12, ఏప్రిల్ 2024, శుక్రవారం

సహజ మార్గం ఒక నూతన నాగరికతను సృష్టించబోతున్నది

 

(పై వీడియో వీక్షించగలరు)

సహజ మార్గం ఒక నూతన నాగరికతను సృష్టించబోతున్నది 
Sahaj Marg is going to create new civilisation
 

World peace should start with individual minds and hearts. The power of yogic transmission or the pranahuti  creates a remarkable character transformation through the change in our consciousness. Our ancient spiritual traditions are being revived on a mass scale and a new energy to unite humanity through spirituality is now awakened to expand globally. This is going to create a new civilization. 

- Daaji


ప్రపంచ శాంతి వ్యక్తిగత మనసుల్లో నుండి, హృదయాలలో నుండి మొదలవ్వాలి. యౌగిక ప్రాణాహుతి ప్రసరణ వల్ల చేతనలో మార్పు సంభవించడం ద్వారా గణనీయమైన శీలపరివర్తన జరుగుతుంది. మన ప్రాచీన ఆధ్యాత్మిక సాంప్రదాయాలన్నీ విస్తృత స్థాయిలో పునరుద్ధరింపబడుతున్నాయి; మానవాళిని ఆధ్యాత్మికత ద్వారా ఏకం చేయడానికి ఒక నూతన శక్తి ఆవిర్భవించింది, అదే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి విశ్వాన్ని జాగృతం చేస్తుంది. 

- దాజీ  

10, ఏప్రిల్ 2024, బుధవారం

బాబూజీ సందేశమాలిక 18 - సమర్థ గురువు అంటే ఎవరు? - Who is a capable Guide?

 


బాబూజీ సందేశమాలిక 18 
సమర్థ గురువు అంటే ఎవరు? 
Who is a capable Guide?
(మే 1970 సందేశం, Message May 1970)

Adopt easy means to gain the easy thing. Dogmas can do you no good. It is only the practical thing that can weave your destiny under the guidance of one who has measured the distance, and has discovered the original source. 

There are such men in India who can very easily guide you to the Destination, so near and dear to you. But the selection you have to make yourself. For Him to guide you in your search. I may say that where you find the idea of service with no selfish motive of the Guide, there rests the Real Thing.

One more thing to take into account specially, is to know and be sure that one who can foment you with his own internal divine power to make your task easy, is the only capable hand for spiritual guidance. To get such a man is a sure sign of successful solution of the problem of life. For you all I pray that the seekers may get such a Guide. Amen!

తేలికైన వస్తువును పొందాలంటే తేలికైన మార్గాన్ని అవలంబించాలి. పిడివాదాల వల్ల ఎటువంటి మంచీ జరగదు. మూలాన్ని కనుగొన్నవాడు, ఆ దూరాన్ని కొలిచినవాడు, అయిన వ్యక్తి మార్గదర్శనంలో మాత్రమే మీ విధిని మీరు అల్లుకోగలుగుతారు, కేవలం ఆచరణీయమైన పద్ధతి ద్వారానే ఇది సాధ్యపడుతుంది. 

మీకు చాలా ప్రియమైనది, అతి సామీప్యంగా ఉండే మీ గమ్యానికి జేర్చగల మార్గదర్శనం చేయగలిగేటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు. కానీ ఆ వ్యక్తిని ఎంచుకోవడం మాత్రం మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది.  ఆయనను అన్వేషించే క్రమంలో మార్గదర్శనం చేయడానికి, నేను చెప్పేదేమిటంటే, ఏ మార్గదర్శిలో అస్సలు స్వార్థపరత్వం లేకుండా సేవా భావంతో నిండి ఉంటాడో, అక్కడే మనం వెదికే అసలైన వస్తువు ఉంటుందని చెప్పగలను. 

ప్రత్యేకంగా మరో విషయం గుర్తుంచుకోవాలి, ఎవరైతే తనలోపలున్న ఆధ్యాత్మిక శక్తితో మిమ్మల్ని పూరిగొల్పి పనిని సుగమం చేయగలడో అతడే ఆధ్యాత్మిక మార్గదర్శనానికి సమర్థుడైన గురువు. అటువంటి వ్యక్తి తటస్థమవడం జీవిత సమస్యకు పరిష్కారం నిస్సందేహంగా లభించినట్లే. సాధకులందరికీ అటువంటి మార్గదర్శి లభించాలని ప్రార్థిస్తున్నాను. తథాస్తు! 

బాబూజీ సందేశమాలిక 17 - యోగాశ్రమాల ప్రయోజనం - Purpose of Yogashrams


బాబూజీ సందేశమాలిక 17 
యోగాశ్రమాల ప్రయోజనం 
Purpose of Yogashrams 
(రాయచూర్ యోగాశ్రమ ప్రారంభోత్సవ సందేశం, 16 జనవరి 1970)
(Raichur Yogashram Inauguration , 16 January 1970)

The idea of having an ashram is an ancient one although a hut was probably more than enough in the olden days. With the growth of civilisation the idea of having a modern building for the ashram has also developed.

The purpose of having an ashram building is to make it possible to render the best of spiritual service. It is common knowledge that ashrams where true form of worship and meditation is performed, are so charged with the spiritual force of the teacher that it will help towards the transformation of man.

పాత రోజుల్లో బహుశా ఒక చిన్న కుటీరం సరిపోయినప్పటికీ, ఒక ఆశ్రమం ఉండాలన్నది ఒక ప్రాచీనమైన భావన. నాగరికత వృద్ధి చెందడంతో ఆశ్రమం అంటే ఒక ఆధునిక భవనంగా పరిణామం చెందడం జరిగింది. 

ఆశ్రమ భవనం యొక్క ప్రయోజనం అతి శ్రేష్ఠమైన ఆధ్యాత్మిక సేవలనందించడం సాధ్యం చేయడమే. ఎక్కడైతే నిజమైన ఆరాధనా పద్ధతులు, ధ్యానాలు జరుగుతాయో, అక్కడ, ఆ ప్రదేశం అంతా  మనిషిలో పరివర్తన తీసుకురాగలిగే, గురువు యొక్క ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసినదే. 

ఆరోగ్యం కోసం చెట్టుతో ఒక సరళమైన సాధన

 

ఆరోగ్యం కోసం చెట్టుతో ఒక సరళమైన సాధన 













5, ఏప్రిల్ 2024, శుక్రవారం

బాబూజీ సందేశమాలిక 16 - మూలానికి తిరుగు ప్రయాణం - To return to the Source

 

బాబూజీ సందేశమాలిక 16 
మూలానికి తిరుగు ప్రయాణం 
To return to the Source 
(జనవరి 1970 సందేశం, January  1970, Message )

When we were born into this world for the first time we were pure, because the source from which we have descended or come down is purity. The time went on, and in our innumerable births we have gathered around us different types of grossness by our actions. 

The only way out of this existence is to return to the source. To find the way back by unravelling the strands binding us may not be possible except with the help of a guide who has connected himself to the Source, and who can therefore loosen the knots binding us by the power of his transmission of the highest consciousness.

The first and almost immediate effect of the transmission is to give peace and calmness which can hardly be expressed in words. This experience in meditation helps to gently remind us of the source to which we must return and repeated experience strengthens the remembrance of our original home, and so loosens the bondage of the present life. As the transmission takes us to deeper and deeper levels of remembrance, our journey to the source becomes firmly established.

I pray that all of you may be granted this experience to see the ight of the day.

మనం మొట్టమొదటసారి ఈ ప్రపంచంలో జన్మించినప్పుడు, చాలా పవిత్రంగా స్వచ్ఛంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే మనం యే మూలం నుండి అయితే వచ్చామో, దిగి వచ్చామో అది చాలా పవిత్రతకు మారుపేరు. కాలం గడుస్తున్నా కొద్దీ, అనేక జన్మలు తీసుకుంటూ, మనం మన చేతల వల్ల రకరకాల జడతవాన్ని, స్థౌల్యాన్ని ఏర్పరచుకుంటూ వచ్చాం. 

ఇటువంటి ఈ ఆస్తిత్వంలో నుండి బయటపడాలంటే ఒకటే మార్గం, మూలానికి తిరుగు ప్రయాణం చేయడమే. తిరిగి మూలాన్ని చేరే దారిని కనుక్కోవడం, మనం ఏర్పరచుకున్న బంధాలనే దారాలను విప్పడం సాధ్యం కాకపోవచ్చు, కేవలం ఆ మూల్యంతో అనుసంధానమై యున్న మార్గదర్శి ఎవరైనా ఉంటే తప్ప; ఆయన తనకున్న అత్యున్నత చేతనను ప్రసరించేటువంటి శక్తి ద్వారా అప్పుడు మనం ఇరుక్కున్న ముడులన్నీ వదులుగా చేయగలుగుతాడు. 

ఈ ప్రాణాహుతి ప్రసరణ యొక్క మొట్టమొదటి ప్రభావం, వెంటనే కలిగేటువంటి ప్రభావం ఏమిటంటే, శాంతి-ప్రశాంతతలు; ఈ ప్రభావాలను మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ధ్యానంలో మనకు కలిగే ఈ అనుభూతి మనం తిరిగి చేరుకోవలసిన  మూలాన్ని గుర్తు చేస్తుంది; పడే పడే కలిగిన అనుభూతి మన ఈ మూలనివాసం యొక్క స్మరణను తీవ్రతరం చేస్తుంది; అలాగే మన ప్రస్తుత జీవితంతో ఉన్న బంధాలను వదులుగా అయ్యేలా చేస్తుంది. ఈ ప్రాణాహుతి ప్రసరణ మనలను మరింత మరింత స్మరణ యొక్క లోలోతుల్లోకి తీసుకువెళ్ళిన కొద్దీ, మూలం వైపు మన ప్రయాణం పటిష్ఠంగా స్థాపింపబడుతుంది. 

మీ అమదరికీ ఇటువంటి అనుభూతి కలగాలని, ఈరోజున్న  వెలుగును గుర్తించాలని ప్రార్థిస్తున్నాను. 

బాబూజీ సందేశమాలిక 15 - ప్రపంచ శాంతి వ్యక్తిగత శాంతి మీద ఆధారపడుంది - World peace is related with the peace of the individual

బాబూజీ సందేశమాలిక 15 
 ప్రపంచ శాంతి వ్యక్తిగత శాంతి మీద ఆధారపడుంది 
 World peace is related with the peace of the individual 
(మే 1969 సందేశం, May 1969 Message)

The world today is in a state of unrest and disorder. Everybody seems to be crying for peace. But all efforts for bringing about peace appear to end in failure. The reason is that all efforts are merely external, touching only the outer surface. In fact, the problem is far from being related to the world in general; really it is the problem of the individual first and of society afterwards. As such it needs to be tackled in that order. World peace is closely related with the peace of the individual for which one has to take account of the inner state of one's mind. If man's mind is brought to the state of peace and order everything in the outside world will get into order in the same colour. But it is sad that the world has lost its real basis, and for its re-establishment, it is necessary to adopt means which may promote the feeling of peace and calmness of mind of the individual man.

What we have to do for the purpose is to introduce proper adjustments in the mental tendencies of the individual, which in effect is the proper moulding and regulation of mind. This is possible when the individual mind develops up to the state of universal mind. Just imagine! There will then be no problem! As it is, individual minds, which themselves lack peace and tranquility are trying to establish peace in the world. Isn't it ridiculous? The only way open to mankind is to take to the spiritual way of life, which is unfortunately absent today, leading to all this chaos.

ఈరోజు ప్రపంచం అల్లకల్లోలంగానూ, అశాంతితోనూ నిండి ఉంది. అందరూ శాంతి కోసం రోదిస్తున్నారు. కానీ శాంతి కోసం చేసే అన్నీ ప్రయత్నాలూ విఫలమవుతున్నట్లుగా తోస్తున్నది. కారణం ఏమిటంటే, ఆ ప్రయత్నాలన్నీ కేవలం బాహ్యమైన ప్రయత్నాలు కావడమే, ఉపరితలాన్ని మాత్రమే స్పర్శిస్తున్నాయి. వాస్తవానికి సమస్య ప్రపంచానికి సంబంధించినది కాదు; నిజానికి ఈ సమస్య వ్యక్తిగతమైనది,  ఆ తరువాతే సమాజానిది. కాబట్టి సమస్యను అదే వరుసలో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ప్రపంచ శాంతి, వ్యక్తి యొక్క శాంతితో చాలా దగ్గరగా ముడి పడుంది; దానికి వ్యక్తి యొక్క అంతరంగ మానసిక స్థితిని లెక్కలోకి తీసుకోవాలి.  మనిషి మనసును గనుక శాంతి, క్రమశిక్షణల్లోకి తీసుకురాగలిగితే, బయట ప్రపంచంలో అన్నీ వాటంతటవే ఉండవలసిన విధంగా అదే క్రమంలో సర్డుకుంటాయి. కానీ ప్రపంచం ఈ మూలాన్ని కోల్పోవడం దురదృష్టకరం. దీన్ని పునరుద్ధరించాలంటే, వ్యక్తిగతంగా మనిషి మనసులో శాంతి, ప్రశాంతతలను పెంపొందింపజేయాలి. 

ఈ ప్రయోజనం సిద్ధించడం కోసం, మనసును మలచడానికి, క్రమశిక్షణలో పెట్టడానికి అంటే మానసిక ప్రవృత్తులను, మనం సక్రమమైన సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది. ఇది వ్యక్తి మనసు విశ్వజనీన మనసుగా తయారైనప్పుడు సాధ్యపడుతుంది. ఒక్కసారి ఊహించండి! అప్పుడిక సమస్య ఉండదు! ప్రస్తుతం ఉన్న స్థితి ఎలా ఉందంటే, వ్యక్తుల మనసుల్లోనే శాంతి, ప్రశాంతటలు లేవు గాని వాళ్ళు ప్రపంచంలో స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా లేదూ? మానవాళికి ఉన్న ఏకైక పరిష్కారం ఆధ్యాత్మిక మార్గం మాత్రమే; దురదృష్టవశాత్తు అది ఈనాడు కనుమరుగైపోయింది, అది కనుమారుగవడమే  ఈ అల్లకల్లోలానికి దారి తీయడానికి గల కారణం. 

4, ఏప్రిల్ 2024, గురువారం

బాబూజీ సందేశమాలిక 14 - నేను మీ సాంగత్యంలో సంతోషంగా ఉంటాను - I remain happy in your company

 


బాబూజీ సందేశమాలిక 14 
నేను మీ సాంగత్యంలో సంతోషంగా ఉంటాను 
 I  remain happy in your company

(బెంగుళూరు, 18 డిశంబర్ 1968, Bangalore  18 December 1968)

I remain very happy in your company. When all of my associates gather at one spot, it becomes a temple for me and it is their duty to make their hearts as the temple themselves. I am happy that all of you follow the meditation prescribed; but there are a few who remain non-attached after the meditation is over. They forget the idea of God and begin to remember themselves throughout the light of the sun. It is their work to shape themselves for the Divine purpose. At its start if they thimk that this is our Mission and our God and then they will be helped much in His remembrance.

నేను మీ సాంగత్యంలో సంతోషంగా ఉంటాను. నా సహాచారులందరూ ఒక్కచోట సమావేశమైనప్పుడు నాకు అది దేవాలయంలా ఉంటుంది, అలాగే వాళ్ళ హృదయాలను వారే స్వయంగా దేవాలయాలుగా మార్చుకోవడం వాళ్ళ ధర్మం. నిర్దేశించిన ధ్యాన పద్ధతిని అనుసరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది; కానీ కొంతమంది ధ్యానం అయిన తరువాత దానితో సంబంధం లేకుండా ఉంటున్నారు. వాళ్ళు భగవంతుడిని మరచిపోయి వాళ్ళను వాళ్ళే రోజంతా స్మరించుకుంటూ ఉంటారు. వాళ్ళు తమను తాము దివ్య ప్రయోజనానికి తయారు చేసుకోవడం వాళ్ళ కర్తవ్యం. ప్రారంభంలోనే వాళ్ళు గనుక ఇది నా సంస్థ, నా దేవుడు అని అనుకోగలిగితే, ఆయన స్మరణలో ఉన్నప్పుడు చాలా సహాయకారిగా ఉంటుంది.  

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...