హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో ధ్యానం
హార్ట్ఫుల్నెస్ సహజ్ మార్గ్ అనే రాజయోగ ధ్యానపద్ధతిలో, హృదయంలో దివ్యవెలుగు ఉందన్న భావనతో కూర్చోని ధ్యానించమంటారు. ఇంకా చెప్పాలంటే దివ్యవెలుగు యొక్క మూలమే హృదయంలో ఉందన్న భావంతో ధ్యానించమంటారు. ఈ వెలుగును మరల సూర్యకాంతిగానో, చంద్రకాంతిగానో, దీపపు కాంతిగానో, కొవ్వొత్తి కాంతిగానో మరే విధంగానూ ఊహించవద్దంటారు.
పూజ్య బాబూజీ మహారాజ్ మరే పదం ఏ భాషలోనూ కనిపించక ఈ Divine Light అనే పదాన్ని వాడారట. ఆ మూల దివ్య వెలుగుకు అతి సమీప పదం Light, అంటే వెలుగు జ్యోతి అన్నమాట. నిజానికిది Light without luminosity అంటారు బాబూజీ అంటే వెలుతురు లేని వెలుగు అన్నమాట. దీనికి రూపం లేదు, నిజానికి పేరు లేదు, తత్త్వం కూడా కాదు; అన్నిటికీ అతీతమైన వస్తువు ఈ ధ్యానవస్తువు. సూక్ష్మాతిసూక్ష్మ ధ్యానవస్తువు. హృదయంలో దివ్య వెలుగు ఉందన్న ఆలోచనపై ధ్యానించడానికి ప్రయత్నించాలి.
అందుకే చాలా మందికి మొదట్లో ధ్యానం ఎలా చేయాలో సరిగ్గా అర్థం కాదు. అయినా సరే మనకర్థమైన విధంగా చేస్తూ చేస్తూండగా, సాహిత్యం చదవగా చదవగా, ఇతరులు చెప్పింది వినగా వినగా మనకు తెలియకుండా చేయగలుగుతాం. ఇది అత్యంత ప్రభావపూరితమైన పద్ధతి మనకు ప్రత్యక్షానుభవంతో చేస్తున్న కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. మరింత మరింత స్పష్టత వస్తూంటుంది.
భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్ముడని, ఆయన్ని చేరుకోవాలంటే సాధకుడిలో కూడా అంత సూక్ష్మత్వమూ రావాలని బాబూజీ చెప్తారు. ఈ ధ్యానం మనలో అటువంటి సూక్ష్మత్వం కొంచెం-కొంచెంగా పెంచుతూ ఉంటుంది. దీనికి కావలసినది ఓపికతో కూడిన, విశ్వాసంతో కూడిన పట్టుదల. Perseverance అంటారు ఆంగ్లంలో. తప్పక ఫలితం కనిపిస్తుంది.
మన శాస్త్రాలలో దీనికి ఆధారం కావాలంటే మన అష్టాదశ పురాణాల్లో ఒకటైన పద్మపురాణంలో కనిపిస్తుంది. ఇందులో ఒక అధ్యాయంలో లక్ష్మీనారాయణుల సంభాషణలో, లక్ష్మీదేవి నారాయణుడిని అడుగుతుంది: "స్వామి మీరెప్పుడూ శేషసయనంపై నిద్రలో ఉన్నట్లు కనిపిస్తారు, మరి స్థితికారులైన మీఋ ఈ సృష్టిని ఎప్పుడు నడిపిస్తున్నారు?" అని ప్రశ్న వేస్తుంది అమ్మవారు. దానికి ఆ శ్రీమన్నారాయణుడు: "నేను యోగనిద్రలో నా అసలు స్వరూపంపై ధ్యానిస్తూ ఉంటాను" అంటాడు. "అదేమిటి? మీ అసలు స్వరూపం ఏమిటి?" అని అడుగుతుంది లక్ష్మీ దేవి. "నేను ధ్యానించేది నామరూపరహితమైన దివ్య తత్త్వంపై ధ్యానిస్తూ ఉంటాను; అదే మూలం; అక్కడి నుండే నాకు అవసరమైన వ్వవేకం లభిస్తుంది" అని నారాయణుడు సమాధానమిస్తాడట. ఈ మధ్యనే ఒక ప్రసంగంలో వినడం జరిగింది.
కాబట్టి బ్రహ్మ,విష్ణు మహేశ్వరులందరూ కూడా ధ్యానించేది దీనిపైనే కావచ్చు కూడా. ధ్యానం చేసిన మహాత్ములందరి ధ్యాన వస్తువు ఇదే కావచ్చును కూడా. అందుచేత ఈ ధ్యానం చేసే అవకాశం మనకు కలిగినందుకు మహాదృష్టవంతులుగా తమను తాము భావించుకుంటూ త్రికరణ శుద్ధిగా దీని అభ్యాసం కొనసాగిద్దాం.
సూక్ష్మమైన రహస్యాన్ని ఎంత చక్కగా చెప్పారు. అవును ప్రతి ఒక్క ద్దేవత, దైవం, తనకు మూలం అయినదాని మీద, అది ఏదైతే అది, ఏమైతే అది, దాని మీద ధ్యానం లో లయం లేదా లగ్నం అయి ఉంటారు. 'అవసరమైన వివేకం' లభిస్తుంది - అంతా అక్కడి నుండి అంటే ఆ అవ్యక్తమైనదాని నుండే ప్రవహిన్చాల్సిందే. అబ్బ, ఆహా ! కన్నా ఇంకేమి అనుకుంటాం. హార్ట్ ఫుల్ నెస్ లో ఉండడం లేక అడుగుపెట్టడం అంత అదృష్టం మరొకటి ఉంటుందా ! అద్భుతం.
రిప్లయితొలగించండిసమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర: ।
రిప్లయితొలగించండిసమ్ప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ॥ 13 ॥
ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థిత: ।
మన: సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత్ మత్పర: ॥ ౧౪ ॥
సమం — నేరుగా ; కాయ — శరీరం ; శిరః — తల ; గ్రీవం — మరియు మెడ ; ధారయన్ — పట్టుకొని ; అచలం — కదలకుండా ; స్థిరః — నిశ్చలంగా ; సంప్రేక్ష్య — చూస్తున్న ; నాసికా — ముక్కు యొక్క ; అగ్రం — కొన వద్ద ; స్వం — స్వంతం ; దిశః — అన్ని వైపులా ; చ — కూడా ; అనవలోకయన్ — చూడటం లేదు ; ప్రశాంత — ఉద్రేకం లేకుండా ; ఆత్మా — మనస్సు ; విగత - భిః — భయం లేని ; బ్రహ్మచారి - వ్రతే — బ్రహ్మచర్య ప్రతిజ్ఞలో ; స్థితః — స్థితః — స్థితః — మనస్సు ; సంయమ్య — పూర్తిగా అణచివేయడం ; మత్ — నాపై (కృష్ణుడు) ; చిత్తః — మనస్సును కేంద్రీకరించడం ; యుక్తః — వాస్తవ యోగి ; ఆసిత — కూర్చోవాలి ; మత్ — నేను ; పరాః — అంతిమ లక్ష్యం .
అనువాదం
శరీరం, మెడ మరియు తల నిటారుగా ఉంచి ముక్కు చివరను స్థిరంగా చూడాలి. అందువలన, ఆందోళన చెందని, అణచివేయబడిన మనస్సుతో, భయం లేకుండా, లైంగిక జీవితం నుండి పూర్తిగా విముక్తి పొంది, హృదయంలో నన్ను ధ్యానించి, నన్ను జీవితానికి అంతిమ లక్ష్యంగా చేసుకోవాలి.
అసలు స్వరూపంపై ధ్యానించడం అంటే హృదయంపై ధ్యానించడమనేనా అర్ధం?
రిప్లయితొలగించండి