సనాతన సంస్కృతిలో పుట్టి, పెరిగిన ప్రతి వ్యక్తీ ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే పదబంధాన్ని వినే ఉంటారు, దాన్ని గురించి అంతగా పట్టించుకోకపోయినా. వీటినే షడ్రిపులని, అరిషడ్వర్గాలని కూడా అంటారు మన శాస్త్రాలలో. ఈ ఆరు ప్రవృత్తులు మనిషి చైతన్య వికాసంలో, ఆత్మవికాసంలో పెద్ద అవరోధాలు, ఆత్మకు శత్రువులు. ఇవి లేని వ్యక్తి ఉండటం చాలా అరుదు.
అయితే వీటిని పూర్తిగా తొలగించుకోగలమా? శుద్ధ చైతన్య స్థితిని అనుభూతి చెందగలమా? ఒకవేళ తొలగించుకోగలిగితే ఎలా?మన శాస్త్రాలు ఏమంటున్నాయి? మన సహజ్ మార్గ్ గురుపరంపరలోని మాస్టారలేమంటారు? క్లుప్తంగా పరిశీలిద్దాం
వీటిని పూర్తిగా తొలగించలేము కాని వీటిని అదుపులో పెట్టుకోవచ్చని, అంటారు మన శాస్త్రకారులు. మరికొందరు పూర్తిగా తొలగించుకోవచ్చని కూడా అంటారు. అయితే ఇక్కడ పూర్తిగా తొలగించుకోవడం అంటే వీటి ప్రభావం ఆత్మపై ఉండకుండా చేసుకోవచ్చని చెప్తారు.
శాస్త్రకారులకు కొంచెం భిన్నంగా సహజ్ మార్గ్ మాస్టర్ పూజ్య బాబూజీ మహారాజ్ గారు ఈ షడ్రిపుల్లో కామం, క్రోధం అనేవి దైవదత్తమని, భగవంతుడు సృష్టించినవని, వీటిని పూర్తిగా తొలగించలేమని, తక్కినవి మనిషి సృష్టించుకున్నవి కావున వీటిని పూర్తిగా సహజ్ మార్గ్ సాధన ద్వారా తొలగించుకోవచ్చని తెలపడం జరిగింది. కామం భగవంతుడిని కోరుకోడానికని, ఆ కోరుకున్నదానికి అవరోధంగా నిలిచేవాటి పట్ల కోపం చూపించడానికి క్రోధం ఉన్నదని పూజ్య చారీజీ వివరించారు.
భగవద్గీత
ఇంద్రియపరమైన విషయాలను తదేకంగా ఆలోచించుటవల, మోహం ఏర్పడి, మోహం కోరికగా మారుతుంది, కోరిక నెరవేరనప్పుడు అది కోపంగా మారుతుంది, కోపం అదుపులో లేనపుడు అది భ్రాంతిగా మారుతుంది. భ్రాంతి వలన స్మృతిని కోల్పోవడం జరుగుతుంది ; స్మృతిని కోల్పోవడం వల్ల వివేకం నశిస్తుంది; వివేకం నశించడంతో మనిషి వినాశనమవుతాడు.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
రిప్లయితొలగించండిసంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।
ధ్యాయతః — చింతన చేయుట; విషయాన్ — ఇంద్రియ విషయములు; పుంసః — వ్యక్తికి; సంగః — సంగము (మమకారాసక్తి); తేషు — వాటి పట్ల (ఇంద్రియ విషయములు); ఉపజాయతే — కలుగును; సంగాత్ — సంగము (మమకారాసక్తి) నుండి; సంజాయతే — ఉత్పన్నమగును; కామః — కోరికలు; కామాత్ — కోరికల నుండి; క్రోధః — కోపము; అభిజాయతే — ఉద్భవించును.
Translation
BG 2.62: ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది.
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
రిప్లయితొలగించండిస్మృతిభ్రంశాద్ బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।
క్రోధాత్ — క్రోధము నుండి; భవతి — ఉత్పన్నమగును; సమ్మోహః — విచక్షణ కోల్పోవుట; సమ్మోహాత్ — విచక్షణా రాహిత్యం నుండి; స్మృతి — జ్ఞాపక శక్తి; విభ్రమః — భ్రమ; స్మృతి-భ్రంశాత్ — స్మృతి భ్రమ వలన; బుద్ధి-నాశః — బుద్ధి నశించును; బుద్ధి-నాశాత్ — బుద్ధి నష్టం వలన; ప్రణశ్యతి — వ్యక్తి పతనమగును.
Translation
BG 2.63: కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.
అవునమ్మ ! కృష్ణ భగవానుడు చెప్పారు. అయినా అప్పుడు ఆ కాలంలో వాళ్ళు వినలేదు. తరువాత కాలంలో దానిని ఎలా సాధన చేయాలో ఎవరూ చెప్పలేదు. అందుకు శ్రీ రామచంద్ర ద్వయం వచ్చి మనకు హార్ట్ ఫుల్ నెస్ సహజ మార్గ సాధనా పధ్ధతి ని అందించారు. ఆ కాలం నుండీ, అరే అంతకన్నా ఇంకా ముందునుండీ ఈ షడ్రిపులు మనిషికి మాధవునికి మధ్య నిలబడ్డాయి. సమకాలీన సద్గురువు ద్వారా వాటిని అధిగమించవచ్చని మన మాస్టర్లు చెప్పారు. ఉదాహరణగా మనకు సహజమర్గ హార్ట్ ఫుల్ నెస్ సాధకులు తారసపడతారు కూడా.
రిప్లయితొలగించండి