19, జూన్ 2024, బుధవారం

దాజీ సూచించిన ధ్యాన ప్రక్రియలు - అట్లాంటా, అమెరికా జూన్ 9, 2024

 


Daaji - Meditate on Heart and Atma Chakra alternate nights (June 9th 2024, Afternoon, Atlanta)

Exercise Daaji improvised on - on the final day of North America Seminar.

“.. I wish you do this alternate night. One night ..you Meditate on the Heart invoking Climate of Reverence, Love, Humility in the Heart and go to sleep. 

Another day(night) just focus your attention very gently on Atma Chakra very lovingly. Just rest your attention there and go to sleep - Alternate night.”


దాజీ రోజు విడిచి రోజు చెయ్యమని సూచించిన  ధ్యాన ప్రక్రియలు  - అట్లాంటా, అమెరికా జూన్ 9, 2024 

రోజు విడిచి రోజు రాత్రి పడుకోబోయే సమయంలో, హృదయంలో పూజ్య భావం, ప్రేమ, వినమ్రతలతో కూడిన వాతావరణం నెలకొంటోందన్న భావాన్ని ఆవాహన చేస్తూ హృదయ చక్రంపై ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోండి.  

అలాగే మరో రోజు రాత్రి ఆత్మ చకరంపై చాలా ప్రేమగా, చాలా నెమ్మదితో మీ దృష్టిని కేంద్రీకరించండి. కేవలం ఆ విధంగా మీ దృష్టిని అక్కడే స్థిరంగా ఉంచుతూ నిద్రలోకి జారుకోండి - రోజు విడిచి రోజు. 


1: హృదయ చక్రం 
2: ఆత్మ చక్రం 


14, జూన్ 2024, శుక్రవారం

బాబూజీ గురించి దాజీ తరచూ తలచుకునే కొన్ని పరివర్తనకు కారణమయ్యే వాక్యాలు


బాబూజీ గురించి దాజీ తరచూ తలచుకునే 
కొన్ని పరివర్తనకు కారణమయ్యే వాక్యాలు 

You may be great, but think that the other person is greater.

మీరు గొప్పవారు కావచ్చు, కానీ అవతలి వ్యక్తి మరింత గొప్పవారని భావించండి. 

ఈ వాక్యం మన శీలానికి, వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం. మనిషి తరచూ తనను తాను చాలా గొప్పవాడనుకుంటూ ఉంటాడు. తప్పులేదు. కానీ అవతలి వ్యక్తి మరింత గొప్పవాడిగా భావించినట్లయితే, గర్వం నుండి, దురహంకారం నుండి తనను తాను కాపాడుకోవడమే గాక సామరస్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు మానవ సంబంధాల్లో. 


More and more of less and less.

మరింత మరింత తగ్గడం అనేది, మరింత మరింత ఎక్కువవ్వాలి.

కోరికలు తగ్గడం ఎక్కువవుతున్న కొద్దీ సంతుష్టి  పెరుగుతుంది.

ఆలోచనలు తగ్గినకొద్దీ మనశ్శాంతి/మానసిక ప్రశాంతత పెరుగుతుంది.   

ధ్యానం ఎక్కువైన కొద్దీ శుద్ధీకరణ అవసరం తగ్గుతూంటుంది. 

అహంకారం తగ్గినకొద్దీ వినమ్రత పెరుగుతుంది, స్వార్థం తగ్గుతుంది, భక్తి పెరుగుతుంది, శరణాగతి భావం కలుగుతుంది. 

సంస్కారాలు తగ్గినకొద్దీ పవిత్రత పెరుగుతుంది; స్వచ్ఛత పెరుగుతుంది. 


12, జూన్ 2024, బుధవారం

సహజ మార్గ ప్రార్థనలోని 3 వ వాక్యం: ఆ దశకు జేర్చు ఏకైక స్వామి, శక్తి

 


సహజ మార్గ ప్రార్థనలోని 3 వ వాక్యం:
 ఆ దశకు జేర్చు ఏకైక స్వామి, శక్తి 

సహజ మార్గ ప్రార్థనలోని 3 వ వాక్యం ఇలా ఉండి: "మమ్ము ఆ దశకు జేర్చు ఏకైక స్వామివీ, శక్తివీ నీవే."
"Thou art the Only God and Power to bring us up to that stage."

మొదటి వాక్యం మన జీవిత యదార్థ లక్ష్యాన్ని మన ముందుంచుతున్నది. 
రెండవ వాక్యం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉండే అవరోధాలేమిటో గుర్తిస్తున్నది. ఉన్న వాస్తవాన్ని ఆ మాస్టరుకు విన్నవించుకోవడం జరుగుతున్నది. 
మూడవ వాక్యం ఇటువంటి పరిస్థితిలో ఇరుక్కుపోయి, విముక్తి కోసం, సాధకుడు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ మొరపెట్టుకుంటున్న సందర్భం ఈ మూడవ వాక్యం. 
మరొక ముఖ్య అంశం ఈ ప్రార్థనలో గమనించినట్లయితే, 'మేమింకనూ', 'మా', 'మమ్ము' అనే పదాలు గమనార్హాలు.  ఈ ప్రార్థనలో ఎక్కడా భగవంతుని యాచిస్తున్న దాఖలాలు లేవు. కేవలం ఉన్న యదార్థాన్ని వారి ముందుంచడం జరుగుతోంది. అలాగే ఈ ప్రార్థన కేవలం వ్యక్తిగతంగా గాకుండగా అందరినీ కలుపుకుని చేసే ప్రార్థనగా ఉంది. పైన చెప్పిన పదాలే వీటికి నిదర్శనం. అంతేగాక ఈ 3 వ వాక్యం, ఆ సర్వశక్తిమంతుడైన పరమాత్మపై  ఎంతగా  ఆధారపడి ఉన్నామో అన్న వాస్తవాన్ని గుర్తించడం జరుగుతున్నది.  
వెరసి ప్రేమతోనూ, భక్తితోనూ నిండిన హృదయంతో ఈ ప్రార్థన యొక్క భావాన్ని మనసులో ఉంచుకుని నివేదించినప్పుడు, హృదయం లోలోతుల్లో నుండి ఒక ఆర్తి పెల్లుబుకినప్పుడు భగవంతుని పట్ల ఒక అనూహ్య బాంధవ్యం ఏర్పడుతుంది; అనుబంధం ఏర్పడటం ప్రారంభిస్తుంది. శరణాగతి భావాన్ని కలుగజేస్తుంది. 
ఈ విధంగా ప్రార్థన వల్ల మనలో నిస్స్వార్థ  భావం, వినమ్ర భావం, శరణాగతి భావం, భక్తి భావం, వంటి ఉదాత్త భావాలు కలిగి మనలో జరుగవలసిన పరివర్తనకు ఎంతగానో దోహదం చేస్తుంది, ఈ ప్రార్థన. 

సహజ మార్గ ప్రార్థనలోని 2 వ వాక్యం: యదార్థ లక్ష్యానికి అవరోధాలు

 


సహజ మార్గ ప్రార్థనలోని 2 వ వాక్యం: 
యదార్థ లక్ష్యానికి  అవరోధాలు  

సహజ మార్గ ప్రార్థనలోని రెండవ వాక్యం ఈ విధంగా ఉంది: "మేమింకనూ కోరికలకు బానిసలమై యుండుట, మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది." 
"We are yet but slaves of wishes putting bar to our advancement."

ఇక్కడ పూజ్య చారీజీ వివరించిన అర్థం: కోరికలకు బానిసలమై యుండుట మన ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగా ఉంది. అంటే కోరికలుండటం తప్పా? కాదు. కోరికలకు బానిసలుగా  ఉండటం అడ్డు అవుతుంది. 'ఐస్ క్రీమ్ తినాలని ఉంది' - అది కోరిక. 'ఐస్ క్రీమ్ తినకపోతే నేనుండలేను' - అది కోరికకు బానిసత్వం. అది కూడదు. ఇలా బానిసలమైపోయిన కోరికలు మనిషిలో లెక్కలేనన్ని ఉంటాయి, తరచి చూచుకుంటే.  బానిస గాకుండగా ఉండటం మనిషి చేతిలో ఉంది. 
ఇక్కడ పూజ్య దాజీ ఇచ్చిన వివరణ: ఆంగ్లంలో wishes అనే పదానికి ఈ విధంగా అర్థం చెప్పడం జరిగింది. Wish అంటే ఆశ. ప్రతీ కోరిక ఆశతో ప్రారంభమవుతుందంటారు దాజీ. ఆశ కోరికకు బీజం అంటారు. ఆశ తీవ్రతరం అయినప్పుడు అది కోరికగా మారుతుంది.  అటువంటి ఆశలే మన ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధాలు అని అంటారు దాజీ. 
కాబట్టి ఆశలను/కోరికలను పోగొట్టుకోవడం అనేది మనిషి చేతిలో ఉంది. ఆశలు/కోరికలు ఎంత తగ్గించుకుంటే అంత గమ్యానికి చేరువవుతాం అంటుంది ఆధ్యాత్మికత. అందులో కోరికల బానిసత్వం మరిన్ని వికారాలకు దారి తీస్తుంది.  కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా కోరికలు తగ్గించుకుంటూ, అవసరాలకు పరిమితమవ్వాలి. దైవసాక్షాత్కారం పొందాలనుకున్నవారికి, ఆ అవసరాలు  కూడా తగ్గిపోవాలి. అతి తక్కువ అవసరాల స్థాయికి రావాలి. అప్పుడే సూక్ష్మాతి సూక్ష్ముడైన దైవత్వాన్ని దర్శించగలుగుతాడు మనిషి, అంటుంది సహజ మార్గం. 

సహజ మార్గ ప్రార్థనలోని మొదటి వాక్యం: మనిషి జన్మ యొక్క యదార్థ లక్ష్యం


సహజ మార్గ ప్రార్థనలోని మొదటి వాక్యం: 

మనిషి జన్మ యొక్క యదార్థ లక్ష్యం 


సహజ మార్గ ప్రార్థనలోని మొదటి వాక్యం ఈ విధంగా ఉంటుంది: "ఓ, మాస్టర్! మానవ జీవితమునకు యదార్థ లక్ష్యము నీవే."

"O Master! Thou art the Real Goal of human life."

మనిషికి అనేక లక్ష్యాలున్నట్లుగా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ లక్ష్యాలు సిద్ధించడం కోసం నిత్యం సంఘర్షిస్తూ ఉంటాడు. వాటిల్లో ప్రధాన లక్ష్యాలు - డబ్బు సంపాదించడం,  ఆస్తులు సమకూర్చుకోవడం, అధికారం సంపాదించడం, పేరు-ప్రతిష్ఠలు సంపాదించడం, ఉద్యోగాల్లో ఉన్నత హోదాలకు చేరడం, ఇలా కొన్ని ఉన్నాయి. 

మనిషికి అనేక లక్ష్యాలుండవచ్చు గాని, యదార్థ లక్ష్యం ఒక్కటే అందరికీ అంటుంది ఆధ్యాత్మికత. ఆ యదార్థ లక్ష్యం ఏమిటంటే, మనిషి యొక్క అంతరంగ వికాసం. దీన్నే ఆధ్యాత్మిక వికాసం, ఆత్మవికాసం, చైతన్య వికాసం, అని కూడా అంటారు.  The real goal of human life is to evolve. అంతరంగ వికాసం అంటే మనోబుద్ఢ్యహంకారచిత్తాల పరిణతి, వికాసం. చేతన యొక్క వికాసం.  

మన వైదిక వాజ్ఞ్మయం ప్రకారం అమీబా వంటి ఏకకణ జీవి నుండి మనిషి జన్మ వరకూ వికాసం, ఆత్మ 84 లక్షల యోనుల నుండి ప్రవేశిస్తూ జరిగిందంటారు. మనిషిగా వికాసం చెందడానికి అంత ప్రయాణం చేయవలసి ఉంటుందట. 

మనిషి జన్మ వచ్చే వరకూ ఈ వికాస-ప్రయాణం అప్రయత్నంగానే తనంతతానుగానే,  సహజంగానే  జరుగుతూ ఉంటుందట. మనిషి జన్మ వచ్చే సరికి మనోబుద్ధ్యహంకారచిత్తాలు చక్కటి వికాసం చెంది ఉంటాయి, మిగిలిన జీవరాసుల సూక్ష్మ శరీరాలు అంతగా వికాసం చెంది ఉండవు. 

అయితే మనిషి జన్మ అనేది ఉత్కృష్ట జన్మే అయినప్పటికీ,  మనిషి జన్మ తరువాత కూడా ఊర్ధ్వదిశగా జరగడానికి ఇంకా ఎంతో ప్రయాణం ఉంది, ఎంతో వికాసం ఉంది. వీటినే మనం ఉన్నత లోకాలంటాం. అయితే ఈ ఉన్నత లోకాలకు మనిషి వికాసం చెందడం అనేది ప్రకృతి మనిషి ఇచ్ఛకు వదిలిపెట్టేసింది. మనిషికి ఇష్టమైతేనే ఉన్నత లోకాల యాత్ర జరుగుతుంది, లేకపోతే జరగదు. ఆ ఎంపిక చేసుకునే అవకాశం భగవంతుడు లేక ప్రకృతి మనిషికి ప్రసాదించడం జరిగింది. 

వికాసం అనేది, ఎదుగుదల అనేది ప్రకృతి ధర్మం. ఏ జీవీ కూడా ఈ నియమానికి విరుద్ధంగా ఉండలేదు. ప్రకృతి ధర్మం ప్రకారం ఈ ఎదుగుదల జరుగుతూనే ఉంటుంది. ప్రకృతి నిర్ణయించిన గతిలో కొనసాగుతూ ఉంటుంది. కానీ మనిషి జన్మలో మాత్రమే ఆ గతిని వేగవంతం చేయగలిగే అవకాశం ఉందట. అందుకే మానవ జన్మ వికాసానికి, ఒక అద్భుత అవకాశం అంటారు. మనిషికి ఉన్న సంకల్పశక్తి ద్వారా ప్రయత్నపూర్వకంగా ఈ వికాసం యొక్క గతిని తీవ్రతరం చేసుకోవచ్చు. అదే ఆధ్యాత్మికత యొక్క ప్రయత్నం. ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరిస్తే, మనిషి వికాసం వేగవంతమయ్యే అవకాశం ఉంది. 

ఆ విధంగా మనిషి ఎదుగుతున్న కొద్దీ తన హృదయంలో తన యదార్థ లక్ష్యం యేమిటో ప్రస్ఫుటంగా తెలుసుకోగలగడం, దాని కోసం తీవ్రంగా తపించడం, చివరికి దాన్ని చేరుకోగలగడం,  జరిగే అవకాశం ఈ జన్మలోనే ఉందని సహజమార్గ ప్రధాన బోధన. 

మన ప్రార్థన ప్రకారం, మానవ జీవిత యదార్థ లక్ష్యం మాస్టర్. అంటే ఆ పరతత్త్వం, పరమాత్మ. మాస్టర్లకందరికీ మాస్టర్. పరిపూర్ణత్వానికి  ప్రతిరూపం మాస్టర్. అది అంతరంగ వికాసం ద్వారా మాత్రమే సాధ్యం. 

6, జూన్ 2024, గురువారం

బాబూజీ - ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి ఒక్కరూ సూర్యునిలా ప్రకాశించాలని కోరుకుంటున్నా

 



బాబూజీ - ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి ఒక్కరూ సూర్యునిలా ప్రకాశించాలని కోరుకుంటున్నా 

బాబూజీ - ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రతి ఒక్కరూ సూర్యునిలా ప్రకాశించాలని కోరుకుంటున్నాను.  
కానీ భూమి యొక్క ప్రతిబింబం సూర్యునిపై పడనివ్వకుండా ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. 
అదెప్పుడు సాధ్యపడుతుందంటే, మీ కక్ష్యను దానికి అనుగుణంగా మలచుకున్నప్పుడు అవుతుంది. 
అటువంటి కక్ష్య ఎలా ఏర్పడుతుంది?
మీ కదలిక తిన్నగా ఉండేలా చూసుకున్నప్పుడే జరుగుతుంది 
మరి ఆ కదలిక తిన్నగా ఎప్పుడవుతుంది? 
మన గమ్యం ఎప్పుడూ దృష్టిలో ఉన్నప్పుడు జరుగుతుంది 
మరి గమ్యం దృష్టిలో ఎప్పుడుంటుంది?
మీరు పూర్తిగా ఆయనవారైనప్పుడుంటుంది. 
ఆయనవారుగా ఎప్పుడవగలుగుతాం? 
మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోగలిగినప్పుడు. 
ఆ విధంగా మిమ్మల్ని మీరు కోల్పోగలిగేదెప్పుడు? 
మనసులో ఆయన ఆలోచన తప్ప మరేదీ లేనప్పుడు.  
అదెప్పుడు సాధ్యపడుతుంది? 
సాధన ద్వారా సాధ్యపడుతుంది. 
సాధన ఎలా అలవడుతుంది? 
ప్రేమ ద్వారా, ఆసక్తి ద్వారా. 
ఈ ప్రేమాసక్తులు ఎలా కలుగుతాయి? 
పదే పదే తలచుకోవడం ద్వారా. 
ఇలా పదే పదే తలచుకోవడం ఎలా అలవడుతుంది?
దృఢ నిశ్చయం ద్వారా. 
ఈ దృఢ నిశ్చయం ఎలా సాధ్యపడుతుంది?
మీ విశ్రాంతిని, సుఖాలను త్యాగం చేసి, బద్ధకానికి వీడ్కోలు పలికి నడుం బిగించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. 

బాబూజీ ప్రకారం సరైన అభ్యాసి అంటే ఎవరు?

 


బాబూజీ ప్రకారం సరైన అభ్యాసి అంటే ఎవరు? 

మృదువుగా మాట్లాడేవాడు 
ఇతరులను గౌరవించేవాడు 
ముక్కుసూటిగా ఉండేవాడు 
అహాన్ని వదులుకునేవాడు 
ప్రేమ కలిగి ఉన్నవాడు 
కర్తవ్య దృష్టి గలవాడు 
మంచి హృదయం గలవాడు 
ఎప్పుడూ చురుకుగా ఉండేవాడు 
వినయంతో ఉండేవాడు 
మర్యాదగా వ్యవహరించేవాడు 
తన తప్పులు తెలుసుకుని సరిదిద్దుకునేవాడు 
మొండిగా వ్యవహరించనివాడు 
ఒకవేళ ఉంటే తన కోరికలను పోగొట్టుకునే విషయంలో మొండిగా ఉండేవాడు 
తన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించే విషయంలో మొండిగా ఉండేవాడు 
తనను తాను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నవాడు 
నిత్యం సాధన చేయడానికిష్టపడేవాడు 
మాస్టరుకు, మిషన్ కు సేవలనందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు 
మాస్టరుకు ఎల్లవేళలా సహకరించేవాడు 
ఆయనకు తనను తాను సమర్పించుకోవడానికి ఇష్టపడేవాడు. 


అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...