30, జూన్ 2020, మంగళవారం

హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని క్లుప్తంగా వివరిస్తారా?

హార్ట్ఫుల్నెస్ సహజమార్గ ధ్యాన పద్ధతిని క్లుప్తంగా వివరిస్తారా?
హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన పద్ధతిలో 4 ప్రధాన ప్రక్రియలున్నాయి. వీటిని ప్రతి రోజూ ప్రతి నిత్యం సాధన చెయ్యవలసి ఉంది.
1. హార్ట్ ఫుల్ నెస్ రిలాక్సేషన్ ప్రక్రియ : ఇది ఓ 7 నిముషాల ప్రక్రియ. దీనితో సాధన ప్రారంభమవుతుంది. దీని లక్ష్యం ప్రధానంగా మన శరీరాన్ని, మనసును కాస్త స్థిమిత పరచి, ధ్యానానికి ఉపక్రమించే విధంగా శరీర-మనస్సులను సిద్ధం చేయడం. ఇది చేసిన వెంటనే సాధకుడు చాలా హాయిని, తెలియని అంతరంగ సుఖాన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. ముఖ్యంగా ఒత్తిళ్ళ నుండి వెంటనే విముక్తినిస్తుంది. చేసి చూడాలంతే.
.
2. హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం ప్రక్రియ : ఈ ప్రక్రియలో సాధకుడు మనస్సును హృదయంలో ఒక దివ్యమైన వెలుగు ఉందన్న భావనపై కొంత సేపు నిలిపే ప్రయత్నం చేయడం. దీనికి మనం ఇంతకు ముందు చెప్పుకున్న యౌగిక ప్రాణాహుతి, ఒక ప్రశిక్సక్షకుని ద్వారా గాని లేక గురువు ద్వారా గాని పొందడం జరుగుతుంది. ఇది మన ధ్యానం జరగడానికి చాలా బాగా తోడ్పడుతుంది. మొట్టమొదటిసారి ధ్యానానికి కూర్చున్నవారు ఎవరైనా కూడా ఈ యైగిక ప్రాణాహుతి అనుభూతిని పొందగలుగుతారు. ఏమైనా ఇతర ఆలోచనలు వస్తే వాటిని పట్టించుఓకుండా మన మనస్సును కేవలం ఆ దివ్య వెలుగు అనే భావనపై మాత్రమే నిలపడానికి ప్రయత్నిం చేయాలి. వెలుగు కనిపించనవసరం లేదు.
ధ్యానం ప్రతి రోజూ సాధ్యమైనంత వరకూ సూర్యోదయానికి ముందు ఒక అరగంటతో ప్రారంభించి క్రమక్రమంగా ఒక గంట వరకూ తీసుకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. లేక ఉదయాన్నే ఏదొక నిశ్చిత సమయంలో చేసుకోవడఁ మంచిది. సుఖాసనం లో కూర్చొని భక్తిప్రపత్తులతో ధ్యానాన్ని ప్రయత్నించాలి. కీళ్ళ నొప్పులున్నవారు కుర్చీలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకూ ఒకే నిశ్చిత సమయంలో, ఒకే ప్రదేశంలో, ఒకే ఆసనంలో ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకొనే ప్రయత్నం చెయ్యాలి.
3. హార్ట్ ఫుల్ నెస్ శుద్ధీకరణ ప్రక్రియ : మనం ఇంతకు ముందు అనుకున్న మరో విశిష్ట యౌగిక ప్రక్రియ. ఈ ప్రక్రియను ప్రతి రోజూ సాయంకాలం లేక ఆ రోజు పనులన్నీ పూర్తయిన తరువాత ఒక అరగంట సేపు చేసుకొనే ప్రక్రియ.
ఇందులో ఉదయం ధ్యానానికి కూర్చున్నట్లే సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ వెనుక భాగాన్ని తలచుకుంటూ, అంటే మీ శిరస్సు పై భాగం నుండి వెన్నెముకలోని చిట్టచివరి ఎముక వరకూ మీ వీపు భాగాన్ని మనసులో ఉంచుకొని, మీ సంకల్ప శక్తి/ఇచ్చాశక్తిని ఉపయోగిస్తూ మీ శరీర వ్యవస్థలోని స్థూల, జటిల, మలిన తత్త్వాలన్నీ మీ వీపు భాగం నుండి పొగ రూపం లో వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తూ ఒక 15 నిముషాలు కూర్చోవాలి. ఆ తరువాత పై నుండి ఒక దివ్యప్రవాహం మీ ఛాతీ భాగం లోకి ప్రవేశిస్తూ మీ శుద్ధీకరణ ప్రక్రియకు సహకరిస్తున్నట్లుగా మనసు ఒక సూక్ష్మ భావం చేసుకోవాలి. ఒక వైపు దివ్యప్రవాహం, మరో వైపు ఈ స్థూల, జటిల, మలిన తత్త్వాలన్నీ పొగ రూపంలో వెళ్లిపోవడం మనం మనో నేత్రంతో గమనీస్తూ ఒక 10 నిముషాలు కూర్చోవాలి. ఆ తరువాత మీ శరీర వ్యవస్థ, ఒక అనిర్వ్వచనీయమైన ఆంతరంగిక అనుభూతి, సుఖం, తేలికదనం కలుగుతుంది. ఆ అనుభూతిని 5 నిముషాలు అనుభవించి నెమ్మదిగా కళ్ళు తెరవాలి.
4. హార్ట్ ఫుల్ నెస్ ప్రార్థనా ప్రక్రియ : ఇది రాత్రి పడుకోబోయే ముందు పక్క మీదే కూర్చొని ఒక 10 నిముషాలు చేసుకొనే చివరి ప్రక్రియ. కళ్ళు మూసుకొని దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ, అంటే దైవం మన ముందే ఉన్నట్లుగా అనుభూతి చెందుతూ ఈ క్రింది 4 పంక్తులను ఎంతో భక్తి తో మనసులో ఒకటి-రెండు సార్లు అనుకోవాలి:
ఓ మాస్టర్!
మానవ జీవితమునకు యదార్థ లక్ష్యము నీవే.
మేమింకనూ కోరికలకు బానిసలమై యుండుట మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది.
మమ్ము ఆ దశకు జేర్చు ఏకైక స్వామివి, శక్తివీ నీవే.
ఈ నాలుగు పంక్తులూ మనసులో అనుకొని దాని భావంపై ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకోవాలి.
ఈ 3 ప్రక్రియలూ ప్రతి నిత్యం, ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఇలా 3 నెలలు గనుక చేసినట్లయితే, మీ జీవితంలోనే అనేక మార్పులు సహజంగా చోటు చేసుకోవడం గమనించవచ్చు.
ఉదాహరణకు మీ ఆలోచనల్లో మార్పులు, మీ అలవాటుల్లో మార్పులు, మీ ప్రవర్తనలో మార్ప్లు, మానసిక ప్రశాంతత రోజూ పెరగడం, ఆలోచనలో స్పష్టత రావడం, రోజురోజుకూ గుండె తేలికదనాన్ని మరింత ఎక్కువగా అనుభూతి చెందడం, తద్వారా మీ జీవితం యొక్క నాణ్యత పెరగడం గమనించగలుగుతారు.
ప్రత్యక్షానుభవమే దీనికి నిదర్శనం. నిజమైన శాశ్వతమైన సహజమైన మార్పులు,
మనందరమూ కాంక్షించే మనిషిలో అసలైన పరివర్తన రావాలంటే ధ్యానం ఒక్కటె శరణ్యం. అందునా హార్ట్ పుల్ న్స్ ధ్యాన పద్ధతి ఎంతో ప్రభావపూరితమైనది. తక్కువ సమయంలో సమూలమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...