ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
20, జులై 2023, గురువారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 4
19, జులై 2023, బుధవారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 3
18, జులై 2023, మంగళవారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో - 2
17, జులై 2023, సోమవారం
పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ స్మరణలో
హార్ట్ఫుల్నెస్ మాస్టర్లు తరచూ ఉటంకించే సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు
20, జూన్ 2023, మంగళవారం
సమగ్ర యోగా - ఈనాటి మానవుని దినచర్యలో తప్పనిసరిగా ఉండవలసినది
మానవుడి సంపూర్ణ ఆరోగ్యం కోసం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాల కోసం చేయవలసిన యోగాభ్యాసమే సమగ్ర యోగా.
యోగా అనగానే మనకు మనసులోకి వచ్చేది, కొన్ని ఆసనాలు, ప్రాణాయామాయలు, అనే కొన్ని శ్వాస ప్రక్రియలు. నిజానికి ఆసనం, ప్రాణాయామం అనేవి సమగ్ర అష్టాంగ యోగంలోని 3 వ అంగము, 4 వ అంగము మాత్రమే.
పతంజలి మహర్షి వ్రాసిన సమగ్ర అష్టాంగ యోగంలోని 8 అంగాలు ఇలా ఉన్నాయి: 1) యమ 2) నియమ 30 ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7) ధ్యాన 8) సమాధి.
మొదటి రెండు అంగాలు అంటే యమ-నియమాలు సౌశీల్య నిర్మాణానికి సంబంధించినవి.
ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు.
ధారణ, ధ్యానాదులు , అంతర్ముఖులై మానసిక ఆరోగ్యానికి, మనసుకు అతీతంగా ఉన్నతోన్నత సత్యాలను దర్శింపజేసే ప్రక్రియలు.
సమాధి యోగసిద్ధిని, యోగం యొక్క పరమలక్ష్యాన్ని ప్రత్యక్షానుభవంలో సాక్షాత్కరించుకోవడం.
ధారణ, ధ్యాన సమాధులను కలిపి సంయమనం అని కూడా అంటారు.
మన హార్ట్ఫుల్నెస్ యోగసాధన సంయమనానికి సంబంధించినది.
కాబట్టి, ప్రతి ఒక్కరూ యమనియమాలను అనుసరించడం ద్వారా శీలనిర్మాణం చేసుకుంటూ, ఆసన, ప్రాణాయామాల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని సుస్థిరపరచుకుంటూ, సమాధి ద్వారా యోగసిద్ధిని సాధించి, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా సాధించి, అపరిపూర్ణుడుగా ఉన్న మానవుడు పరిపూర్ణుడుగా మారే అవకాశం ప్రతీ ఒక్కరికీ ఉంది.
16, జూన్ 2023, శుక్రవారం
అంతర్యామితో అనుసంధానమవడం ఎలా?
భగవంతుడు లేక ఆ సత్యతత్త్వం అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడన్నది ఋత వాక్కు, మనకున్న మేధాపరమైన జ్ఞానం. అందుకే భగవంతుడిని సర్వాంతర్యామి అని కూడా అంటారు. అయితే, మనందరిలో ఉన్న ఈ అంతర్యామితో నిజంగా అనుసంధానమవడం ఎలాగో నేర్పేవాడు, ఆ అనుభూతిని కలిగించడంలో సహాయపడేవాడు మాత్రమే నిజమైన గురువు అవుతాడు. అటువంటి గురువు లేకుండా ఈ అనుసంధానం జరగడం అసాధ్యం.
హార్ట్ ఫుల్ నెస్, సహజమార్గ ఆధ్యాత్మిక సాంప్రదాయంలోని గురువు ద్వారా నేర్చుకున్న విధానం, అనుభూతి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తానిక్కడ.
భగవంతుడు మనందరి హృదయంలో అంతర్యామిగా ఉన్నాడని అన్ని మతాలు అంగీకరిస్తాయి, మన మహర్షులందరూ చెప్పింది కూడా అదే. అంతర్యామితో అనుసంధానమవడానికి మనసు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం అంటారు; అంతే కాదు మనం కోరుకున్న వెంటనే మనసు ప్రశాంత స్థితికి రాగలగాలి. మనసు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడే ఆ భగవంతునితో లేక ఆ అంతర్యామితో అనుసంధానం జరుగుతుంది. దీనికి అంతర్ముఖులై హృదయంపై ధ్యానించడం చాలా అవసరం. ఈ సహజమార్గ ధ్యాన పద్ధతిని అనుసరించడం చాలా ఉపయోగిస్తుంది.
ఆ అనుభూతి ఎలా ఉంటుంది?
ఆ అనుభూతి క్షణకాలమైనా కూడా అలౌకికంగానూ, అనిర్వచనీయంగానూ, వర్ణించలేని విధంగా ఉంటుంది. అన్నిటికీ అతీతమైన అనుభూతి. ఆ రుచి కలిగిన తరువాత మనసు ప్రతి క్షణమూ దాని కోసం తపిస్తూ ఉంటుంది. ఆ రుచే మనలను మరింత తీవ్రంగా ధ్యానించేలా చేస్తుంది. ఆ క్షణికమైన అనుభూతి రోజుకు 24 గంటలూ, గంటకు 60 నిముషాలు, నిముషానికి 60 సెకన్లూ, జాగృతస్వప్నసుషుప్తి అనే మానవుడుండే మూడు అవస్థల్లోనూ ప్రతి నిత్యమూ ఈ దివ్యానుభూతి చెందుతూ లేక స్మరిస్తూ, ఆ స్పృహలోనే నిత్య దైనందిన కార్యాలన్నీ చేసుకునే పరిస్థితి వచ్చే అవకాశం ప్రతీ సాధకుడికీ ఉంది. ఇటువంటి అనుభూతి మన మూలాన్ని ప్రతి రోజూ గుర్తు చేస్తుంది.
అటువంటి స్పృహలో లేక చైతన్యంలో సాధకుడు జీవించినప్పుడు ఇదే ఆఖరి జన్మ అవుతుంది, ఈ జన్మకు సార్థకత కలుగుతుంది; ఆ తరువాత ఇతరుల కోసం జీవించడం జరుగుతుంది; గురువు సంకల్పానుసారం జీవితం కొనసాగుతుంది.
అంతర్యామితో అనుసంధానం అంత తేలికా?
ఇది ఒక నమ్మలేని నిజం. కేవలం అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలిగినది. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని క్రతువులు చేసినా కలగని అనుభూతి. అందుకే బాబూజీ - భగవంతుడు సరళుడు, ఆయనను అనుభూతి చెందే మార్గం కూడా సరళంగానే ఉండాలనేవారు. క్రిందపడిన సూదిని ఎత్తడానికి క్రేన్ సహాయం అవసరం లేదని మనం ఈశ్వరానుభూతి కోసం అటువంటి మార్గాలనే అవలంబిస్తున్నామని బాబూజీ అంటూండేవారు.
ఇంత తేలికగా ఆ అనుభూతి కలగడానికి ఈ ధ్యాన పద్ధతిలోని ప్రత్యేకత ఏమిటి?
ఈ పద్ధతిలోని రెండూ ప్రత్యేకతలు అంతర్యామితో ఈ అనుసంధానాన్ని సరళతరం చేస్తాయి - 1) ప్రాణాహుతి అనే దివ్య శక్తి ప్రసరణ 2) శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియలు. ప్రాణాహుతి అనే యౌగిక ప్రక్రియ వల్ల హృదయాంతరాళంలో ఉన్న మూలంతో మనసును అనుసంధానం చేస్తుంది. దీన్ని సమర్థుడైన గురువు మాత్రమే ప్రసరించగలడు లేక ఆయన అనుమతించిన ప్రశిక్షకులు మాత్రమే ప్రసరించగలరు. శుద్ధీకరణ అనే యౌగిక ప్రక్రియ ఈ అనుసంధానానికి అడ్డుపడే అవరోధాలను తొలగించి మనసును శుద్ధి చేస్తుంది.
అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు
అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...

.jpg)



.jpg)



