నాలుగు మహావాక్యాలు
నాలుగు మహావాక్యాలు వేదోపనిషత్తుల ఉద్ఘోషలు. మన ప్రాచీన ఋషుల ప్రత్యక్షానుభూతులు. వీటిపై మహాభాష్యాలు వ్రాయడం ద్వారా ప్రాచుర్యంలోకి వీటిని తీసుకు వచ్చిన మహాత్ములు, శ్రీ ఆది శంకరాచార్యులవారు. జీవాత్మ, పరమాత్మలో సంపూర్ణ ఐక్యం పొందడమనే మానవ జీవిత పరమార్థాన్ని, వెల్లడించే నాలుగు మహా వాక్యాలు ఇలా ఉన్నాయి:
1) ప్రజ్ఞానం బ్రహ్మ : ఐతరేయ ఉపనిషత్తులో నుండి గ్రహించినది, ఋగ్వేదానికి సంబంధించినది. చైతన్యమే బ్రహ్మము అని దీని అర్థం. అందుకే బ్రహ్మ నిర్వచన వాక్యం, బ్రహ్మ లక్షణ వాక్యం అని కూడా సంభోదిస్తారు.
2) అహం బ్రహ్మాస్మి : బృహదారణ్యక ఉపనిషత్తులో నుండి గ్రహించినది, యజుర్వేదానికి సంబంధించినది. దీన్ని అనుభవ వాక్యం అని కూడా అంటారు.
3) తత్త్వమసి : ఛాందోగ్యోపనిషత్తు నుండి గ్రహించినది, సామవేదానికి సంబంధించినది. దీన్ని ఉపదేశ వాక్యం అని కూడా అంటారు.
4) అయమాత్మ బ్రహ్మ : మాండూక్యోపనిషత్తులో నుండి గ్రహించినది, అథర్వ వేదానికి సంబంధించినది. ఈ వాక్యం ప్రత్యక్షానుభవాన్ని సూచిస్తుంది. సాక్షాత్కార వాక్యం అని కూడా అంటారు.
అన్నా మూడవ వాక్యానికి నాలుగవ వాక్యానికి అర్థం తెలుపగలరు
రిప్లయితొలగించండి