25, అక్టోబర్ 2025, శనివారం

గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం

 


నిరంతర భగవత్ స్మరణలో గృహస్త జీవనం కొనసాగిస్తే అది అత్యున్నత తపస్సు అవుతుంది. 


గృహస్థ జీవనం - భగవత్సాక్షాత్కారం
 
వైదిక జీవన విధానం ప్రకారం మనిషి 4 ఆశ్రమాల్లో తన జీవితాన్ని కొనసాగించాలి - బ్రహ్మచర్యం; గృహస్థ; వానప్రస్తం; సన్న్యాసం. అందులో గృహస్థ జీవనం మిగిలిన అన్నిటికీ మూల స్తంభంలాంటిది. 

గృహస్థు జీవనం అంటే కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలను నెరవేర్చే దశ, ప్రపంచంతో చురుకుగా, క్రియాశీలకంగా ఉండే దశ. అంటే కాదు చతుర్విధ పురుషార్థాలయిన ధర్మార్థకామమోక్షాలకు రంగం ఈ గృహస్థు జీవనం. 

గ్రుహస్థు జీవనం, ఇతరులను గురించి ఆలోచించేలా చేసే దశ. విద్యార్థి దశ తరువాత వివాహంతో  ప్రారంభమవుతుంది. ఒక్కరుగా ఉండే మనిషి ఇద్దరవుతారు. కనీసం మరో మనిషి గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ తరువాత సంతానం కలుగుతుంది; అలా సంతానాన్ని గురించి ఆలోచించడం వెరసి కుటుంబం గురించి క్రమక్రమంగా ఆలోచించడం, వారి పట్ల బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది; ఇవన్నీ ప్రేమ, త్యాగం నేర్పిస్తాయి. దురదృష్టవశాత్తూ అవన్నీ మనిషి తన కుటుంబానికి మాత్రమే పరిమితమై సేవాలనందిస్తాడు. నిజానికి ఈ ఇతరులకు సేవ చేసే భావం క్రమక్రమంగానైనా సమాజయంలోకి వ్యాపించాలి. ఆ తరువాత జగత్తునమతా మన ప్రేమ, త్యాగం వ్యాపించాలి. అంటే తనను గురించిన స్పృహ క్రమక్రమంగా పోవాలి; అదే దైవసాక్షాత్కార దిశగా మనిషిని తీసుకువెళ్ళేది. పైన అనుకున్న బాధ్యతలన్నీ, చేసే ప్రతీ పనిని నిరంతర దైవ స్మరణలో సమర్పణ భావంతో చేసినప్పుడే అది సరైన జీవనంగా మారుతుంది. 

సహజ మార్గ జీవన విధానం, గృహస్థు జీవనాన్ని ప్రేమ, త్యాగం, మమకారంలో వైరాగ్యాన్ని నేర్పించే రంగంగా భావిస్తుంది. గృహస్థు జీవనం నిరంతర దైవ స్మరణలో కొనసాగించినప్పుడు అదే మోక్షమార్గంగా మారిపోతుంది, అని బాబూజీ అంటారు. 

మన శాస్త్రాల ప్రకారం గృహస్థుని యొక్క ధర్మాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1) స్వధర్మం - నిజాయితీ నిర్వర్తించవలసిన బాధ్యతలను నిర్వహించడం 2) దానం - దానాలివ్వడం 3) యజ్ఞ - నైతిక, ఆధ్యాత్మిక కర్మలను (సాధనాలను) నిర్వర్తించడం 4) అతిథి సేవ - అతిత్తులను సేవించడం 5) సంస్కారాలు - నామకరణం, ఉపనయనం, వివాహం ఇత్యాది పవిత్ర కర్మలను ఏ సమయానికి చేయవలసినవి ఆ సమయంలో చేయడం 6) సమతౌల్యత - భౌతిక-ఆధ్యాత్మిక కర్మలను సామరస్యంగా ఉండేలా నిర్వర్తించడం. 

క్లుప్తంగా చెప్పాలంటే, గ్రుహస్థు జీవనం అంటే :
సరళంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం 
సంబంధాల మధ్య ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం 
ఇంటిని ఒక ఆశ్రమంగా భావించడం. 




1 కామెంట్‌:

  1. ఆహా ! ఎంత చక్కగా సంక్షిప్తంగా చెప్పారు !! మనం అలా నేను, నా భార్య, నా కుటుంబం నుండి అలా విస్తరిస్తూ, ఈ ప్రక్రియలో మనలను మనం మరచిపోయీ ఉన్నతంగా ఎదగడం అని వివరించారు, అప్పుడే మనం అంతా కలసి ఒక నవ మానవ జాతికి నాంది పలకగలం

    రిప్లయితొలగించండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...