30, జూన్ 2020, మంగళవారం

హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం - హృదయం పై ధ్యానం ఎందుకు?

హృదయపథం - హృదయం పై ధ్యానం ఎందుకు?
హార్ట్ పుల్ నెస్ ధ్యాన పద్ధతిలో హృదయంపై ధ్యానిస్తారు, హృదయాన్ని శుద్ధి చేస్తారు, హృదయంతో ప్రార్థిస్తారు, హృదయం లో కలిగే ప్రేరణలను, భావాలను చేజిక్కించుకొనే ప్రయత్నం చేస్తారు, వెరసి హృదయంతో జీవించడానికి ప్రయత్నిస్తారు.

అందరిలో సాధారణంగా కలిగే ప్రశ్న, భృకుటిపై ధ్యానించకుండా లేక ఇతర చక్రాలపై ధ్యానించకుండా, హృదయ చక్రంపై ఎందుకని ధ్యానిస్తారు? కారణాలేమిటి?

హృదయం పైనే ధ్యానించడానికి అనేక కారణాలున్నాయి:
1. మొట్టమొదటి కారణం అది గురువాజ్ఞ కాబట్టి.
2. సంస్కృతం లో హృదయం అంటే హృది + అయం. అయం అఁటే ఆయన లేక భగవంతుడు; హృది అంటే హృదయంలో అని అర్థం. హృదయం అంటేనే భగవంతుడు హృదయం లో ఉన్నాడు అని అర్థం. కాబట్టి భగవంతునిపై ధ్యానించాలంటే హృదయంపైనే ధ్యానించాలి.
3. హృదయం ఉద్వేగాలకు నిలయం; అనుభూతులు, ప్రేరణలు కలిగేది హృదయంలోనే.
4. మనసు పని చేసే రంగం హృదయం అని బాబూజీ చెప్పడం జరిగింది.
5. శరీరం లోని అన్ని మూలలకూ రక్తాన్ని ప్రసరింపజేసేది హృదయమే కాబట్టి. కావున హృదయంపై ఏమి చేసినా అది శరీరం అంతటా వ్యాపిస్తుంది.
6. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 17 వ అధ్యాయంలో స్పష్టంగా నన్ను అన్ని జీవుల హృదయాల్లో కనుగొనవచ్చు అని చెప్తాడు.
ఇక ఇతర చక్రాలపై ధ్యానం విషయానికొస్తే,
1. నాభి చక్రంపై ధ్యానిసే, శరీర వ్యవస్థను గురించి కూలంకషంగా తెలుసుకోవచ్చునని శాస్త్రాలు చెప్తున్నాయి.
2. అలాగే విశుద్ధి చక్రంపై ధ్యానిస్తే ఆకలిదప్పికలు పోతాయని చెప్తాయి శాస్త్రాలు
3. సహస్రార చక్రంపై ధ్యానిస్తే సిద్ధుల, విముక్తాత్మల, మహాత్ముల సందర్శనం జరుగుతుందని చెప్తాయి శాస్త్రాలు.
4. భ్రూమధ్యం లేక ఆజ్ఞా చక్రంపై ధ్యానిస్తే, శక్తి స్థానం కావున యుద్ధానికి ఉపక్రమించవలసిన ధీరత్వం వంటి శక్తులు వస్తాయని చెప్తారు. అందుకే శ్రీకృష్ణుడు ఇది అర్జనుడికి ఉపదేశించిన పద్ధతి. దాని తరువాత అర్జనుడు యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. అందరికీ కాదు.
ఇలా ధ్యాన లక్ష్యాలను బట్టి, అవసరాలను బట్టి వివిధ చక్రాలపై ధ్యానించడం జరుగుతుంది. గృహస్థులకు అనుకూలమైన ధ్యానం హృదయం పై ధ్యానం.
కాబట్టి మన ద్యాన లక్ష్యం ఏమిటో స్పష్టంగా ఉన్నప్పుడే సరైన ధ్యానాన్ని ఎంచుకోగలుగుతాం. ఏ ధ్యానమైనా గురువు మార్గదర్శనం లేనిదే అసాధ్యము, చేయరాదు కూడా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...