6, మార్చి 2024, బుధవారం

ధ్యానం అవసరమా?

 


ధ్యానం అవసరమా? 

ఎన్ని సంవత్సరాలు ధ్యానించినా కొన్ని మౌలిక ప్రశ్నలు అప్పుడప్పుడు మన హృదయ తలుపులను తడుతూ ఉంటాయి. మరింత స్పష్టమైన లోతైన అవగాహనను కలిగిస్తాయి. పటిష్ఠమైన సమాధానాలను హృదయాన్ని స్పృశించగలిగే సమాధానాలు కలుగుతాయి. ముఖ్యంగా బాహ్య ప్రపంచాన్ని గమనిస్తున్నప్పుడు, బాహ్య ప్రపంచంతో వ్యవహరిస్తున్నప్పుడు ఇటువంటి ప్రశ్నలకు నూతన సమాధానాలను మనసు వెతుక్కుంటూ ఉంటుంది. అటువంటి కొన్ని ప్రశ్నలకు ఆలోచించగా-ఆలోచించగా వచ్చిన సమాధానాలను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇవి మీకు కూడా ఆసక్తికరంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ధ్యానం అంటే ఏమిటో అసలేమీ తెలియని వారికి ధ్యానాన్ని మామూలు భాషలో పరిచయం చేసే సందర్భాలలో తీక్షణంగా ఆలోచించినప్పుడు కలిగిన సమాధానాలు. 

ధ్యానం అవసరమా? అని అడిగితే భారత దేశంలో కనీసం అందరూ అవసరమనే చెప్తారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ? అని అడిగితే కూడా ఏదొక సమాధానం ఆత్మవిశ్వాసంతో చెప్పని భారతీయులుండరు - మనశ్శాంతి వస్తుందని, ఏకాగ్రత వస్తుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఆలోచనలో స్పష్టత వస్తుందని, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని ఇలా ఎన్నో ప్రయోజనాలను చెప్తూంటారు. అది పిల్లలైనా, పెద్దలైనా. ప్రయోజనాలున్నాయని తెలిసినా కూడా ధ్యానం మన దినచర్యలో ఎందుకు భాగం కాలేదంటే సమాధానం ఉండదు. 

ధ్యానం భారతీయ మానసంలో ముఖ్యంగా అంతర్లీనంగా పని చేస్తూనే ఉన్నది. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని చేసేదని అందరికీ పుట్టుకతోనే తెలుసు. ఉదాహరణకు, యేదైనా సుదీర్ఘంగా ఆలోచిస్తూంటే కళ్ళు మూసుకుంటాం; ఎ ఆలయానికి వెళ్ళినా దైవాన్ని దర్శించడానికని వెళ్ళి కళ్ళు తెరచి చూడకుండా కళ్ళు మూసేస్తాం; భరించలేని ఒత్తిడితో ఉన్నప్పుడు కూడా, ఉపశమనం కోసం కళ్ళు మూసుకుంటాం; యేదైనా జ్ఞాపకం చేసుకోవాలంటే కళ్ళు మూసుకుంటాం; యేదైనా ఆస్వాదించాలంటే కూడా కళ్ళు మూస్తాం; బాగా నొప్పి కలిగితే కూడా కళ్ళు మూసేస్తాం; భయం వేస్తే కూడా కళ్ళు  మూసుకుంటాం; ఇలా ఇంకా ఎన్నో సందర్భాలలో ప్రతి మనిషి కళ్ళు సహజంగానే మూసుకుంటూ ఉంటాడు. ఇది ఎవరూ మనకు నేర్పించినది కాదు. ప్రకృతే మనకు నేర్పింది. ఇది అందరికీ తెలియకుండానే జరిగిపోయే ప్రక్రియ. ఇలా చేయడం వల్ల మనకు ఒత్తిడి నుండి ఉపశమనం, భయం నుండి ఉపశమనం, మనశ్శాంతి, ఆలోచనలో స్పష్టత, మనసుకు హాయి వంటివి అనుభవంలోకి వస్తాయి. ఇది తెలియకుండా జరిగిపోయే ధ్యానం. ధ్యానం వల్ల తెలియకనే అంతరాత్మతో అనుసంధానం కలగడం వల్ల ఆత్మ గుణమైన శాంతి-ప్రశాంతతలు  మనకు కలుగుతున్నాయి. 

ప్రస్తుతం మనం ప్రయత్నిస్తున్నది తెలిసి చేసే ధ్యానం. 

మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభూతులు - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ




మన ఆధ్యాత్మిక ప్రయాణంలో అనుభూతులు 
 
ఈ క్రింది విస్పర్ సందేశంలో బాబూజీ, మన యాత్ర ఏ  విధంగా భక్తితో ప్రారంభమై, నిజమైన ప్రేమ పట్ల సంపూర్ణ సమర్పణతో ఏ  విధంగా తేలికదనంతో, ఆనందంతో, అలౌకిక మదురానుభూతిలో లీనమైపోతామో తెలియజేస్తున్నారు. 

… Devotion boils down to what is essential: you love without asking yourself questions. That is the path to wisdom. Some need to lean on bookish knowledge – then one day all that seems superfluous. Knowledge comes from within; it seeps its way into every cell of the body, and there the spiritual being is fulfilled. It no longer cares about scientific or philosophical aspects of the method.

The intellect is at rest and the heart delights in the divine presence that resides in it. It tastes the pure nectar; it humbly gives thanks for this grace bestowed upon it – to go to the source within itself.

The principle is so simple: it is enough to surrender, to love truly; more than that, to adore, since only God can be adored. You will then feel light, happy, in a kind of beatitude. May you all get there! 

 

... భక్తి చివరికి అత్యవసరమైనవాటినే మిగులుస్తుంది; ఇక మిమ్మల్ని మీరు ప్రశ్నల్లేకుండా ప్రేమించడం ప్రారంభిస్తారు. ఇదే విజ్ఞతకు మార్గం. కొంతమంది పుస్తకజ్ఞానంపై ఆధారపడవలసిన అవసరం ఉంటుంది - ఒకరోజు అదంతా అనవసరం అనిపిస్తుంది. జ్ఞానం లోపలి నుండి ఉద్భవిస్తుంది. అది ప్రతీ కణంలోకి ఇంకుతుంది ; అప్పుడే ఆధ్యాత్మిక జీవికి సంపూర్ణ సంతృప్తి కలుగుతుంది. ఇక ధ్యానపద్ధతిని గురించిన శాస్త్రపరమైన, దార్శనికపరమైన వివరణలు అవసరం ఉండదు. 

బుద్ధి విశ్రమిస్తుంది, హృదయం తనలో నివసిస్తున్న దివ్యత్వంతో రమిస్తుంది. శుద్ధమైన అమృతాన్ని ఆస్వాదిస్తుంది. ఆత్మ తనపై వర్షింపబడుతున్న ఈ అనుగ్రహానికి - తనలోనే ఉన్న తన మూలానికి చేరుకోగలిగినందుకు కృతజ్ఞతతో నిండి ఉంటుంది. 

సూత్రం చాలా సరళమైనది: శరణాగతి చాలు. నిజంగా ప్రేమించడం చాలు. అంతకంటే మించి ఆరాధించడం చాలు, ఎందుకంటే ఆరాధించదగ్గవాడు కేవలం భగవంతుడు మాత్రమే గనుక. అప్పుడే మీరు ఆనందాన్ని, తేలికదనాన్ని, ఒకరకమైన అలౌకిక మాధుర్యాన్ని అనుభూతి చెందుతారు.  

4, మార్చి 2024, సోమవారం

బాబూజీ స్పష్టీకరణలు - 12

అభ్యాసుల గురించి బాబూజీ పడే ఆవేదన  

I regret to find that some of you do not try to overcome your lazy habits, which is a clear indication of the fact that the ideal has not yet been firmly fixed in your mind. If it is foremost in your view, it can never be that you would shirk or neglect your duty in this respect.

మీలో కొంతమంది మీ బద్ధకపు అలవాట్లను అధిగమించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనించి బాధపడుతున్నాను. అంటే, మీ మనసుల్లో లక్ష్యం లేక ఆశయం ఇంకా సుస్థిరం కాలేదని సూచిస్తున్నది. మీ దృష్టిలో గనుక ఇది ప్రప్రథమమైన ధర్మం అయి ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటూ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించకుండా ఉండేవారు కాదు. 


 Some of the obstacles on the path are exclusively those which have been created by your own miscreated actions. But if you are sincerely attentive to your ideal, these things are sure to melt away automatically. I may also be helpful to you in this respect provided you impel me to it by the force of your sincere earnestness.

మార్గంలో ఉండే కొన్ని అవరోధాలు ప్రత్యేకంగా మీ అకృత్యాల వల్ల సృష్టింపబడ్డవే. కాని మీరు గనుక ఏర్పరచుకున్న ఆశయం పట్ల చిత్తశుద్ధి కలిగి ఉన్నట్లయితే ఇవన్నీ వాటంతట అవే కరిగిపోతాయి. ఇందులో నా సహాయం కూడా మీకు తప్పక అందుతుంది, కాని ఎప్పుడు? మీరు చిత్తశుద్ధితో నిజాయితీతో నన్ను తప్పనిసరిగా సహాయపడేలా చేసినప్పుడు. 


People do not try to overcome their wrong habits because they would then have to put themselves to effort or a bit of inconvenience. Never mind be it so. But if they only adopt the right course for the realisation of their object and are prompted by intense longing for it, none of these things shall stand in their way, but shall drop down like dead leaves.

జనం తమ చెడు అలవాట్లను అధిగమించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రయత్నించాలంటే కొంత శ్రమ అవసరం, కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి. అయినా ఫర్వాలేదు. వాళ్ళ లక్ష్య సిద్ధికి సరైన మార్గాన్ని తీవ్రమైన తపనతో అవలంబించినట్లయితే ఇవేవీ కూడా మార్గంలో అడ్డు పడవు, ఎండుటాకుల్లా వాటంతటవే రాలిపోతాయి. 


Often people expect me to look to their physical ailments and to apply my thought-force for their cure. Not only this, they also induce me to take up cases of their friends and relations, and I, being over-courteous and obliging by nature, undertake them, not minding my own difficulties and exertion.

తరచూ జనం వాళ్ళ శారీరక రుగ్మతలపై కూడా నా ఆలోచనాశక్తిని ఉపయోగించి నయం చేయాలనుకుంటారు. అంటే కాదు, వాళ్ళ స్నేహితుల బాధలు, బంధువుల బాధలు కూడా నయం చేయాలని కోరతారు; నాకు మొహమాటం ఎక్కువగా ఉండటం వల్ల, కాదనే అలవాటు లేకపోవడం వల్ల, నాకుండే ఇబ్బందులు పట్టించుకోకుండా, ఎంతో శ్రమకోర్చి  వీటిని చేపడుతూ ఉంటాను.  


 When I happen to hear of the physical trouble of any of my associates, I naturally get attentive for a while at least for their relief. But when anyone approaches me with a direct request for his cure, I feel myself bound to help him to my best, not minding over-exertion and strain.

నా సహచరుల్లో ఎవరికైనా భౌతికంగా ఇబ్బంది వస్తే నా దృష్టి అప్రయత్నంగానే వాళ్ళ మీదకు వెడుతుంది, కనీసం ఉపశమనం కోసమైనా నా దృష్టి వెడుతుంది. కానీ ఎవరైనా నేరుగా నయం చేయమని వస్తే, నా ఇబ్బందులను, నేను అధికంగా పడే శ్రమను పట్టించుకోకుండా నేను చేయగలిగినంత మంచి చేయడానికి బద్ధుడై ప్రయత్నిస్తాను. 




3, మార్చి 2024, ఆదివారం

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024 - విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం

 

గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 

ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం 

అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి 


అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొదటిసారి ఇటువంటి సమావేశం - వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలీజియన్స్ పేరిట జరిగిన సమావేశంలో,  స్వామి వివేకానంద భారతదేశం  తరఫున, హిందూమతం తరఫున చేసిన విశ్వప్రసిద్ధ ప్రసంగాలు మనందరకూ విదితమే. అప్పుడు వారు మతసామరస్యాన్ని పెంపొందించుకోవాలని, మతమౌఢ్యాన్ని పూర్తిగా విడనాడాలని పిలుపునివ్వడం జరిగింది. స్వామి వివేకానంద మానవాళిని ఆధ్యాత్మికత ద్వారా ఏకం చేద్దామనుకున్న సంకల్పం ఇప్పుడు బహుశా నెరవేరబోతున్నది. 

షికాగోలో జరిగిన ఆ సమావేశం తరువాత ఇప్పుడు, అంతటి స్థాయిలో కాన్హా శాంతి వనంలో జరిగే ఈ సమావేశంలో, ప్రపంచం అంతా మతాతీతంగా, ఆధ్యాత్మికంగా ఎదగాలని, అంతరంగ శాంతి ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమన్న సత్యాన్ని, అన్ని మతాలు, అన్ని ఆధ్యాత్మిక సంస్థలూ కలిసి ముక్తకంఠంతో చాటి చెప్పే మహత్తర  క్షణాలకు మనం సాక్షులం కాబోతున్నాం.

శ్రీ రామ చంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రామ చంద్రజీ మహారాజ్ (అందరూ ఆప్యాయంగా పిలుచుకునే బాబూజీ) 1957 లో ఐక్యరాజ్య సమితికి ప్రపంచ శాంతి విషయమై ఒక లేఖ వ్రాస్తూ వ్యక్తిగత శాంతి ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి సాధ్యమని సూచించి, దాన్ని సాధించాలంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రాత్రి 9:00 గంటలకు కొన్ని నిముషాలు విశ్వం కోసం ప్రార్థించమని  ఒక పద్ధతిని సూచించారు. దాని ఫలితంగానే ఈ రోజున అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అనే నినాదంతో ఈ విశ్వ ఆధ్యాత్మిక మహోత్సవం, పూజ్య దాజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. 

మొట్టమొదటిసారిగా, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు, భారత దేశం అన్ని విధాలా 'విశ్వగురువు' గా మార్చాలన్న  నేపథ్యంలో, భారతదేశం విశ్వానికి ఆధ్యాత్మిక రాజధానిగా విలసిల్లే నేపథ్యంలో, హైదరాబాదు శివార్లలోని కాన్హా శాంతి వనం, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ లో మార్చ్ 14 నుండి 17 వరకూ ఈ అద్భుత సమావేశాన్ని నిర్వహించబోతున్నది. ఈ అపూర్వ కార్యక్రమానికి  హార్ట్ఫుల్నెస్ సంస్థ, కన్వీనర్ గా వ్యవహరిస్తున్నది, ఆభూతులకు ఆతిథ్యం ఇస్తున్నది. 

ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 300 కు పైగా ఉన్న ధార్మిక సంస్థలు, వివిధ మతాలకు చెందిన సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు పాల్గొనబోతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన సమకాలీన గురువులు తమ అనుయాయులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కలిసి ఒక్కటిగా, ఒక్క త్రాటి మీదకొచ్చి, ఒక్క చూరు క్రిందకు వచ్చి, ప్రపంచ శాంతి, సామరస్యాల స్థాపన కోసం కృషి చేయనున్నాయి. ప్రత్యక్షంగానూ, వర్చువల్ గానూ కలిపి పది లక్షలకు పైగా జనం ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. సుమారు 100 కు పైగా దేశాల నుండి ఇక్కడికి రాబోతున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. 

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, మార్చ్ 15 వ తేదీ సాయంకాలం ఈ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. మార్చ్ 16 న భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగ్దీప్ ధనకర్ గారు  ముగింపు ప్రసంగాన్నిస్తారు. 

ఈ కార్యక్రమంలో  హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ మార్గదర్శి, ఈ మహోత్సవ కన్వీనర్ పూజ్య దాజీ గాక, ఎందరో సమకాలీన గురువులు - ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధ్యక్షులు శ్రీశ్రీ రవిశంకర్ గారు, ఈశా సంస్థ అధ్యక్షులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు, పతంజలి యోగ్  ప్రతిష్ఠాన్ అధ్యక్షులు బాబా రామ్ దేవ్ గారు, చిన్న జీయర్ స్వామి వారు, రామకృష్ణ మఠం వారు, గౌర్ గోపాల్ దాస్ - ఇస్కాన్ వారు, ఇస్లాం మత  ప్రముఖులు, సూఫీ ప్రముఖులు, సిస్టర్ శివానీ గారు - బ్రహ్మ కుమారీ సంస్థ, మాతా అమృతానందమయి గారు, ట్రాన్సెండెంటల్  మెడిటేషన్  మార్గదర్శి టోనీనాడర్ గారు, బౌద్ధ మతస్థులు, సిఖ్  మతస్థులు, జైన మతస్థులు, యూద మతస్థులు, ఇంకా ఎన్నో యోగా సంస్థల పెద్దలు, ఇంకా మరెందరో ఈ మహోత్సవంలో ప్రసంగించ బోతున్నారు. వీరు గాక వివిధ రంగాలకు చెందిన మరెందరో ప్రముఖులు, పుల్లెల గోపీచంద్, కబీర్ బేదీ వంటి వారు కూడా పాల్గొనబోతున్నారు. 

ఈ కార్యక్రమంలో:

ప్లీనరీ సెషన్లుంటాయి. ఇందులో అందరూ పాల్గొంటారు. ఇక్కడ చర్చించబోయే అంశాలు - అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి; నిత్యజీవితంలో ఆధ్యాత్మికత; మతాల సంగమం; పరివర్తన -ఆధ్యాత్మికత; 2047 లో ఆధ్యాత్మికత; ఈ డిజిటల్ యుగంలో యువత - ఆధ్యాత్మికత. 

ఇవి గాక లోతైన విజ్ఞతతో నిండిన సెషన్లు  మరికొన్ని ఉంటాయి. ఆ అంశాలు ఇలా ఉన్నాయి:   పని - ఆధ్యాత్మికత; స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ ఆధ్యాత్మికత; ప్రకృతి-ఆధ్యాత్మికత; ఆరోగ్యం కోసం ఆధ్యాత్మికత - మానసిక, శారీరక ఆరోగ్యం; ఆధ్యాత్మికత యొక్క నిగూఢ అవగాహన. 

వీటితోపాటు సుప్రసిద్ధ కళాకారులచే సంగీత విభావరులు, భారతదేశ సంస్కృతిని దర్శింపజేసే వివిధ రకాల సంగీత వాయిద్యాల, గాన కచేరీలు మనలను అలరించనున్నాయి. 


కాబట్టి అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా ఈ ప్రపంచ ఉజ్వల భవిష్యత్తుగా ఉండవలసిన యువత తప్పక పాల్గొనాలని విజ్ఞప్తి. ప్రవేశం పూర్తిగా ఉచితం. కేవలం ఆధార్ కార్డు కానీ, మరే ఇతర ప్రభుత్వంచే ఇవ్వబడిన గుర్తింపు కార్డ్ అయినా దయచేసి తీసుకురాగలరు.  


మరిన్ని వివరాలకు సంప్రదించండి:

www.globalspiritualitymahotsav.org 

gsm@heartfulness.org 


2, మార్చి 2024, శనివారం

మృత్యువు - విస్పర్స్ సందేశాల నుండి బాబూజీ

మృత్యువు

మృత్యువుపై పూజ్య బాబూజీ ద్వారా దివ్యలోకం నుండి అందిన కొన్ని సందేశాల్లోని మనకు ఆత్మబలాన్ని చేకూర్చే ఆణిముత్యాలు. వీటిని చదివి, వాటి భావాన్ని ఆకళింపు చేసుకుని ధ్యానించి జీర్ణించుకుందాం. 


Death as you call it, in reality is a rebirth. Another form of life continues elsewhere. 

మీరనుకునే మృత్యువు, నిజానికి అది పునర్జన్మ. మరో రకం జీవితం మరెక్కడో కొనసాగుతుంది.  


Life and death are only stages; numerous are they in this long journey towards the 'Eternal'. Each one determines the next; this subtle strategy leads one on a very long course, to the best that one can attain.

జీవన్మరణాలు కేవలం దశలు మాత్రమే; 'అనంతం' దిశగా జరిగే ఈ సుదీర్ఘ యాత్రలో ఇలాంటి దశలెన్నో. ఒక్కొక జన్మ ఆ తరువాతి జన్మను నిర్ధారిస్తుంది; ఈ సూక్ష్మ వ్యూహం ఒక చాలా సుదీర్ఘ మార్గానికి దారి తీస్తుంది; ఆత్మ శ్రేష్ఠమైనదాన్ని సిద్ధింపజేసుకోగలిగేంత వరకూ. 


Such is life - life and death are mere steps in a long journey and we must accept them as such. In human terms, this aspect is often difficult to accept, and yet each of these steps is critical in the cycle of human evolution. We do follow our abhyasis especially when they are in such difficult times. 

జీవితం అటువంటిది - ఒక సుదీర్ఘ ప్రయాణంలో జీవన్మరణాలు కేవలం దశలు మాత్రమే. మనం వాటిని యథాతథంగా స్వీకరించాలి. మానవ వికాస చక్రంలో ఈ దశలు చాలా కీలకమైనవి. అటువంటి కష్టకాలంలో అభ్యాసులున్నప్పుడు, మేము వాళ్ళ వెన్నంటే ఉంటాం. 


Our journey on earth is initiatory; once the work finished we leave; that is how it goes.

భూమ్మీద మన ప్రయాణం ఉపదేశాత్మకమైనది; పని పూర్తయ్యిందంటే విడిచి వెళ్ళవలసిందే; యాత్ర క్రమం అలా ఉంటుంది. 

Death - మృత్యువు




Death - మృత్యువు 

  1. "Death is not the extinguishing of the light; it is putting out the lamp because the dawn has come." - Rabindranath Tagore

మృత్యువు అంటే దీపం ఆరిపోవడం కాదు; తెల్లవారింది కాబట్టి దీపం ఆర్పేయడం. - రబీంద్రనాథ్ టాగూర్

  1. "Death is a stripping away of all that is not you. The secret of life is to 'die before you die'—and find that there is no death." - Paramahansa Yogananda

  2. మృత్యువు అంటే నీవు కానిదాన్ని ఒలిచేయడం 'మరణించక ముందే మరణించడం' - తద్వారా మృత్యువు అనేది లేదని తెలుసుకోవడమే జీవిత రహస్యం. - పరమహంస యోగానంద


  3. "The wise man lets go of all results, whether good or bad, and is focused on the action alone. Yoga is the journey of the self, through the self, to the self." - Bhagavad Gita

  4. వివేకవంతుడు ఫలితాలను వదిలేసుకుంటాడు, మంచి ఫలితాలైనా, చెడు ఫలితాలనైనా; చేసే కర్మపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తాడు. యోగా అంటే ఆత్మ, ఆత్మ ద్వారా, ఆత్మ దిశగా చేసే ప్రయాణం - భగవద్గీత


  5. "Birth and death are not two different states, but they are different aspects of the same state. There is as little reason to deplore the one as there is to be pleased over the other." - Mahatma Gandhi

  6. జన్మమృత్యువులు రెండు విభిన్న స్థితులు కావు. ఒకే స్థితి యొక్క రెండు పార్శ్వాలు మాత్రమే. ఒకదాన్ని నిందించండం, మరొకదాన్ని కొనియాడటంలో అర్థం లేదు. - మహాత్మా గాంధీ


  7. "The life of a man who is committed to the path of truth is like a sacrificial fire: his old self is the offering, and the fire is the light of spiritual knowledge that consumes it." - Swami Tejomayananda

  8. సత్య పథం పట్ల నిష్ఠతో జీవించే మనిషి జీవితం యజ్ఞ గుండంలో అగ్ని లాంటిది; తన పాత ఆత్మ ఆజ్యం అయితే దాన్ని హరించే ఆధ్యాత్మిక జ్ఞానం, యాగాగ్ని అవుతుంది.

  9. - స్వామి తేజోమయానంద

శ్రీ రాధాకృష్ణుల అమర - అలౌకిక ప్రేమ

 

శ్రీ రాధాకృష్ణుల  అమర - అలౌకిక ప్రేమ 

శ్రీరాధాకృష్ణుల మధ్య ప్రేమ అలౌకికమైనది, అనంతం నుండి అనంతం వరకూ ఉండేది, సమస్త జన్మలలోనూ, సమస్త యుగాల్లోనూ కొనసాగేది, ఊహకందనిది. అర్థనారీశ్వర తత్త్వం రాధాకృష్ణుల ప్రేమ. ఈ ప్రేమ ప్రకృతి-పురుషుల ప్రేమ; కామ క్రోధ లోభ మోహ మద  మాత్సర్యాలకతీతమైన ప్రేమ;  అందుకే ఈ ప్రేమ అతిశక్తివంతమైనది; వాళ్ళ పట్ల కీడు తలపెట్టినవారి పట్ల కూడా ఎటువంటి వికారాలూ లేకుండా ప్రేమతోనే వ్యవవహరించే ప్రేమ. ఇటువంటి ప్రేమను మూర్తీభవించిన తత్త్వం రాధాకృష్ణుల ప్రేమ తత్త్వం. 

ప్రేమ అంటే స్వామిత్వం కాదు; ప్రేమ అంటే ఆత్మ సమర్పణ. ప్రేమ అంటే తన ప్రేముకుడిని కోల్పోతానన్న భయం కాదు; సంపూర్ణ స్వేచ్ఛనిచ్చే ఉదారత. మిమ్మల్ని బంధించని ప్రేమే సత్యమైన ప్రేమ అవుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని జాగృతం చేస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించేలా చేసినప్పుడే ప్రేమ సత్యమైనదవుతుంది. 

ఇటువంటి ప్రేమను బోధించడానికే శ్రీ రాధాకృష్ణులు అవతరించడం జరిగింది. వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అరిష్ఠాలు వచ్చినా, ఎంత మంది దాడి చేసినా, ఎన్ని కుట్రలు జరిగినా చెక్కు చెదరకుండా ఉన్న ప్రేమ శ్రీరాధాకృష్ణుల ప్రేమ. అన్ని బంధాలకు అతీతమైన ప్రేమ, అందరి శ్రేయస్సును సమానంగా ఆలోచించే ప్రేమ. అటువంటి ప్రేమే ఈ సృష్టిని నడిపిస్తున్నది. అందుకే శ్రీరాధాకృష్ణుల ప్రేమ ఆదర్శ ప్రేమ. ఈ ప్రేమను పెంపొందించుకోవడమే ప్రతీ ఆధ్యాత్మిక పథం యొక్క పరమ లక్ష్యము, ఆదర్శమూ కూడా. 



అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...