8, మే 2024, బుధవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - అపరాధ భావం (guilt )

 


అపరాధ భావం (guilt )

మనిషి ఆధ్యాత్మిక వికాసానికి అడ్డుపడే గొప్ప అవరోధం - అపరాధ భావం (guilt). హృదయ భారాన్ని అత్యధికంగా పెంచేటువంటిది. దీనివల్ల అనేక ఆధ్యాత్మిక సమస్యలు, మానసిక రుగ్మతలే గాక శారీరక వ్యాధులు కూడా కలుగుతాయి. అంటే కాదు, దీన్ని తొలగించడం అసాధ్యం; ఎంతటి గురువైనా తొలగించలేడు; భగవంతుడు కూడా తొలగించలేడట. కేవలం అపరాధభావం పెంచుకున్న వ్యక్తి మాత్రమే తన ఆశ్రులతో కూడిన ప్రార్థనాపూర్వకమైన పశ్చాత్తాపంతోనూ, తిరిగి అవే తప్పులు చేయనన్న తీర్మానంతోనూ  మాత్రమే తొలగించుకోగలిగేది. 

అపరాధ భావం ఎలా ఏర్పడుతుంది?
మనం చెయ్యవలసిన పనులు చేయకపోయినా, చేయకూడని పనులు చేసినా, మనలో అపరాధభావం ఏర్పడుతుంది. ఆత్మవిరుద్ధమైన, మనస్సాక్షికి విరుద్ధంగా ఆలోచనలు చేసినా, పనులు చేసినా ఏర్పడుతుంది. హృదయం అతి భారంగా తయారవుతుంది. 

హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం  
పైన చెప్పినట్లుగా గురువు ఎంత సమర్థుడైనా తొలగించలేడు; కానీ సహాయపడగలాడు, సాధకుడు ప్రయత్నిస్తే, త్రికరణ శుద్ధిగా పశ్చాత్తాపం చెందితే. 
పూజ్య దాజీ సూచన: సక్రమమైన ఆలోచన, సరైన అవగాహన, జీవితాన్ని నిజాయితీయైన దృక్పథంతో జీవించడం చేస్తే అపరాధ భావం ఏర్పడే అవకాశం ఉండదు. తెలిసి చేసిన తప్పుల పర్యవసానాలు అనుభవించవలసినదే అంటారు దాజీ. తెలియక, పొరపాటున జరిగిన తప్పులకు పశ్చాత్తాపం ద్వారా కడిగేసుకునే అవకాశం ఉందంటారు దాజీ. 
హార్ట్ఫుల్నెస్ సహజమార్గ పద్ధతిలో రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థనా-ధ్యానంలో మనం మిషన్ ప్రార్థనను మనసులో రెండు-మూడు సార్లు అనుకుని, భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నామన్న భావనతో, ఏ రోజుకారోజు చేసిన పొరపాట్లను తలచుకుని త్రికరణ శుద్ధితో కన్నీటితో పశ్చాత్తాపం చెందుతూ, మరలా ఆ తప్పులు చేయబోమన్న తీర్మానం చేసుకుని వినమ్ర ప్రార్థనా ధోరణిలో ప్రార్థన భావాన్ని ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోమని సూచించడం జరిగింది. దీని వల్ల అపరాధ భావం భారం కరిగిపోయి, గుండె తేలికగా తయారై ప్రశాంతంగా నిద్రలోకి జారుకోగలుగుతాడు సాధకుడు. 



బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - కామపూరితమైన ఆలోచనలు

 


కామపూరితమైన ఆలోచనలు, భావాలు 

ఆధ్యాత్మిక సాధనలో, అంతరంగ వికాసంలో, అవరోధాలుగా నిలిచే, నిత్యం ఎదుర్కొనే మరో అంశం - కామపూరితమైన ఆలోచనలు. కామం అంటే తీవ్రమైన వాంఛ. దీనికి సంబంధించిన ఆలోచనలు విపరీతంగా ఉన్నప్పుడు మనసంతా ఆవరించి, ప్రాధాన్యతలపై దృష్టి నిలవనీయకుండా పోవడం వల్ల, మన వివేకాన్ని  కోల్పోతూ ఉంటాం.   కామం జీవితంలో భాగమే తప్ప, జీవితమే కామం కాకూడదు. కామానికి నిర్దుష్టమైన దివ్య  ప్రయోజనం ఉంది. కానీ మోతాడుకు మించి ఉన్నప్పుడు అది అనర్థాలకు దారి తీసి ఆత్మవికాసాన్ని కుంటుపరుస్తుంది. కామం, క్రోధం దైవదత్తమైనవని, వాటిని నాశనం చేయలేమని  అంటారు బాబూజీ. కామం అంటే కోరిక; కామం ఉన్నది భగవంతుని కోరుకోటానికని, దానికి అవరోధంగా నిలిచేవాటిపై చూపించడం కోసమే క్రోధం భగవంతుడు ప్రసాదించాడని  పూజ్య చారీజీ చెప్పడం జరిగింది. కాబట్టి కామాన్ని భగవంతుని కోరుకోవడానికి, దానికి అడ్డు వచ్చినవాటిని తొలగించడం కోసం మాత్రమే కోపాన్ని వినియోగించుకోవాలి అంటారు పెద్దలు. ఇతర రకంగా ఉండే కోపాన్ని తొలగించుకోవలసినదే. 
అంతే కాదు, కామం అంటే కేవలం లైంగిక పరమైనదే కానక్కరలేదంటారు చారీజీ. ఆంగ్లంలో లస్ట్ (lust) అంటారు. ఈ తీవ్ర వాంఛ,  డబ్బుమీద గాని, అధికారంపై గాని, ఇత్యాదివాటిపై అత్యధికంగా ఉండటం కూడా కామమే అంటారు.  మోతాదు మించినప్పుడు, వివేకాన్ని నశింపజేస్తుంది కామం. 

హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం 
మన ఆధ్యాత్మికోన్నతికి అడ్డుపడే ఈ కామపూరితమైన ఆలోచనల్లో ఒకవిధమైన బ్యాలన్స్ తీసుకురావడానికి హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ పద్ధతి, పాయింట్ 'బి' యొక్క శుద్ధీకరణ ప్రక్రియను నిర్దేశిస్తుంది. ఈ యౌగిక ప్రక్రియను ప్రతి రోజూ ఉదయం చేసే ధ్యానానికి ముందు 7 నముషాలకు మించకుండా చేయవలసి ఉంది. వీటి ప్రాబల్యం తగ్గడం కొద్ది కాలంలోనే అనుభూతి చెందగలుగుతారు. 







7, మే 2024, మంగళవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - అవసరాలు - కోరికలు




అవసరాలు  - కోరికలు

మనిషి జీవితంలో అవసరాలు, కోరికలు అని రెండుంటాయి. అవసరాలు మనిషి ఉనికికి, బ్రతకడానికి అవసరమైనవి. అంటే కూడు, గుడ్డ, నీడ అని అంటాం మనం. ఇవి భూమ్మీద బ్రతకడానికి చాలా మౌలికమైనవి. అవసరాల  కోసం తగిన కృషి చేయడం తప్పకుండా అవసరం. 

అవసరానికి మించినవన్నీకోరికలే.  వీటికి అంతు అంటూ యేమీ ఉండదు. కోరికలు నెరవేర్చుకుంటున్న కొద్దీ కొత్త-కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అందుకే మనిషికి ఎప్పుడు చూసినా అశాంతి; ఎందుకంటే తీరవలసిన కోరికల సంఖ్య ఎప్పుడూ అమితంగా ఉంటుంది గనుక. అంటే ఎన్ని కోరికలు తీరితే అంత అశాంతి పెరుగుతూనే ఉంటుంది. పైగా, కోరికలు తీరకపోవడం వల్ల, ఆశాంతే గాక, కోపం, నిరాశ-నిస్పృహలు వంటి నకారాత్మక విషయాలన్నీ మనిషిని ఆవరించి జీవితాన్ని జటిలం చేసేస్తాయి. 

మరి కోరికల్లేకుండా జీవించగలమా?  యే కోరికా లేకుండా భూమ్మీద ఏం చేయాలి? అసలు కోరికలు లేకుండా జీవించాలనుకోవడం కూడా ఒక కోరికే కదా? మనిషి జీవితాన్ని ఇంకా పరికించి చూస్తే, ఒకప్పుడు కోరికలుగా ఉన్నవి, ఇప్పుడు అవసరాలైపోయాయి. మన ఐ. టీ. వాళ్ళు ఇప్పుడు అవసరాలు కూడు, గుడ్డ, నీడే కాదు, నాల్గవది కూడా ఉందంటున్నారు - బ్యాండ్ విడ్త్ (ఇంటర్నెట్) ; ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేకుండా జీవించడం దుర్లభం అయిపోయింది. మరేమిటి పరిష్కారం? 

హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం 
జీవిత ప్రయోజనాన్ని సాధించాలనుకుంటే, పరమ గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే, జీవితం అర్థవంతంగా ఉండాలనుకుంటే హార్ట్ఫుల్నెస్ ఒక చక్కటి యౌగిక పరిష్కారం సూచిస్తున్నది: ముందు కోరికలు తగ్గించుకునే ప్రయత్నంలో ఉండాలి. ఆ తరువాత ఇక అవసరాలు మాత్రమే మిగులుతాయి. ఆ తరువాత అవసరాలు కూడా తగ్గించుకునే ప్రయత్నంలో ఉండాలి. దీనికి హార్ట్ఫుల్నెస్ సాధన చాలా ఉపకరిస్తుంది. 
బాబూజీ సూచించిన పరిష్కారం 
భగవంతుని పొందాలన్న ఏకైక కోరికపై మనసంతా నిలిపి జీవించినప్పుడు, అనవసరమైనవన్నీ వాటంతట అవే ఎండుటాకుల్లా రాలిపోతాయన్నారు. అదే నిరంతర స్మరణ. హార్ట్ఫుల్నెస్ సాధన చేయగా, చేయగా కలిగే పరిణామం; ఫలితంగా అకస్మాత్తుగా బోలెడంత సమయం మనకు అందుబాటులో ఉండటం, ఒత్తిడి లేకుండా జీవించగలగడం, ఆ సమయాన్ని ఇతరుల సేవలో వెచ్చించగలిగే పరిస్థితి ఏర్పడటం, మనలను మనం మరచిపోయి జీవించే విధానం అలవడటం జరుగుతుంది. అనుభవం మాత్రమే సమగ్రమైన అవగాహనను కల్పిస్తుంది.  
భగవంతుని చేరాలన్న ఒక్క కోరిక తక్కిన అన్ని కోరికలనూ తొలగించగలదు.   కాబట్టి, కోరికలు తగ్గించుకొని, కనీస అవసరాలతో జీవించడమే సరళమైన, స్వచ్ఛమైన  జీవనం అవుతుంది. సరళమైన, స్వచ్ఛమైన జీవనం ద్వారా మాత్రమే మనిషి పరిపూర్ణతను సాధించగలుగుతాడు.  









 

6, మే 2024, సోమవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - సాంసారిక చింతలు

 


సాంసారిక చింతలు 

మనిషికి, సంసారంలో ఉన్నంత సేపూ సాంసారిక చింతలు తప్పవు. కానీ వాటిని యే విధంగా వ్యవహరిస్తామన్నదాని బట్టి, ఎలా స్పందిస్తామన్నదాని బట్టి,  వాటి ప్రభావాన్ని మనపై చాలా  వరకూ తగ్గించుకోవచ్చు. సాంసారిక చింతలు మన ఆధ్యాత్మిక ప్రగతిని కుంటుపరచవచ్చు. అసలు సాధన చేయడానికే సమయాన్ని ఇవ్వలేని పరిస్థితి ఏర్పడవచ్చు. 
ప్రాపంచిక/సాంసారిక చింతలూ అంటే అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, అవమానాలు, మానవ సంబంధాల్లో ఇబ్బందులు, రకరకాల ఒత్తిళ్ళు; వీటినే ఈతి బాధలని కూడా అంటాం. 

హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం 
హార్ట్ఫుల్నెస్ సాధన ప్రకారం, ఈ చింతలకు సంబంధించిన ముద్రలు మనం ప్రతి నిత్యం పాయింట్ 'ఎ' పై తెలియకుండానే ఏర్పరచుకుంటూ ఉండటం జరుగుతుంది. దీనిపై ప్రతీ రాత్రి, పడుకునే ముందు ధ్యానించవలసి ఉంది. దీని వల్ల వాటి తీవ్రత తగ్గి, హృదయభారం తగ్గడం అనుభూతి చెందడం జరుగుతుంది. కొన్నాళ్ళకు అసలు ముద్రలు ఏర్పడకుండే ఉండే జీవన విధానం కూడా అలవడుతుంది. 



బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - భయం

 


భయం 
భయం లేని జీవి ఉండదు. భయం మనలను కృంగదీస్తుంది. బలహీనపరుస్తుంది. సృజనాత్మక శక్తిని హరిస్తుంది. నకారాత్మకతను పెంచుతుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక  అనారోగ్యానికి దారి తీస్తుంది. భయం మనలను వణికిస్తుంది. గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. భ్రమలకు దారి తీస్తుంది. స్పష్టత కోల్పోయేలా చేస్తుంది. గందరగోళంలో పడేస్తుంది. 
భయం వల్ల ప్రయోజనాలు 
భయం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. భయం క్రమశిక్షణలో ఉంచుతుంది. మనిషిని అదుపులో ఉంచుతుంది. భయం వల్ల గౌరవం కూడా ఏర్పడుతుంది. అలాగే గౌరవం వల్ల ఆరోగ్యకరమైన భయం కూడా ఉంటుంది. 
భయంలో రకాలు 
నిత్యజీవితంలో అనేక రకాల భయాలను ఎదుర్కొంటూ ఉంటాం - చీకటి అంటే భయం, ఎత్తులంటే భయం, పాముల్లాంటి పాకే జీవులంటే భయం, తిరస్కరణ భయం, తెలియని భయం, ఇలా రకరకాల భయాలున్నాయి మనలో. 
అన్ని భయాలకూ మూలం 
అన్ని భయాలకూ మూలం మృత్యుభయం. ఈ భయం పోయిందంటే అన్ని భయాలూ పోతాయి.  
అసలు ఈ భయం ఎప్పుడు మొదలయ్యింది మనిషిలో? 
సహజమార్గ గురువుల ప్రకారం మనిషి, అన్నిటికీ మూలం అయిన ఆ భగవంతుడి నుండి మొట్టమొదటసారి విడిపోయినప్పుడు, విడిపోవడం వల్ల కలిగిన మొట్టమొదటి సంస్కారం - భయం. 
భయానికి హార్ట్ఫుల్నెస్ యౌగిక పరిష్కారం 
ఆ భయం వల్లనే మనలో ఇతర అన్నీ సంస్కారాలూ ఏర్పడి మనిషి జటిలంగానూ, అశుద్ధంగానూ తయారయ్యాడు. హార్ట్ఫుల్నెస్ సాధన ద్వారా ఈ సంస్కారాన్ని మొట్టమొదటగా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అందుకే తక్కిన అన్నీ సంస్కారాలూ తేలికగా రాలిపోయే అవకాశం ఉంది. తద్వారా కర్మరాహిత్యం సాధించే అవకాశం ఉంది ఈ జన్మలోనే. 
భయం ఎలా పోగొట్టుకోవాలి?
భయం ఎలా పోగొట్టుకోవాలి అని పూజ్య చారీజీ మహారాజ్ గారికి నేనొకసారి ఉత్తరం వ్రాసినప్పుడు, ఆయన ఈ క్రింది విధంగా వ్రాయడం జరిగింది: 
"భయాన్ని నిరంతర స్మరణ వల్ల తొలగించుకోవచ్చు. దయచేసి ప్రయత్నించు." అని వ్రాశారు. 

2, మే 2024, గురువారం

బాబూజీ జయంతి వేడుకల సందర్భంగా మొదటి బ్యాచ్ ముగింపు సమావేశంలో పూజ్య దాజీ ఇచ్చిన సందేశం యొక్క ముఖ్యాంశాలు

 


బాబూజీ జయంతి వేడుకల సందర్భంగా 
మొదటి బ్యాచ్ ముగింపు సమావేశంలో 
పూజ్య ఇచ్చిన సందేశం యొక్క ముఖ్యాంశాలు 

Important points of the message delivered by Rev. Daaji on the concluding session of First Batch of Babuju Birth Anniversary Celebrations


What is moksha? What is prapannagati? What is brahma-gati? How many of us as preceptors can answer these fundamental questions of Sahaj Marg philosophy? 


Even after reading the books, even when you read the page that this is moksha, this is prapannagati, this is brahma-gati, as preceptors we are supposed to instill the condition not just the knowledge. If an Abhyasi is asking a question from the heart; ‘please explain to me sir’. Of course we can say


... transcending Pancha Bhutas, transcending the dualities of life, dvandva in life, transcending the heart region, entering the brahman mandal makes us eligible for moksha. But this is in the head which is better than most ignorant people. How to arrive at it? We have to start working on such craving souls day after day, ceaselessly, tirelessly. Prapannagati is explained in this current (Bhandara)message. What is prapannagati? What is it that creates such a state, is it surrender the end of our journey or is it a means to the end? Is it a process? No. It is both the means as well as the end. We begin with a simple prayer. Prayer means submission, submission to the lord whom we worship in our heart. This submission slowly and slowly leads us to a state of surrender.


How to develop surrender? His simple answer was create dependency on your Master. But we become dependent very conveniently on things in which we only fail. We don't become dependent on the fundamental vital aspect of life, spirituality. To receive the divine gift, one must open the Heart, be receptive at least for a few minutes and invite, imbibe, intensify, you know all the steps of A E I O U. That ultimately leads us to the state of surrender in a very natural way, very natural way

Lalaji Sahab had coined or learned from Persian, and he described these words in Persian. Surrender to him was described as Fana e Fana. And brahma-gati was described to him or rather he described in Persian as Baqa e Baqa. Often youngsters do write to me; what is this Fana e Fana? Fana means annihilation. Annihilation of what? Not of the body but of your ego. Annihilating, subduing it, and the whole exercise starts by cultivating the state of abudiyat, state of subdued state, state of insignificance and making the lord the only significant thing that can happen in our life

I wish all our elders especially, immerse themselves in understanding our literature thoroughly so that they can explain and quench the thirst of our youngsters. In the whole process they themselves will get benefit. 

To youngsters and elders, to both, I have one simple exercise, I mean request, that just as we prepare for or we used to prepare for our exams, final exams, studying it day in and day out for hours, remember those days? Try to implement such a schedule for your studying the literature of Sahaj Marg, you will immensely benefit.


 

1, మే 2024, బుధవారం

శరణాగతి - పూజ్య దాజీ సందేశం - 30 ఏప్రిల్ 2024 - కాన్హా శాంతి వనం

శరణాగతి 

పూజ్య బాబూజీ మహారాజ్ 

125 వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా

దాజీ

ఇచ్చిన సందేశ సారాంశం 

30 ఏప్రిల్ 2024, కాన్హా శాంతి వనం.


మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి:

భగవత్సాక్షాత్కారం అభావ స్థితి లేకుండా సాధ్యమా?  

అభావ స్థితి శరణాగతి లేకుండా ప్రారంభమవుతుందా?

శరణాగతి అంగీకారం లేకుండా సాధ్యపడుతుందా?

అంగీకారం ప్రేమ లేకుండా సాధ్యమా?

ఇద్దరి జీవుల మధ్య పరస్పర స్పందన లేకుండా ప్రేమ సాధ్యమా?

పరస్పర ఆరాధన లేకుండా పరస్పర స్పందన సాధ్యమా?

అనుభవం లేకుండా ఆరాధన సాధ్యమా?

అనుభవం అభ్యాసం లేకుండా సాధ్యమా?

ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పక “కాదు” అనే చెప్తామనుకోండి. 

కాబట్టి విషయం అంతా కూడా అభ్యాసంతోనే ప్రారంభమవుతుంది – సరళమైన హార్ట్ఫుల్నెస్ యౌగిక ప్రక్రియలైన ప్రాణాహుతితో కూడిన ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థనలతోనే ప్రారంభమవ్వాలి. సరిగ్గా ఒక చెట్టు, విత్తుగా ఉన్నప్పటి నుండి మొలకగానూ, ఆ తరువాత పూర్తి చెట్టుగానూ  పెరగడానికి,  ప్రతీ దశలోనూ, నీరు, ఎండ, యెరువు ఎలా అవసరమో అలాగే మన యాత్రలోని ప్రతీ దశలోనూ, ఈ యౌగిక ప్రక్రియలే ముందుకు సాగడానికి సహకరిస్తాయి.

 


 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...