటి?












17, ఫిబ్రవరి 2024, శనివారం

శ్రీరామచంద్ర మిషన్ - సహజ మార్గ చిహ్నం

 


శ్రీరామచంద్ర మిషన్ - సహజ మార్గ చిహ్నం (ఎంబ్లెమ్)

శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలో పైన కనిపిస్తున్న చిహ్నాన్ని అభ్యాసులందరూ ధరిస్తూ ఉంటారు. ఇది బాబూజీ ప్రవేశపెట్టిన క్రమశిక్షణ. కనీసం  మూడు ధ్యాన తరగతుల ద్వారా సహజ మార్గ సాధనలో ప్రవేశించిన వ్యక్తిని అభ్యాసి అని పిలుస్తారు. 

ఈ చిహ్నాన్ని గురించి బాబూజీ స్వయంగా తన "రియాలిటీ ఎట్ డాన్" (సత్యోదయం) అనే పుస్తకంలో వివరంగా వ్రాయడం జరిగింది. 

ఉత్తర ప్రదేశ్ లోని ఫతేగఢ్ కు చెందిన మహా మహితాత్ముడైన  సమర్థ గురు, మహాత్మా శ్రీరామ చంద్ర జీ మహారాజ్ స్మృతిలో స్థాపింపబడిన ఈ సంస్థలో అనుసరించే ధ్యాన పద్ధతిని గురించి సంపూర్ణంగా పైన చిహ్నంలో పొందుపరచబడింది. దివ్యలోకాల నుండి పూజ్య లాలాజీ మహారాజ్, స్వామి వివేకానందలు అందించిన మార్గదర్శనంలో ఈ ఎంబ్లెం రూపొందించబడింది. ఈ సంస్థలో అనుసరించే ధ్యాన పద్ధతి పేరు సహజ మార్గం లేక సహజ పథం.

అడుగున స్వస్తిక చిహ్నం మన ఆధ్యాత్మిక యాత్ర యొక్క ప్రారంభస్థానాన్ని సూచిస్తుంది. ఇది, మనం మార్గంలో అనుసరించే  వివిధ రూపాలు, క్రతువులు, వివిధ ఆచారవ్యవహారాల దశను ఈ స్వస్తిక్ సూచిస్తుంది. హిందీలో 'సహజ మార్గ్ 'అనే అక్షరాలు, దారిలో ప్రకృతే స్వయంగా ఏర్పరచే కష్టాలు, అవరోధాలనే  పర్వతాలను  చీల్చుకుంటూ వెళ్ళే దారిని, ప్రకృతే స్వయంగా ఏర్పరచిన దారిని  సూచిస్తాయి. ఇలా వివిధ సాంద్రతలు గల వెలుగు-నీడల గుండా, పయనిస్తూ, చంద్రుడిని, సూర్యుడిని దాటుకుంటూ ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మరింత సూక్ష్మ స్థితులను దాటుతూ అత్యున్నత శిఖరస్థితికి చేరుకుంటాం. ఉదయిస్తున్న సూర్యుడు వెదజల్లే వెలుగున్న ప్రదేశం సమర్థ గురు మహాత్మా శ్రీరామ చంద్రజీ ప్రారంభించిన నూతన ఆధ్యాత్మిక శకాన్ని సూచిస్తున్నది. ఈ వెలుతురు మనం సహజ మార్గంలో మన యాత్ర ప్రారంభమైనప్పటి నుండి అన్ని దశల్లోనూ అంతటా, ఆయా క్షేత్రాలపై ఆధిపత్యం వహిస్తూ ఈ వెలుగు వ్యాపించి ఉంటుంది. 

సృష్టి ఉనికిలోనికి రాక పూర్వం ఉన్నది చీకటేనని చెప్పాలి. చీకటి అంటే వెలుతురు లేదు; వెలుతురు అంటే చీకటి ఉండదు. వెలుతురు లేకపోతే ఉండేది ఏమిటి అని అంటే, చీకటి అనే చెప్తాం. మొత్తం సృష్టి అంతా మహాప్రళయంలో ముగిసిన తరువాత ఏముంటుంది? శూన్యత్వం అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ 'చీకటి', 'శూన్యత్వం' అనే పదాలు ఇంకా అందులో యేదో ఉన్నట్లుగానే తోచేలా చేస్తున్నాయి. కాబట్టి యదార్థం నుండి ఇంకా దూరంగా ఉన్నట్లే. పైన చెప్పినదాన్ని, వెలుగు లేని, చీకటి కూడా లేని స్థితి అని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో. అది మార్పులేనిది, సనాతనమైనది. మన ప్రస్తుత అస్తిత్వం, అదిగో అంత పరిపూర్ణమైన, అంత స్వఛ్ఛమైన స్థితి నుండి వికాసం చెందింది. చిహ్నంలో అన్నిటికంటే పైభాగంలో ఉంది ఈ శాశ్వత శాంతి ప్రదేశం. ఇక్కడ వెలుగు కానీ చీకటి కానీ ఉండదు. ఈ స్థితిని ఓమ్ తత్ సత్ అని సూచించబడింది.  దాని క్రింద 'సత్య పద్' అనే ప్రదేశం ఉంది; అక్కడ సత్య పదార్థం ప్రబలంగా ఉంటుంది; కాబట్టి చాలా సూక్ష్మ స్థితిలో ఉన్నా, ఇది వెలుతురుతో నిండిన ప్రదేశం. 

బాబూజీ స్వయంగా ఈ చిహ్నాన్ని తన హృదయభాగంలో ధరించేవారు; పూజ్య చారీజీ కూడా ఈ చిహ్నాన్ని ధరించేవారు;  ప్రస్తుతం పూజ్య దాజీ కూడా అదే హృదయ స్థానంలో బ్యాడ్జీ ధరించడం గమనించవచ్చు. ఈ చిహ్నం ప్రతి అభ్యాసి ధరించడం వల్ల, అభ్యాసికి తన జీవిత గమ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, సహజ మార్గ  ఫిలాసఫీని గుర్తు చేస్తూ ఉంటుంది; నిరంతరం ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అభ్యాసి దీన్ని ఆత్మవిశ్వాసంతో, సగర్వంగా ధరించగలిగేది ఎప్పుడూ అంటే, తాను అవలంబిస్తున్న ధ్యాన పద్ధతిపైన, మార్గదర్శనం చేసే మాస్టరుపైన, ఈ ఆధ్యాత్మిక సేవలందిస్తున్న సంస్థపైన గట్టి నమ్మకం ఏర్పడినప్పుడు ఈ విధంగా ధరించగలుగుతాడు. 





16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతి - 3

 




సాయంకాలం  శుద్ధీకరణ

హార్ట్ఫుల్నెస్  ధ్యాన పద్ధతిలో మూడవ యౌగిక ప్రక్రియ శుద్ధీకరణ ప్రక్రియ. ఈ ప్రక్రియలో సాధకుడు తన సంకల్ప శక్తిని చురుకుగా వినియోగిస్తూ,  ప్రపంచంతో వ్యవహరించే సమయంలో తన హృదయంపై ఏర్పరచుకున్న ముద్రలను ప్రతి రోజు, ఏరోజుకారోజు తొలగించేసుకునే ప్రక్రియ. దీని వల్ల సాధకుడు  గతం నుండి క్రమక్రమంగా విముక్తుడవడమే గాక,  ఆ మరునాడు ధ్యానం చాలా తేలికగా లోలోతుల్లోకి వెళ్ళడానికి తోడ్పడుతుంది. శుద్ధీకరణ సాధకుడిలోని మలినాలను, జటిల తత్త్వాలను  తొలగించి, ధ్యానానికి అడ్డుపడే అవరోధాలను నిర్మూలిస్తుంది. ఈ శుద్ధీకరణ ప్రక్రియను ప్రతి రోజూ, ఆ రోజుకు సంబంధించిన  తన పనులన్నీ ముగించుకున్న తరువాత 20-30  నిముషాలు చేయవలసిన ప్రక్రియ.

 రాత్రి పడుకొనే ముందు ప్రార్థనా-ధ్యానం

ఉదయం ధ్యానం, సాయంకాలం శుద్ధీకరణ తరువాత రాత్రి సరిగ్గా పడుకొనే ముందు చేసేది ప్రార్థనా-ధ్యానం.  ప్రతి రోజూ చిట్టచివరిన చేసే పని. కోరికల్లేకుండా, వినమ్ర భావంతో, శరణాగతి ధోరణిలో భగవంతుని స్మరిస్తూ, సాధకుడు తన నిస్సహాయతను వ్యక్తం చేయడమే ప్రార్థన. ఇటువంటి ప్రార్థనాపూర్వకమైన స్థితి ఈ క్రింది నాలుగు పంక్తులను మనస్ఫూర్తిగా మనసులో అనుకున్నప్పుడు సంభవిస్తుంది. ఆ క్షణమే సాధకుడు తన అంతర్యామితో అనుసంధానమవడం జరుగుతుంది.  

ఓ, మాస్టర్!

మానవ జీవితమునకు యదార్థ లక్ష్యము నీవే.

మేమింకనూ కోరికలకు బానిసలమై యుండుట 

మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది.

మమ్ము ఆ దశకు జేర్చు, ఏకైక  స్వామివి, శక్తివీ నీవే.


ప్రారంభించు విధానం

ఈ ధ్యాన పద్ధతిని అనుసరించి ప్రయత్నించాలనుకున్నవారు, సమీప హార్ట్ఫుల్నెస్ ట్రైనరును, లేక సమీప ధ్యాన కేంద్రాన్ని సంప్రదించగలరు. వారితో 3 రోజులు, ముఖాముఖీ కూర్చొని ధ్యాన సిట్టింగులు తీసుకోవలసి ఉంటుంది. ఆ తరువాత ఎవరికి వారు తమ స్వంతంగా సాధన చేసుకోవచ్చును. అవసరమైనప్పుడల్లా ట్రైనర్ల సహాయం కోరవచ్చును. ఇది శ్రేష్ఠమైన విధానం. మరొక మార్గం పైన చెప్పిన హార్ట్ఫుల్నెస్ ఆప్ ద్వారా కూడా ప్రారంభించవచ్చును.

కనీసం 3 మాసాలు నిర్దేశించిన విధంగా సాధన చేసినట్లయితే, సాధకులు తమలో సహజమైన మార్పులు చోటు చేసుకోవడం గమనించగలుగుతారు. 


ఛాదస్తం

  ఛాదస్తం   మనలను మనం పరిశీలించి చూసుకుంటే ఎన్నో ఛాదస్తపు అలవాట్లు మనకే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఉండటమే గాకుండగా వాటిని పాటిస్తున్నందుకు గర్వపడ...