30, జూన్ 2020, మంగళవారం

హృదయ పథం - హార్ట్ ఫుల్ నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతి

హృదయ పథం - హార్ట్ ఫుల్ నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతి
ఇంతకు ముందు వ్రాసిన వ్యాసంలో పరితప్త హృదయం అంటే ఏమిటో కాస్త అవగాహన వచ్చి ఉండవచ్చు. ఈ తపన తీవ్రంగా ఉన్నప్పుడ్ ప్రతీ ఆత్మ అన్వేషణలో ఉంటుంది. అటువంటి అన్వేషణలో ఉన్నప్పుడు నాకు 30 సంవత్సరాల క్రితం,  ఈ హృదయ పథం - హార్ట్ ఫుల్ నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతి  నాకు తటస్థమయ్యింది.

ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో నాకు ఏ విధంగా జీవితం లో అడుగడుగునా కలిగే సమస్యల్లో గాని, నన్ను గురించి, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి, అస్తిత్వ సమస్యలను గురించి సమాధానాలొస్తున్నాయో, ఏ విధంగా జీవితానికి దిశ ఏర్పడిందో, ఏ విధంగా జన్మ-మృత్యువుల భయం పోతున్నదో, ఏ విధంగా ఆలోచనల్లో స్పష్టత కలుగుతున్నదో, హృదయం మరింత మరింత తేలికగా ఉంటున్నదో, ఏ విధంగా ప్రేమ పెరుగుతూ ఉన్నదో, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏమిటో ఇత్యాది విషయాలు పంచుకొనే ప్రయత్నం చేస్తాను.

మొట్టమొదటగా నేను అవలంబిస్తున్న అద్భుతమైన  హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన పద్ధతిని పరిచయం, నా అవగాహన తెలియజేస్తాను. ఆ తరువాత ఈ క్రమంలో నాలో కలిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా కలిగాయో, కలుగుతున్నాయో  రానున్న వ్యాసాల ద్వారా మీతో పంచుకొనే ప్రయత్నం చేస్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...