సమయం - కాలం (భాగం 3)
సహజ మార్గ మాస్టర్లు అనుభవ జ్ఞానంతో, కాలాన్ని గురించిన పలికిన కొన్ని అమృత వాక్కులు:
- విడిచిన బాణం, పలికిన మాట, గడిచిన కాలం తిరిగి రావు. కాబట్టి వీటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి.
- భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తనను తాను 'కాలోస్మి' అని చెప్పుకుంటాడు; అంటే తానే కాలమని అర్థం. అందుకే కాలాన్ని వృథా చేయడం అంటే భగవంతుని వ్యర్థం చేయడమే అన్నారు చారీజీ.
- శారీరక, మానసిక అనుభవాలన్నీ కాలపరిధిలోనే సంభవిస్తాయి. అంటే భూత, వర్తమాన, భవిష్యత్కాలాల్లోనే సంభవిస్తాయి. అందుకే శరీరానికి, మనసుకు అతీతంగా,కాలాతీతంగా ఎదగవలసిన అవసరం; అదే పూర్ణత్వం;అది మనిషికి మాత్రమే ధ్యానం ద్వారా సాధ్యం.
- ధ్యానం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు; సమయాన్ని సృష్టించుకోవచ్చు; వృథా గాకుండగా జీవించడం నేర్చుకోవచ్చు; తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పనులను నాణ్యతలో రాజీ పడకుండా ఉండే సమర్థతలను పెంచుకోవచ్చు. - దాజీ
- కాలాతీత చేతనంతో జీవించడం వల్ల అన్నిటి పట్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది; వివేకం ఏర్పడుతుంది; అది ఈ భవసాగరాన్ని సునాయాసంగా ఈదేలా చేస్తుంది.
- నా సమయం ఎప్పుడూ వృథా కాదు. - లాలాజీ. అంటే వారెప్పుడూ నిరంతర స్మరణలో ఉంటారు కాబట్టి.
- ప్రేమ, పవిత్రత, హృదయంలోని ప్రశాంతత, శాంతి, ఆనందము, నిశ్చలత్వం ఇత్యాదివన్నీ కాలాతీత స్థితులే.
ఆహా ! ఎంత విషయాన్ని అంత సంక్షిప్తంగా చెప్పారు.
రిప్లయితొలగించండి