1, ఏప్రిల్ 2025, మంగళవారం

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం 
ఒక పెద్ద వరం 

మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే బుద్ధి వికసించకపోయినా, ఆత్మ వికాసం జరుగకపోయినా మనిషి మనుగడ అసంపూర్ణమే, సమతౌల్యతలో కొరతే ఉంటుంది. ఈ వెలితుల కారణంగా ప్రతీ మనిషి అనుభవిస్తూనే ఉంటాడు. వ్యక్తిత్వం సమగ్రంగా ఉండదు కూడా. పర్యవసానాలు అనుభవిస్తూనే ఉంటాడు మనిషి. వ్యక్తిలో ఇటువంటి సమగ్ర పరివర్తన హార్ట్ఫుల్నెస్ సరళ ప్రాణాహుతితో కూడిన ధ్యానపద్ధతి సహజంగా తీసుకువస్తుంది; కొద్దిగా సమయం పట్టినా కూడా తప్పక జరుగుతుంది; ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. 
ఎందుకు వారం అంటే 
ఈ ధ్యాన పద్ధతి చాలా సరళమైనది. 
ఆధునిక జీవన విధానంలో తేలికగా ఇమిడిపోతుంది. 
నియమ-నిబంధనలు ఇంచుమించు లేవు. 
అర్హతలు చూడారు. చూసేదీ ఒక్క అరహాతే, మనలను మనం మార్చుకోటానికి సంసిద్ధంగా ఉన్నామా, లేమా? వ్యక్తి తనలో పరివర్తన రావాలని పరితపిస్తున్నాడా లేదా? అన్నదే ముఖ్యం. 
పూర్తిగా జీవిత పర్యంతం, ప్రతి వ్యక్తికీ వ్యక్తిగతంగా  మార్గదర్శనం అందుబాటులో ఉంటుంది, 
ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదు. ఆధ్యాత్మిక శిక్షణ పూర్తిగా ఉచితం.  
అన్నీ సంస్కృతులలోనూ, ఎటువంటి నేపథ్యం కలిగినా, అందరిలో ఇబ్బంది లేకుండా తేలికగా ఇమిడిపోతుంది. 
దీనికి నమ్మకం కూడా అవసరం లేదు. నమ్మకం అనుభవంపై ఆధారపడఉంటుంది. అనుభవం ఉన్నచోట నమ్మకంతో పని లేదు. 
క్రతువులలేవు, తాంబూలాలు లేవు, గురువు పాదస్పర్శలు లేవు, గురు దక్షిణలు లేవు (కృతజ్ఞతతో కూడిన హృదయంతో, యథాశక్తి అందించే గురుదక్షిణలు తప్ప). 
ఈ ధ్యాన పద్ధతి, మనిషిలో సాధారణ ఒత్తిడిని తొలగించడం దగ్గర నుంచి దైవసాక్షాత్కారం వరకూ, ఇంకా మాట్లాడితే, అఆ తరువాత కూడా కొనసాగే అనంత యాత్ర వరకూ అడుగడుగునా సహాయపడే పద్ధతి. 
చాలా వరకు మనస్సాక్షిని అనుసరించడానికి సహాయపడే మార్గం. హయాఉతిక జీవనంలో రోజు-రోజుకూ హృదయంలో శాంతిని వృద్ధి చేసే జీవన విధానం. 
శాస్త్రాలలో ఉల్లేఖించిన నిగూఢమైన ఆధ్యాత్మిక స్థితులను తేలికగా అనుభవంలోకి తీసుకుయయగలిగే మార్గం. ఉదాహరణకు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తామరాకుపై నీటి బొట్టు వలె జీవించడం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా అందులోని ఆనందాన్ని పొందగలుగుతాం;  ఆత్మసమర్పణ యొక్క నిజమైన అర్థాన్ని ప్రత్యక్షానుభవం ద్వారా, సమీప అనుభూతిని  పొందవచ్చు. విలువలు అప్రయత్నంగా నెమ్మది-నెమ్మదిగా చోటు చేసుకోవడం ప్రారంభిస్తాయి. 
వ్యక్తిలో ఉండే అపరిశుద్ధ తత్త్వాలను, జటిల మనస్తత్వాలను నిర్మూలించి, సరళంగా, స్వచ్ఛంగా తయారు చేసే మార్గం. 
కేవలం మూడు మాసాలలోనే,  త్రికరణ శుద్ధిగా చేసే ఈ యోగసాధన ద్వారా అపూర్వమైన మార్పులు చోటు చేసుకోవడం ఎవరైనా గమనించవచ్చు. ఇది ముందుకు సాగడానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  
మోక్షసాధన మనకు అందుబాటులో ఉన్న విషయం సత్యమేనని,  మహాపురుసులు మనకు బోధిస్తున్నవి కేవలం గ్రంథాలకే పరిమితం కావని, అనుభవ జ్ఞానంలో సాధించవచ్చునన్న విశ్వాసం సగటు మనిషిలో కూడా ఏర్పడటం ఈ అనంత యాత్రలో పాల్గొనాలన్న ఉత్సాహం నిత్యనూతనంగా ఎన్నో ఇంతలు పెరుగుతూ ఉంటుంది.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...