కర్మ, అకర్మ, వికర్మ
కర్మ అంటే ఆలోచనల వల్ల, చేసే పనుల వల్ల, ఉద్దేశ్యాల వల్ల కలిగే ఫలితం. కర్మ అంటే ధర్మానికి అనుగుణంగా చేసే పనులు. అంటే నైతికమైన పనులు, శాస్త్రాలకనుగుణంగా ఉండే పనులు, తనకు, సమాజానికి ఉపయోగపడే పనులు, కర్తవ్య భావంతో చేసే పనులు. ఉదాహరణలు: చిత్త శుద్ధితో తన ధర్మాలని నిర్వర్తించడం, గృహస్త ధర్మాలను నిర్వహించడం, దానధర్మాలు, సేవ, యజ్ఞాలు నిర్వహించడం, నిస్స్వార్థంగా పనులు చేయడం.
వీటినే శీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నిత్య కర్మ అని చెప్పడం జరిగింది.
నియతం కురు కర్మత్వం - గీత
అర్థం: నీ నిత్యనాయిమట్టిక కర్మలు నువ్వు నిర్వహించు.
యోగస్థ కురు కర్మాణి - గీత
అర్థం: యోగస్థితిలో కర్మలు నిర్వహించు
అటువంటి కర్మ మనసును శుద్ధి చేసి ఆత్మ సాక్షాత్కారానికి సాధకుడిని సిద్ధం చేస్తుంది.
అకర్మ అంటే బంధాన్ని కలిగించని కర్మ లేక పనులు. ఆకర్మ అంటే యేమీ చేయకుండా ఉండటం కాదు. అకర్మ అంటే అంతరంగంలో కర్తృత్వ భావం లేకుండా కర్మలు చేయడం. అంటే అహంకారం లేకుండా, కోరికలు లేకుండా, ఎటువంటి బంధాల్లేకుండా చేసే పనులు.
అకర్మ స్థితిలో నీ ద్వారా పనులు జరుగుతాయి. కానీ కర్మను ప్రోగు చేసుకోవడం ఉండదు. అంతరంగంలో నిశ్శబ్దంగా, బంధాలకతీతంగా ఉండగలుగుతాము.
కర్మాణి అకర్మ యః పశ్యేద్ - గీత
చేసే కర్మలో కర్మ చేయకుండా ఉండటం చూడగలిగినవాడిని విజ్ఞుడంటారు.
ఉదాహరణలు: ఒక జ్ఞాని కరుణతో బోధలు చేయడం; కర్మ యోగి నిసస్వార్థంగా పని చేయడం; ఈశ్వరార్పణంగా కర్మలు చేయడం.
వికర్మ అంటే ధర్మానికి విరుద్ధంగా చేసే పనులు. అంటే అనైతికమైన పనులు, ఇతరులకు హాని కలిగించే పనులు, స్వార్థపూరితమైన, వినాశనానికి దారి తీసే ప్రవర్తన, శాస్త్ర విరుద్ధంగా ఉండే పనులు.
దీని పర్యవసానాలు ఇలా ఉంటాయి: నకారాత్మక ప్రభావాలు, మానసిక, ఉద్వేగపరమైన గందరగోళం, ఆధ్యాత్మిక పతనం.
వికర్మణాః సంశయ కరణి - గీత
అర్థం: అక్రమంగా చేసే పనులు పతనానికి, గందరగోళానికి దారి తీస్తాయి.
ఉదాహరణలు: స్వార్థం కోసం అసత్యాలు పలకడం, కోపంతో చేసే హింస, మోసం చేయడం, స్వలాభార్జన, హస్తలాఘవం, కర్తవ్యపాలనను నిర్లక్ష్యం చేయించే అలసత్వం, బద్ధకం, వంటి పనులకు పాల్పడటం.
మన ఆధ్యాత్మిక ప్రయాణం ఈ విధంగా సాగాలి:
వికర్మ -> కర్మ -> అకర్మ -> జ్ఞానం -> మోక్షం -> సాక్షాత్కారం
ఒక్క వాక్యంలో చెప్పాలంటే:
కర్మ అంటే మనం చెయ్యవలసిన పని.
అకర్మ అంటే అహం లేకుండా చేసే పని .
వికర్మ అంటే మనం చేయకూడని పని.
అద్భుతం కృష్ణ జీ ! మంచి అంశాన్ని ఎంచుకున్నారు. విడమరచి విశదీకరించారు. మన మార్గం బొమ్మ వేసి చూపించారు.
రిప్లయితొలగించండిచివర్లో అంతటినీ ముగింపు గా ఒక్క వాక్యంలో చెప్పేశారు.