చింతలు - Worries
"నిర్జీవం దహతే చితా, సజీవం దహతే చింతా"
చితి జీవం లేని వ్యక్తిని దహిస్తుంది; చింత జీవం ఉన్న వ్యక్తిని దహిస్తుంది.
మనుషుల మనసును దహించే, కృంగదీసే, బాధించే మరో అంశం - చింతలు. చింత అంటే విరామం లేకుండా మనసుపై ఒత్తిడి ఉండటం; మరే ఆలోచనా తట్టకపోవడం; మనసు నకారాత్మకంగా తయారవడం; పదే పదే అవే ఆలోచనలు రావడం; భయం వేయడం; ఫలితాలు అనుకున్నట్లుగా ఉండవన్న భయం; మనలో ఉన్న కొరతలను గురించిన ఆలోచనలు; ఇత్యాదివి.
సాధారణంగా అందరికీ ఉండే చింతలు - అనారోగ్యం; అస్థిర ఆర్థిక పరిస్థితి; బాంధవ్యాల్లో ఒత్తిళ్ళు; ఉద్యోగపరమైన/వ్యాపారపరమైన పరిస్థితులు; విద్యారంగంలో రాణించలేకపోవడం; అనిశ్చితి; నియంత్రణ లేకపోవడం; సామాజిక సమస్యలు; వాతావరణ సమస్యలు; రాజకీయ అశాంతి; ఇత్యాదివి; తలనొప్పులు, అజీర్ణ సమస్యలు, కండరాల నొప్పులు వంటి శారీరక సమస్యలు ;
వీటి వల్ల కలిగే నష్టాలు - నిద్ర పట్టకపోవడం; ఏకాగ్రత లేకపోవడం; సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం; మానసికంగా అలసిపోవడం; ఇవన్నీ ఆందోళనకు దారి తీసి మనిషిని కృంగిపోయేలా చేయడం.
చింత గనుక తగిన మోతాదులో ఉంటే దాని వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి: తగిన జాగ్రత్తలు తీసుకోగలగడం; సమస్యను పరిష్కరించాలన్న ప్రేరణ కలగడం; ఆ క్షణంలో ఉండే అవసరాలపై దృష్టి పెట్టగలగడం వంటి లాభాలు కూడా ఉన్నాయి.
అనవసరంగా చింతించడం వల్ల నష్టాలేనని, సమస్య ఉన్నప్పుడు చింతించడం సమంజసం అని పూజ్య చారీజీ చెబుతూండేవారు. చింత అంటే తప్పుడు దిశలో ఉండే ఆలోచన (Worry is misdirected thought) అని పూజ్య బాబూజీ చెప్పేవారు.
వీటికి చాలా వరకు తగ్గించుకోటానికి కొన్ని పరిష్కారాలు: అన్నిటి కంటే సమగ్ర పరిష్కారం - ధ్యానం/శుద్ధీకరణ/ప్రార్థన/దశ నియమాలను పాటించడం, మన జీవన విధానంగా మారిపోవడం, ఉన్న సమస్యను యథాతథంగా స్వీకరించగలగడం, వంటి సత్సంకల్పాలు చేసుకోవడం.
ఇల్లత్ - జిల్లత్ + కిల్లత్
రిప్లయితొలగించండిఉండాలంటారు కదా మరి వీటి సంగతి ఏమిటి?
దైవ సాక్షాత్కారం, భగవంతునిలో లయం కావాలనుకునేవారికి ఇల్లత్ , కిల్లత్ , జిల్లత్ తప్పవు అన్నారు బాబూజీ. ఆత్మను పారిశుద్ధ్యం చేయడానికి ఇవి అవసరం.
తొలగించండిఅవును కదా ! దైవం వైపు మనసు మళ్ళితే, మరి మరలాలి అంటే హార్ట్ ఫుల్ నెస్ సాధన కావాలి.
రిప్లయితొలగించండి