పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025
అహమ్మదాబాద్ సోదరులు శ్రీ రాజగోపాలన్ గారు. వీరి వద్ద తక్కిన రెండు పరిచేయాత్మక ధ్యాన సిట్టింగులు పూర్తి చేసి ధ్యానం ప్రారంభించడం జరిగింది. విశేషం ఏమిటంటే అప్పటి నుండి ఇప్పటిదాకా వారు తన సాధన విడువకుండా కొనసాగించడం. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఎక్కడున్నా, ఒక ప్రక్క వ్యాపారం చేస్తూ, మరో ప్రక్క సంసార బాధ్యతలను వహిస్తూ కూడా తన సాధనా క్రమం ఎక్కడా తప్పకుండా కొనసాగించేవారట. ఇది గాక, వారికి పుస్తకాలు విపరీతంగా చారివేవారట; అన్నీ రకాల సాహిత్యం ముఖ్యంగా స్వీయ వికాస గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యము, బాగా చదివేవారట. ప్రస్తుతం ఎన్నో గ్రంథాలు రచిస్తున్నారు.
1977 లో, షాజహాన్పూర్ (ఉ. ప్ర.) వాస్తవ్యులయిన, తన గురుదేవులైన పూజ్య బాబూజీతో మొట్టమొదటి కలయిక సంభవిస్తుంది. ఆ మొట్టమొదటి దర్శనంలో ముఖాముఖీ సంభాషణ ఏమీ జరుగకపోయినా, ఇరువురి మధ్య మౌన సంభాషణ బాగా జరిగిందంటారు దాజీ అంతేగాక దాజీ ఇంటికి వెడుతూ బాబూజీని దర్శించి నమస్కారం పెట్టి వెడుతూండగా, "ఆకురాడిని ఫలానా మందు, వెన్నతో గ్రహించమని చెప్పు" అని బాబూజీ సహాచార్యుని ద్వారా సందేశం పంపిస్తారు. పూజ్య దాజీ ఆశ్చర్యపోతారు, తనకు ఆ ఆరోగ్య సమస్య ఉందని ఆయనకెలా తెలిసిందని నివ్వెరపోతారు. ఆ విధంగా దాజీకి పూజ్య బాబూజీ ప్రథమ దర్శనం జరుగుతుంది.
ఆ తరువాత యథాతథంగా తన అభ్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా వెళ్ళి అక్కడ తన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. న్యూ యార్క్ నగరంలో ఆయన వ్యాపారం విస్తరిస్తుంది. అయినప్పటికీ తన సాధనలో ఎక్కడా క్రమం తప్పలేదు. ఆరి ఆధ్యాత్మిక తృష్ణ తన లక్ష్యసాధన కోసం అంత లోతుగా ఉండేది. అలా పూజ్య దాజీ వ్యక్తిత్వం తూర్పు దేశాల హృదయం, పాశ్చాత్య దేశాల మేధస్సుల అద్భుత మిశ్రమంగా ఉండేది.
(సశేషం ... )
అద్భుతం.
రిప్లయితొలగించండి