శ్రద్ధ
శ్రద్ధ అంటే సత్య పదార్థంతో నిత్యం అనునాదం కలిగి ఉండటం.
శ్రద్ధ, భక్తి లేకుండా ఆధ్యాత్మిక జీవనం అసాధ్యం. శ్రద్ధ అనే పదం మనం తెలుగు వాడుక భాషలో ఆసక్తి (interest) అనే అర్థంలో సాధారణంగా వాడుతూ ఉంటాం. అంటే మనసు పెట్టి చేయాలని. కానీ ఈ పదానికి సంస్కృత మూలం అయిన శ్రద్ధ అనే పదానికి అర్థం - మనసును లేక హృదయాన్ని సత్యముపై శాశ్వతంగా నిలిపి ఉంచడం. నమ్మకం పరిపక్వమయితే అది విశ్వాసం; విశ్వాసం పరిపక్వమైనప్పుడు అది శ్రద్ధ.
నమ్మకం -> విశ్వాసం -> శ్రద్ధ
నమ్మకం సమాచారంపై ఆధారపడినది; ఆలోచనపై ఆధారపడినది; స్థూలమైనది; మార్పుకు లోనుకావచ్చు.
ఆ విన్న సమాచారం ద్వారా అనుభవంలోకి వచ్చినప్పుడు కలిగేది విశ్వాసం. హృదయానికి సంబంధించినది. విశ్వాసం అంటే పరిపకవమైన నమ్మకం.
శ్రద్ధ అంటే ఆత్మకు సంబంధించినది; ఆత్మ సత్య పదార్థంతో, యాదార్థంతో అనునాద స్థితిలో ఉండటమే శ్రద్ధ. సంస్కృతంలో శ్రద్, అంటే హృదయం; ధా, అంటే నిలిపి ఉంచడం, ధరించడం. విశ్వాసం పరికమైనప్పుడు కలిగేది.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం - భగవద్గీత
శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుంది; జ్ఞానం శ్రద్ధ నివ్వడు. శ్రద్ధ జ్ఞానానికి ద్వారాలు తెరుస్తుంది.
శ్రద్ధ మూడు రకాలు
సాత్త్విక శ్రద్ధ; రాజసిక శ్రద్ధ; తామసిక శ్రద్ధ.
సాత్త్విక శ్రద్ధ స్పష్టతకు, ప్రశాంతతకు, సత్యనిష్ఠకు దారి తీస్తుంది; రాజసిక శ్రద్ధ విజయాన్ని, ఫలితాలను, ప్రదర్శనను కోరుకునేలా చేస్తుంది.
తామసిక శ్రద్ధ గ్రుడ్డి నమ్మకానికి, మూఢనమ్మకాలకు, హానికర చేష్టలకు దారి తీస్తుంది.
సహజ్ మార్గ మాస్టర్ల ప్రకారం:
గమ్యం దిశగా ముందుకు సాగుతున్నామన్న పరిపూర్ణ విశ్వాసం హృదయ లోలోతుల్లో ఉండటమే శ్రద్ధ.
ప్రాణాహుతి, ధ్యాన ప్రక్రియాలపై పరిపూర్ణ విశ్వాసం.
అంతరంగంలో నుండి మార్గదర్శి అయిన హృదయంపై పరిపూర్ణ విశ్వాసం.
శ్రద్ధ అంటే అసంభవమైనదాన్ని నమ్మగాలగడం - చారీజీ
ఇక్కడ శ్రద్ధ అంటే మాస్టర్ పై ఆధారపడటం కాదు, మన పద్ధతిపైన, ఆధ్యాత్మిక పరివర్తనం పైన పటిష్ఠమైన విశ్వాసం ఉండటం. శ్రద్ధ అంటే దివ్యత్వం అంటే సున్నితమైన, సూక్ష్మమైన ఆకర్షణ కలిగి ఉండటం.
శ్రద్ధను అలవరచుకోవడం ఎలా?
సత్సాంగత్యం ద్వారా అంటే తోటి సాధకులు/విజ్ఞుల సాంగత్యం ద్వారా, శాస్త్ర/ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం ద్వారా, నిజాయితీగా జీవించడం ద్వారా, విశాల హృదయంతో ధ్యానించడం ద్వారా, ప్రత్యక్షయనుభవం ద్వారా అంతరంగంలోని మార్పులు గమనించడం ద్వారా శ్రద్ధ పెరిగే అవకాశం ఉంది.
శ్రద్ధ యొక్క అత్యుకృష్ట స్వరూపం
పరిపూర్ణ శ్రద్ధ సంభవించినప్పుడు:
ఎక్కడా ఎటువంటి సందేహమూ ఉండదు ; హృదయం/మనసు స్థిరంగా ఉంటుంది; సాధన అప్రయత్నంగా జరిగిపోతుంది; దైవం అనేది ఇక నమ్మకంగా ఉండదు; సజీవ సాన్నిధ్యంగా మారిపోతుంది. దీన్నే పరమ శ్రద్ధ అని కూడా అంటారు - దివ్యత్వం పట్ల మొక్కవోని విశ్వాసం.
జగద్గురు శంకరాచార్యులు, శ్రద్ధ అన్న పదాన్ని ఈ క్రింది విధంగా నిర్వచించారు:
రిప్లయితొలగించండిగురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధాః
‘గురువు మరియు శాస్త్రముల పట్ల దృఢ విశ్వాసమునే శ్రద్ధ అంటారు.’ ఒకవేళ ఇలాంటి శ్రద్ధ తప్పుడు వ్యక్తి మీద పెడితే, అది భయానక పరిణామాలకు దారితీయవచ్చు. కానీ అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే అది శాశ్వత సంక్షేమం దిశగా మనలను తీస్కువెళుతుంది.
అదే సమయంలో, గుడ్డి విశ్వాసం మంచిది కాదు. ఏదో ఒక గురువు మీద అటువంటి శ్రద్ధ ఉంచే ముందు, మన బుద్ధిని ఉపయోగించి ఆ గురువు పరమ సత్యాన్ని ఎఱిఁగినవాడని, మరియు దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడని నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తరువాత, ఇటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి కృషిచేయాలి మరియు వారి మార్గదర్శకత్వంలో భగవంతునికి శరణాగతి చేయాలి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటుంది:
యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ,
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః (6.23)
‘గురువు మరియు భగవంతుని పట్ల భక్తిపై నిస్సంకోచమైన దృఢమైన విశ్వాసం కలవారికి వేదముల జ్ఞాన సారం, వారి హృదయంలో తెలియచేయబడుతుంది.’
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆహా ! ఎంత వివరంగా విశదీకరించారు. చివరకు సత్యంతో, సత్ పథార్థంతో నిరంతరం కలసి ఉన్నప్పుడే నిజమైన శ్రద్ధ అని తెలియచేసారు. అంతేకాదు, అక్కడ ఇంకా సందేహం, అనుమానం, అపనమ్మకానికి చోటులేదు అన్నారు. అసలైనది అసలులోనే ప్రకాశించినట్లు, యథార్థం యథార్థంలోనే ఉన్నప్పుడు ఇక అంతా వాస్తవికత ఉట్టి పడుతుంది. ధన్యఓషమి
రిప్లయితొలగించండి