ఇచ్ఛ లేక ఆశ అంటే ఆంగ్లంలో wish లేక will; కోరిక అంటే desire. తెలుగు నిఘంటువుల్లో ఇచ్ఛ అన్నా, కోరికన్నా ఒక్కటే అర్థం కనిపిస్తుంది. ఈ రెంటికీ వ్యత్యాసం ఉందా? పరిశీలిద్దాం.
ఇచ్ఛ/కోరిక లేకపోతే జీవితమే లేదు. కానీ మహాత్ములదరూ కోరికలు తగ్గించుకోమనే చెబుతున్నారు. కోరిక లేకపోతే మనిషికి మనుగడే కనిపించదు. జీవించాలన్నది కూడా కోరికే అయినప్పుడు కోరికలు తగ్గించుకోవడం ఎలా? మరి కోరికలు తగ్గాలనుకోవడం కూడా ఒక కోరికే కదా?ఈ గందరగోళ స్థితి నుండి బయట పడటం ఎలా?
హార్ట్ఫలనెస్ సహజ్ మార్గ్ ప్రార్థనలో కూడా "... మేము ఇంకా కోరికలకు బానిసలమై యుండుట మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది ... " అని ఉంటుంది. ఈ లైనుకి పూజ్య చారీజీ చెప్పిన అర్థం చెప్తూ కోరికలను గరించి వారు ఇలా సెలవిచ్చారు: కోరికలుండటం తప్పు కాదు; కోరికలకు బానిసలైపోవడం మంచిది కాదు. నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది - అది కోరిక; నేను ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేను - అనేది కోరికకు బానిసత్వం. ఆ విధంగా మనం ఎన్నో కోరికలకు బానిసలుగా మారిపోయాం. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. కోరికల బానిసత్వం, పెరుగుతున్న కొద్దీ వివేకం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కోరికలు తగ్గించుకోవాలసిన అవసరం ఉంది.
ఇక పూజ్య దాజీ ప్రకారం, కోరికలు ఎదుకు తగ్గాలి:
ఉదాహరణకు మొత్తం 10 కోరికల్లో 8 కోరికలు నెరవేరాయనుకోండి; అప్పుడు సంతోషం 80 శాతం ఉన్నట్లు; అదే 10 కోరికాలూ నెరవేరాయనుకోండి; అప్పుడు సంతోషం నూటికి నూరు శాతం; ఇప్పుడు కోరికల సంఖ్య 0 అనుకోండి, గణిత శాస్త్రం ప్రకారం సంతోషం అనంతం లేక లెక్కించలేనిదిగా ఉంటుంది. అందుచేత సంతోషం అనంతంగా ఉండాలంటే కోరికలు తగ్గించుకోవడం మంచిది.
దాజీ ప్రకారం, ప్రార్థనలోని ఈ పంక్తిపై మరో వివరణ ఉంది:
ఇచ్ఛ, కోరిక యొక్క పూర్వ స్వరూపం అంటారు. అంటే ఇచ్ఛ బీజం అయితే కోరిక వృక్షం. ఆశ యొక్క తీవ్రరూపమే కోరిక. అందుచేత ఈ బీజరూపంలో ఉన్న ఇచ్ఛలే/ఆశలే కోరికలవుతున్నాయి. ఇచ్ఛ యొక్క తీవ్ర రూపం. ఇచ్ఛ అంటే ఒక ఆశ - నేను బాగా చదువుకొని ఉంటే బాగుండేది. ఇటువంటి ఆశలు మనకు ఎన్నో, ఎన్నో ఎన్నెన్నో. ఈ ఆశల స్థాయిలోనే వీటిని తొలగించుకోగలిగితే, ఇక కోరికలుగా మారే అవకాశం ఉండదంటారు.
కానీ అనిషి యొక్క యదార్థ స్థితి ఈ ఆశలకు బానిశాలమై ఉండటం. ఈ స్థితి నుండి గురువు ఉన్న స్థితికి జేర్చగలవాడు కేవలం ఆయన మాత్రమేనని స్వీకరించి మన సమస్యను ఆయన ముందుంచుతున్నాం ఈ ప్రార్థన ద్వారా. నిరంతరం మనం చేరవలసిన గమ్యం యొక్క మరణలో ఉన్నట్లయితే, అంటే నిరంతర స్మరణలో ఉన్నప్పుడు, కేవలం ఆయనను చేరాలన్న ఒక్క ఇచ్ఛ, ఆశ, కోరిక మిగిలిన అన్నీ ఆశలను తొలగిస్తుంది.
ఆయనను చేరాలన్నది నిజానికి కోరిక కాదు ప్రతీ ఆత్మ యొక్క ధర్మం; ప్రతి ఆత్మలోనూ స్వతఃసిద్ధంగా ఉన్న ధర్మం; కర్తవ్యం.
శ్రీ భగవానువాచ ।
రిప్లయితొలగించండిప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ।। 55 ।।
శ్రీ భగవాన్ ఉవాచ — పరమేశ్వరుడైన భగవంతుడు ఇలా పలికెను; ప్రజహాతి — త్యజించి (విడిచి పెట్టి); యదా — ఎప్పుడైతే; కామాన్ — స్వార్థ కోరికలు; సర్వాన్ — అన్నీ; పార్థ — అర్జునుడా, ప్రిథ తనయుడా; మనః-గతాన్ — మనస్సు యొక్క; ఆత్మని — ఆత్మ యొక్క; ఏవ — మాత్రమే; ఆత్మనా — పరిశుద్ధ మనస్సుతో; తుష్టః — సంతుష్టుడై; స్థిత-ప్రజ్ఞః — స్థితప్రజ్ఞుడు; తదా — అప్పుడు; ఉచ్యతే — అందురు.
Translation
BG 2.55: భగవానుడు పలికెను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.
ఇవన్నీ ఆచరణాత్మకమైనప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది.
రిప్లయితొలగించండికానీ అలా ఉండడం లేదెవ్వరూ
నిరాడంబర జీవనాన్ని గడపమని సహజమర్గo
రిప్లయితొలగించండిఘోషిస్తున్నా దాన్ని చెప్పేవారే పాటించడం లేదు
అందువల్ల ఇదంతా థియరీనే ఆచరణ అనేది ఆశ్రమాల్లల్లో మరోలా ఉంటుంది అనేది ఎల్లరకు
జగద్విదితం అయిన సంగతి
సోదరి చక్కగా రాసారు. మన దృష్టి మన ఆచరణ మీదే ఉండాలి, మన లక్ష్యం మీదే ఉండాలి. అప్పుడు సమస్య లేదు. అయితే అప్పుడప్పుడు అది పక్కకు చూస్తుంది. చూడగానే, సోదరి చెప్పిన సమస్య తలెత్తు తుంది. పూజ్య దాజీ గాఋ ఎప్పుడు మనకు డబల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ అని చెపుతూ ఉంటారు. సైన్సు లో అది ఇప్పటికీ కూడా గొప్ప ఎక్స్ పరి మెంట్. చూడగానే 'అది' మారుతుంది. అప్పటివరకు ఒక లాగ ఉన్నది మరోలా ప్రవర్తిస్తుంది. ఇదంతా చైతన్యం విషయం. నేను నా చైతన్యమ్, నా దృష్టి కోణం, నా లక్ష్యం మీదే ఉండాలి. అద్వైతం. మరొకటి లేదు. మరొక దాని మీద దృష్టి పెట్ట గానే నేను ద్వంద్వాలలో ఇరుకుంటాను.
రిప్లయితొలగించండిసోదరులు కృష్ణా రావు చక్కగా విడమరచి చెప్పారు. నీను ఎప్ప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఈ నాలుక గారి బానిసత్వం నుండి ఎప్పుడు ఎలా బయట పడదామా అని? ఒక్కోసారి అది మనసులో అంటే నా చైతన్యం లో ఉండదు, ఉండనప్పుడు సమస్య లేదు. మా మేడం చూస్తూ ఉంటుంది, కడుపు పాడు అవుతుంది తినకండి అనగానే ..... మొదలు. అద్భుతం.
ASALU VISHAYAM ANTAA IKKADE UNDI. IDI IKKADITHO AYIPOLEDU. NIRANTARAM PRATI OKKAROO TANALOKI TANU TONDICHOOSUKoVADAM LONE UNDI. PAKKAKU TONGI CHOOSAAMAA ....? ANTE SANGATHULU.
రిప్లయితొలగించండి