ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
20, మే 2025, మంగళవారం
భయం
8, మే 2025, గురువారం
అలసత్వం - బద్ధకం
అలసత్వం - బద్ధకం
బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యపోకండి. ఉన్నాయి.
అసలు బద్ధకానికి మూల కారణలేమిటో చూద్దాం. 1) స్పష్టమైన ప్రయోజనం లేనప్పుడు, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు లేనప్పుడు 2) విఫలమవుతామన్న భయం ఉన్నప్పుడు లేక మనలో కొరతలున్నప్పుడు 3) చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నా లేక పెద్దవిగా ఉన్నా వచ్చేది 4) శక్తి లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు 5) సుఖం ఎక్కువైనప్పుడు లేక మనసును మళ్ళించే విషయాలున్నప్పుడు 5) నకారాత్మకమైన ఆలోచనా విధానం ఉన్నప్పుడు.
మరో దృష్టి కోణంలో నుండి చూస్తే ఆశ్చర్యకరంగా బద్ధకం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి: 1) సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది - ఎందుకంటే బద్ధకస్తులు కష్టమైన పనులు త్వరగా/సరళంగా చేసే మార్గాలు వెతుకుతారు; నేను కష్టమైన పనిని బద్ధకస్తుడికి అప్పగిస్తాను, ఎందుకంటే పని పూర్తి చేయడానికి అతను తేలిక మార్గం వెతుకుతాడు - బిల్ గేట్స్ 2) విశ్రాంతిని, శక్తిని కూడగట్టుకునేలా చేస్తుంది 3) మనలోని సృజనాత్మకతను పూరికొల్పుతుంది 4) కలిసిగట్టుగా పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, ఇతరులకు పని అప్పగించడం నేర్పిస్తుంది 5) ఆలోచింపజేస్తుంది, పని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచింపజేస్తుంది 6) ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది.
అయితే ఆధ్యాత్మిక సందర్భంలో ఆలోచిస్తే, నిత్యం ఆధ్యాత్మిక సాధన చేయకపోవడానికి ముఖ్య కారణం బద్ధకమే. దీనికి పైన చెప్పిన కారణాలు గనుక మనలో ఉన్నట్లయితే, వాటికి పరిష్కారాలు కూడా తరచి చూస్తే వాటిల్లోనే కనిపిస్తాయి.
అయితే అస్సలు బద్ధకం లేకుండా ఉండగలమా అన్నది ప్రశ్నే. అయితే పూజ్య చారీజీ కాస్త వెసులుబాటు కల్పించినట్లుగా అనిపించింది - పని లేనప్పుడు బద్ధకించవచ్చు గాని, పని ఉన్నప్పుడు బద్ధకించరాదన్నారు చారీజీ. తప్పక దీన్ని ప్రతి సాధకుడు పరిష్కరించుకోవలసినదే. ఆలోచించండి!
14, ఏప్రిల్ 2025, సోమవారం
శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్
12, ఏప్రిల్ 2025, శనివారం
భక్త హనుమాన్ జయంతి
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ
మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాద్భవేత్.
1, ఏప్రిల్ 2025, మంగళవారం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
21, మార్చి 2025, శుక్రవారం
ఇప్పుడే, ఇక్కడే
ఇప్పుడే, ఇక్కడే
84 లక్షల యోనుల గుండా ప్రయాణం పూర్తయిన తరువాత, కనీసం 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ అంటారు పెద్దలు; అందుకే మనుష్యత్వం దుర్లభం అంటారు ఆది శంకరులు.
అలా ఎందరో మానవులు ఈ భూమ్మీద జన్మించారు; ఇంత మంది మానవుల్లో ఒక ఆలుమగల జంట ఏర్పడటం; వాళ్ల కలయికలో ఎన్నో లక్షల పురుష వీర్యకణాల్లో ఒక్క వీర్యకణం ఎన్నో లక్షల స్త్రీ అండాలలోని ఒక అండంతో ముడిపడి ఒక పిండం తయారవడం; తల్లి గర్భంలో ఆ పిండం పెరగడం; ఆ పిండంలోకి మూడు మాసాలకు ఆత్మ ప్రవేశించడం; నవమాసాల తరువాత పిండం మానవ శిశువుగా ఆవిర్భవించడం జరిగిపోతున్నది.
ఆ ఆత్మ ఎక్కడి నండి వస్తుందో,
దాని ప్రయాణం ఎక్కడికో యేమీ తెలియదు కదా!!!
అక్కడి నుండి ప్రారంభమవుతుంది
మనిషిపై అనేక పొరలు ఏర్పడటం; యే విధంగా? మొదట
ఆడబిడ్డా, మగ
బిడ్డా అని అడుగుతాం –లింగం
ఆ తరువాత తెల్లగా ఉన్నాడా నల్లగా
ఉన్నడా అంటాం –రంగు.
ఆ తరువాత జాతి, కులం, భాష, మతం. ఇదంతా బిడ్డ పుట్టగానే మనకు ఏర్పడిపోతాయి. ఇక జీవితాంతం ఇవి మన తోడుగానే ఉంటాయి; వీటిల్లో కొట్టుకుంటూఎ మన జీవితం తరచూ కడతేరుతూ ఉంటుంది.
మనం మనిషి బిడ్డగా జన్మించావన్న సత్యాన్నే మరచిపోతాం.
వాటితోనే మన మనుగడను
కొనసాగిస్తూఁటాం. అసంపూర్ణంగా మిగిలిపోతాం.
మనలను మనం యథాతథంగా ఈ పొరల మాటున ఉన్న అసలు తత్త్వాన్ని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం అంటే బహుశా; దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు పెద్దలు.
చిక్కు ఏమిటంటే ఇది తెలుసుకునే వరకూ ఆత్మకు నిద్ర పట్టదు, యేదో తెలియని పూడ్చలేని వెలితి, యేదో చెప్పలేని తీవ్ర అసంతృప్తి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అని కూడా అంటారు పండితులు. ఈ దాహాన్ని తీర్చడమే మానవ జన్మ ప్రయోజనమేమోనని అనిపిస్తూ ఉంటుంది.
అందుకే ఇప్పుడే, ఇక్కడే పని పూర్తయిపోవాలంటుంది ఆధ్యాత్మికత. మహర్షులు, అవతారా పురుషులు, మహాత్ములెందరో కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. పరిష్కార మార్గాలు చూపించారు, చూపిస్తున్నారు, బహుశా భవిష్యత్తులోనూ చూపిస్తూనే ఉంటారు కూడా.
ఈ పరిష్కార మార్గాలే మనకు మత గ్రంథాలుగా, వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పద్ధతులుగా, శాస్త్రాలుగా భూమ్మీద మనకు అందుబాటులో ఉన్నాయి.
మరల మనిషి అసలు అన్వేషనఊ మరచిపోయి వీటిని తనకున్న పరిమితమైన శక్తులతో అర్థం చేసుకోవడానికి సతమతమవుతూ ఉంటాడు. తనను తాను ఈ శబ్దారణ్యంలో, తెలివితేటల వలల్లో, వాదోపవాదాల్లో, పడిపోయి, ప్రామాణికమైన అన్వేషణ అంతర్ముఖంగా చేసే అన్వేషణేనని తెలుసుకునే సరికి జీవితం గడచిపోతుంది; అప్పటి వరకూ బహుశా అసలైన మార్గం తటస్థం కూడా కాదేమోననిపిస్తుంది; ఎందుకంటే తటస్థమైనా మనకు మనం ఉన్న పరిస్థితుల్లో గుర్తించడం జరగదు.
ఒక్కసారి అటువంటి ఆధ్యాత్మిక పాఠము, అటువంటి సమర్థుడైన గురువు తటస్థించినప్పుడు, హృదయంలో అపరిమితమైన ప్రశాంతతను అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు, ఇప్పుడే, ఇక్కడే మన జీవిత పరిష్కారం ఉందని ప్రామాణికంగా హృదయానికి స్పష్టమవుతుంది. అక్కడి నుండి అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది.
7, మార్చి 2025, శుక్రవారం
గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ - భారత మండపం - న్యూఢిల్లీ - ఫిబ్రవరి 21, 2025
అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు
అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...