29, మే 2025, గురువారం

సంస్కారాలు/ వాసనలు/ కర్మలు

 

                   

            పువ్వును చూడటం                               కావాలనుకోవడం                                      స్వంతం చేసుకోవడం         



సంస్కారాలు/ వాసనలు/ కర్మలు
 
సంస్కారాలన్నా, వాసనలన్నా, కర్మలన్నా ఒక్కటే. 
తోటలో ఒక గులాబీని చూడటం; ఆ తరువాత ఆ పూవును కాంక్షించడం; ఆ తరువాత దాన్ని స్వంతం చేసుకోవాలనుకోవడం. ఇలాగే మన చిత్తంలో ముద్రలు ఏర్పడేది, మరలా మరలా పునరాకృతం అవడం ద్వారా ఆ ముద్రలే సంస్కారాలుగా మారడం జరుగుతుంది. ఈ సంస్కారాలే/కర్మలే  మన మనసును, బుద్ధిని శాసించడం జరుగుతుంది. అందుకే "బుద్ధి కర్మానుసారిణి" అన్న నానుడి ఏర్పడింది. అంటే బుద్ధి కర్మను అనుసరిస్తుందన్నమాట. అందుకే మనిషి జీవితం తన కర్మ ఎలా ఉంటే అలా ఉంటుంది. వాస్తవానికి బుద్ధి హృదయాన్ని అనుసరించాలి. ఎందుకంటే దైవత్వం అందులో నివాసం ఉండటం వల్ల ఎప్పుడూ తప్పుడు మార్గదర్శకత్వం చేయదు. బుద్ధిని హృదయాన్ని అనుసరించేలా చేసే శిక్షణే ధ్యాన శిక్షణ. ఆ విధంగా మనిషి తన విధిని తాను రూపకల్పన చేసుకొనే అవకాశం ఉంటుంది. 
పైన ఉన్న మూడు చిత్రాలు మనిషి తనలో ముద్రలు యే విధంగా ఏర్పరచుకుంటాడో తెలియజేస్తున్నాయి. మనం ప్రపంచంతో వ్యవహరించినప్పుడు ఇలా ఎన్నో ముద్రలేర్పారచుకుంటూ ఉంటాం, అవే కారుడు కత్తి సంస్కారాలుగా మారతాయి. ఆ సంస్కారాలే మన చిత్తంలో గాడులుగా తయారై మన జీవితాలను శాసించడం ప్రారంభిస్తాయి. మన జీవించవలసిన విధంగా జీవించనియ్యవు ఈ సంస్కారాలు. మనిషి జీవించవలసిన విధంగా మార్గదర్శనం చేసేది హృదయం. అందుకే హృదయంపై ధ్యానించడం అనివార్యం. 
ఈ సంస్కారాలు ప్రధానంగా నాలుగు రకాలుగా ఏర్పడతాయి - 1) రాగద్వేషాలు అంటే ఇష్టాలు, అయిష్టాల వల్ల ఏర్పడేవి; 2) ఇంద్రియపరమైనవి ముఖ్యంగా స్త్రీ-పురుషుల మధ్య ఉండే ఆకర్షణల వల్ల కలిగే లైంగికపరమైన ముద్రలు; 3) ప్రాపంచిక చింతలకు సంబంధించిన ముద్రలు, అంటే కూటుమాబంలో ఉండే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, బంధాల వల్ల కలిగే చింతలు, ఇత్యాదివాటి వల్ల ఏర్పడేవి. ఈటీ బాధలని వేటినైతే అంటామో వాటి వల్ల ఏర్పడే ముద్రలు; 4) అపరాధ భావం వల్ల కలిగే సంస్కారాలు - చెయ్యవలసిన పనులు చేయకపోవడం వల్ల, చేయకూడని పనులు  చేయడం వల్ల ఏర్పడే ముద్రలు. 
ఈ నాలుగు రకాల ముద్రలు మనం తెలిసో తెలియకో ప్రతి నిత్యం ప్రపంచంతో వ్యవహరించే క్రమంలో ఏర్పరచుకుంటాం. ఇందులో మొదటి 3 రకాల ముద్రలూ సహజమార్గ పద్ధతిలోని శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా చాలా వరకూ తొలగించుకోవచ్చు. నాల్గవ రకం ముద్రలు మాత్రం చాలా బారువైనవి కాబట్టి, వాటిని గురువు గాని, దేవుడు గాని ఎవ్వరూ తొలగించలేరు. వీటిని కేవలం పశ్చాత్తాపం అనే అగ్నితో కరిగిన హృదయం వల్లే, సాధకుని అశ్రుధారల  ద్వారానే తొలగించబడతాయి. దీని నిమిత్తమే ప్రార్థనా ప్రక్రియ సహజ్ మార్గ్ ధ్యాన పద్ధతిలో భాగమై ఉన్నది.

1 కామెంట్‌:

  1. సంస్కారాల గురించి చెబుతూ, చెబుతూ బుద్ధి, హృదయం గురించీ చెప్పి హృదయం మీద ధ్యానం చక్కగా వివరించారు.

    రిప్లయితొలగించండి

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం

దాజీ సందేశం జూలై 2025 చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం