ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
24, మే 2025, శనివారం
చింతలు - Worries
21, మే 2025, బుధవారం
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు షడ్రిపులు - అరిషడ్వర్గాలు
సనాతన సంస్కృతిలో పుట్టి, పెరిగిన ప్రతి వ్యక్తీ ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే పదబంధాన్ని వినే ఉంటారు, దాన్ని గురించి అంతగా పట్టించుకోకపోయినా. వీటినే షడ్రిపులని, అరిషడ్వర్గాలని కూడా అంటారు మన శాస్త్రాలలో. ఈ ఆరు ప్రవృత్తులు మనిషి చైతన్య వికాసంలో, ఆత్మవికాసంలో పెద్ద అవరోధాలు, ఆత్మకు శత్రువులు. ఇవి లేని వ్యక్తి ఉండటం చాలా అరుదు.
అయితే వీటిని పూర్తిగా తొలగించుకోగలమా? శుద్ధ చైతన్య స్థితిని అనుభూతి చెందగలమా? ఒకవేళ తొలగించుకోగలిగితే ఎలా?మన శాస్త్రాలు ఏమంటున్నాయి? మన సహజ్ మార్గ్ గురుపరంపరలోని మాస్టారలేమంటారు? క్లుప్తంగా పరిశీలిద్దాం
వీటిని పూర్తిగా తొలగించలేము కాని వీటిని అదుపులో పెట్టుకోవచ్చని, అంటారు మన శాస్త్రకారులు. మరికొందరు పూర్తిగా తొలగించుకోవచ్చని కూడా అంటారు. అయితే ఇక్కడ పూర్తిగా తొలగించుకోవడం అంటే వీటి ప్రభావం ఆత్మపై ఉండకుండా చేసుకోవచ్చని చెప్తారు.
శాస్త్రకారులకు కొంచెం భిన్నంగా సహజ్ మార్గ్ మాస్టర్ పూజ్య బాబూజీ మహారాజ్ గారు ఈ షడ్రిపుల్లో కామం, క్రోధం అనేవి దైవదత్తమని, భగవంతుడు సృష్టించినవని, వీటిని పూర్తిగా తొలగించలేమని, తక్కినవి మనిషి సృష్టించుకున్నవి కావున వీటిని పూర్తిగా సహజ్ మార్గ్ సాధన ద్వారా తొలగించుకోవచ్చని తెలపడం జరిగింది. కామం భగవంతుడిని కోరుకోడానికని, ఆ కోరుకున్నదానికి అవరోధంగా నిలిచేవాటి పట్ల కోపం చూపించడానికి క్రోధం ఉన్నదని పూజ్య చారీజీ వివరించారు.
భగవద్గీత
ఇంద్రియపరమైన విషయాలను తదేకంగా ఆలోచించుటవల, మోహం ఏర్పడి, మోహం కోరికగా మారుతుంది, కోరిక నెరవేరనప్పుడు అది కోపంగా మారుతుంది, కోపం అదుపులో లేనపుడు అది భ్రాంతిగా మారుతుంది. భ్రాంతి వలన స్మృతిని కోల్పోవడం జరుగుతుంది ; స్మృతిని కోల్పోవడం వల్ల వివేకం నశిస్తుంది; వివేకం నశించడంతో మనిషి వినాశనమవుతాడు.
20, మే 2025, మంగళవారం
భయం
8, మే 2025, గురువారం
అలసత్వం - బద్ధకం
అలసత్వం - బద్ధకం
బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యపోకండి. ఉన్నాయి.
అసలు బద్ధకానికి మూల కారణలేమిటో చూద్దాం. 1) స్పష్టమైన ప్రయోజనం లేనప్పుడు, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు లేనప్పుడు 2) విఫలమవుతామన్న భయం ఉన్నప్పుడు లేక మనలో కొరతలున్నప్పుడు 3) చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నా లేక పెద్దవిగా ఉన్నా వచ్చేది 4) శక్తి లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు 5) సుఖం ఎక్కువైనప్పుడు లేక మనసును మళ్ళించే విషయాలున్నప్పుడు 5) నకారాత్మకమైన ఆలోచనా విధానం ఉన్నప్పుడు.
మరో దృష్టి కోణంలో నుండి చూస్తే ఆశ్చర్యకరంగా బద్ధకం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి: 1) సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది - ఎందుకంటే బద్ధకస్తులు కష్టమైన పనులు త్వరగా/సరళంగా చేసే మార్గాలు వెతుకుతారు; నేను కష్టమైన పనిని బద్ధకస్తుడికి అప్పగిస్తాను, ఎందుకంటే పని పూర్తి చేయడానికి అతను తేలిక మార్గం వెతుకుతాడు - బిల్ గేట్స్ 2) విశ్రాంతిని, శక్తిని కూడగట్టుకునేలా చేస్తుంది 3) మనలోని సృజనాత్మకతను పూరికొల్పుతుంది 4) కలిసిగట్టుగా పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, ఇతరులకు పని అప్పగించడం నేర్పిస్తుంది 5) ఆలోచింపజేస్తుంది, పని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచింపజేస్తుంది 6) ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది.
అయితే ఆధ్యాత్మిక సందర్భంలో ఆలోచిస్తే, నిత్యం ఆధ్యాత్మిక సాధన చేయకపోవడానికి ముఖ్య కారణం బద్ధకమే. దీనికి పైన చెప్పిన కారణాలు గనుక మనలో ఉన్నట్లయితే, వాటికి పరిష్కారాలు కూడా తరచి చూస్తే వాటిల్లోనే కనిపిస్తాయి.
అయితే అస్సలు బద్ధకం లేకుండా ఉండగలమా అన్నది ప్రశ్నే. అయితే పూజ్య చారీజీ కాస్త వెసులుబాటు కల్పించినట్లుగా అనిపించింది - పని లేనప్పుడు బద్ధకించవచ్చు గాని, పని ఉన్నప్పుడు బద్ధకించరాదన్నారు చారీజీ. తప్పక దీన్ని ప్రతి సాధకుడు పరిష్కరించుకోవలసినదే. ఆలోచించండి!
14, ఏప్రిల్ 2025, సోమవారం
శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్
12, ఏప్రిల్ 2025, శనివారం
భక్త హనుమాన్ జయంతి
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ
మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్భవేత్.
1, ఏప్రిల్ 2025, మంగళవారం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
సత్సంగ్ ప్రాశస్త్యం
సత్సంగ్ ప్రాశస్త్యం సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...