12, ఏప్రిల్ 2025, శనివారం

భక్త హనుమాన్ జయంతి

 

 భక్త హనుమాన్ జయంతి 

హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హనుమంతుని పాత్ర ఎంత విశిష్ఠమైనదో మనందరికీ తెలిసినదే. భారతీయ సనాతన ధర్మంలో హనుమంతులవారు భక్తాగ్రేశ్వరులుగా పూజింపబడతారు.  భక్తికి పరాకాష్ఠగా హనుమంతులవారినే స్మరిస్తాం మనం. అలాగే వారి అమేయ శక్తికి, అపూర్వ వ్యక్తిత్వానికి, సౌశీల్యానికి, నడవడికి, ఆదర్శప్రాయులు. వీరి వ్యక్తిత్వాన్ని జూచి సాక్షాత్తు శ్రీరాములవారే, స్వయంగా, మొట్టమొదటసారి చూచినప్పుడే ముగ్ధులయిపోయారట. 

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ 

మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ 

హనుమత్ స్మరణాద్భవేత్.

తాత్పర్యం: కేవలం హనుమంతులవారి స్మరణ మాత్రం చేత బుద్ధిబలం, యశస్సు(సత్కీర్తి), నిర్భయత్వం, రోగరాహిత్యము, అజాడ్యము, వాక్పటుత్వం  సిద్ధిస్తాయట. అటువంటిది వారి వ్యక్తిత్వం. 

వారి భక్తి స్వార్థరహితమైనది, అచంచలమైనది, పరిశుద్ధమైనది. తన కోసం యేమీ కోరని వ్యక్తి, కేవలం శ్రీరామ సేవ తప్ప. భౌతిక శక్తికి, పరాక్రమానికి మారు పేరు. రాక్షసులను చంపినవారు, విశాల  మహాసముద్రాన్ని లంఘించినవారు, లక్ష్మణుడిని రక్షించే నిమిత్తం హిమాలయాల నుండి ఒక పర్వతాన్నే మోసుకువచ్చిన ఘనులు హనుమంతులవారు. అద్భుతమైన వక్త, తర్కంలో నిష్ణాతులు, సమర్థవంతమైన రాయబారి. వేదాల జ్ఞానం కలిగినవారు, మొట్టమొదటి వయ్యాకరణులు (అంటే వ్యాకరణంలో నిష్ణాతులు) - ఒకసారి వాల్మీకి మహార్షినే సరిదిద్దినవారు. అస్సలు భయం లేనివారు, ముఖ్యంగా దుష్టశక్తులతో పోరాడటంలో అమితమైన ధైర్యాన్ని కనబరచేవారు. అమితమైన ఆత్మవిశ్వాసం, జన్మతః దివ్య ప్రయోజనం పట్ల ఆమోఘమైన స్పష్టత గలవారు. అసాధ్యమైనవి సాధించినప్పటికీ కూడా వారిలో అహంకారం ఉండేది కాదు, తన శక్తి-పరాక్రమాలను గురించిన ఆడంబరము ఉండేది కాదు. గొప్ప వినమ్రత గలవారు. తన విజయాలకు కారణం అంతా కేవలం శ్రీరాముని అనుగ్రహమేనని, తన శక్తులు కావని భావించేవారు హనుమంతుల వారు విధేయతలో పరాకాష్ఠ, ఇంద్రియ నిగ్రహము, స్థిరచిత్తము, గలవారు.
 
కాన్హా శాంతి వనంలో, యాత్రా గార్డెన్ లో సీతారామలక్ష్మణహనుమత్సమేత విగ్రహం
   
సహజమార్గ గురుపరంపరలోని మాస్టర్లు కూడా ఆధ్యాత్మిక చైతన్య వికాసాన్ని గురించి వివరిస్తున్నప్పుడు హనుమంతులవారిని స్మరించడం మనం గమనిస్తాం. ముఖ్యంగా 13 చక్రాల మన ఆధ్యాత్మిక యాత్రలో సాధకుడు 9 వ చక్రం చేరుకున్నప్పుడు హనుమంతులవారి చేతనాన్ని అనుభూతి చెందడం జరుగుతుందన్నారు. హను అంటే లేకపోవడం అని, మాన్ అంటే అహం. అంటే అహం లేనివాడు మాత్రమే భాకతుడవుతాడాని అర్థం. ఈ వాక్యాలు పూజ్య లాలాజీ పలికినవి. ఇదే అర్థం పూజ్య దాజీ కూడా పడే పడే ఇటమకించడం మనం గమణిస్తూనే ఉన్నాం. భక్తికి ప్రధాన యోగ్యత ఆహాన్ని త్యజించడమేనన్నారు లాలాజీ. అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోడాలచుకున్నవారు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు. అలాగే పూజ్య దాజీ, హనుమాన్ లో రెండు గొప్ప లక్షణాలను ఉల్లేఖించారు 1) నేను నా స్వామితో కూడి ఉన్నంత సేపూ యేదీ తప్పవడానికి వీల్లేఎదన్న ధీరత్వం 2) వినమ్రత




1 కామెంట్‌:

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

  శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్   శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున...