ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
15, డిసెంబర్ 2025, సోమవారం
పరమానంద స్థితిని కూడా దాటితే పరమగమ్యం చేరుకున్నట్లే - బాబూజీ
ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుంది - బాబూజీ
ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ
ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ
మతం బాహ్యోన్ముఖ సాధన అని, ఆధ్యాత్మికం అంతర్ముఖ సాధన అని మనం అర్థం చేసుకున్నాం. మతం యదార్థ సత్యాన్ని యదార్థ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది; ఆధ్యాత్మికత అంతర్ముఖంగా దాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ తరువాతి దశలో, ఆధ్యాత్మికత పరిపక్వత చెందినప్పుడు, ఆ అనుభూతి యదార్థ సత్యంగా మారుతుంది; అంటే ఉదాహరణకు శాంతిని అనుభూతి చెందిన వ్యక్తి శాంతిస్వరూపుడుగా మారతాడు; ప్రేమను అనుభూతి చెందిన వ్యక్తి ప్రేమగా మారతాడు; దివ్యత్వాన్ని అనుభూతి చెందిన వ్యక్తి దివ్యంగా మారతాడు. దీన్నే ఆధ్యాత్మికతను దాటి యదార్థసత్యంగా వికాసం చెందడం అని అర్థం చేసుకోవచ్చు.
ఇక మాటలు తగ్గిపోతాయి; తనను తాను మరచిపోయే స్థితి ప్రారంభమవుతుంది. అయినా యాత్ర ఇంకా పూర్తి కాలేదంటారు బాబూజీ.
ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుందన్నారు బాబూజీ.
14, డిసెంబర్ 2025, ఆదివారం
మతం ఎక్కడ అంతమవుతుందో ఆధ్యాత్మికత అక్కడ మొదలవుతుంది - బాబూజీ
13, డిసెంబర్ 2025, శనివారం
విలువలు - 2
మనసును ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేవి :
ప్రేమ, కరుణ, సమత్వం, వినయం, త్యాగం. సమర్పణ (శరణాగతి)
భారతీయ శాస్త్రాలలో విలువలు
ఉపనిషత్తులు: సత్యం, శివం (పవిత్రత), సుందరం (మంచితనం)
భగవద్గీతలో శ్రీకృష్ణుడు దైవీ సంపదగా తెలిపిన విలువలు:
అభయం, హృదయ శుద్ధి, దానం, సత్యం, అహింస, కరుణ, కోపం లేలుండా ఉండటం, స్థిర చిత్తం, సమత్వం, వినయం
పతంజలి యోగా సూత్రాలు: యమ నియమాలు
యమలు - సత్యం, అహింస, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం
నియమాలు - శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం
12, డిసెంబర్ 2025, శుక్రవారం
విలువలు
విలువలతో కూడిన, విలువలతో రాజీ పడని జీవితాలను చూస్తూ ఉంటే మన మనసుకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది; వారిలా మనం కూడా ఉంటే బాగుండేదని స్ఫూర్తి కలుగుతుంది. వాళ్ళు మహాత్ములే అవ్వక్కర్లేదు; మన చుట్టూ ఉన్న సాధారణ జీవితాల్లో కూడా గమనించవచ్చు.
విలువలు అంటే మనం జీవించే విధానం; మన ధర్మం, మన నీతులు, ఎట్టి పరిస్థితుల్లో మనం రాజీ పడని సద్గుణాలు. మన ఆలోచనలకు, మన చేతలకు, మన అలవాట్లకు, మన ప్రవర్తనకు దిశను చూపించే దిక్సూచి, విలువలు అనేవి.
విలువలు పెంపొందాలంటే మనసు, బుద్ధి, అహంకారాల శుద్ధి జరగాలి. అప్పుడు మనలో ఉన్న విలువలు ఆవిష్కరింపబడతాయి. విలువలు బాహ్యంగా ఉండేవి కావు. మానవ సమాజం, ప్రకృతితోనూ, పరస్పరం శాంతి-సామరస్యాలతో కూడిన జీవనం కోసం విలువలు అవసరం. విలువల ద్వారా అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రమశిక్షణ అలవడుతుంది.
ఇంగ్లీషులో values are caught and not taught అంటారు. విలువలనేవి ఇంకోకరిని చూసి నేర్చుకునేవి గాని చెప్తే వచ్చేవి కావు. విలువలతో కూడిన మనుషుల సాంగత్యంలో విలువలను తేలికగా పట్టుకోగలుగుతాం; ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే పిల్లలు పెద్దలను చూసే తెలియకుండా నేర్చుకుంటారు గనుక.
ఇతర మార్గాలు:
ఆత్మపరిశీలన - మన ప్రవర్తనను మనం నిశితంగా గమనించుకోవడం ద్వారా
ధ్యానం - హృదయం అపార శాంతిని అనుభూతి చెందినప్పుడు లోపలున్న విలువలు వెలుగులోకి వస్తాయి.
సత్సాంగత్యం - సజ్జనుల సాంగత్యం ద్వారా, మంచివాళ్ళతో మెలగడం ద్వారా
సేవ - నిస్స్వార్థంగా సేవ చేయడం వల్ల విలువలు బలపడతాయి.
అభ్యాసం - రోజుకొక విలువను అమలులో పెట్టే ప్రయత్నం ద్వారా.
కృతజ్ఞత - అన్నిటికంటే గొప్ప విలువను అభ్యసించడం ద్వారా హృదయాశుద్ధి జరుగుతుంది.
ఆత్మ వికాస సాహిత్య అధ్యయనం - మహాత్ముల జీవిత చరిత్రలు, భారత రామాయణాలు, నీతి కథలు, భగవద్గీత, భాగవతాలు ఇత్యాదివి.
పైన చెప్పిన వాటిల్లో సాధ్యమైనంతగా అభ్యాసం చేయడం వల్ల ఉదాహరణగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ఉదాహరణగా జీవించడం శ్రేష్ఠం.
5, డిసెంబర్ 2025, శుక్రవారం
ప్రపంచ ధ్యాన దినోత్సవం - పూజ్య దాజీ ఆహ్వానం
సత్సంగ్ ప్రాశస్త్యం
సత్సంగ్ ప్రాశస్త్యం సత్సంగ్ ప్రాశస్త్యం ముఖ్యంగా సహజ్ మార్గ్ / హార్ట్ఫుల్నెస్ సందర్భంలో అర్థం - సత్యముతో కూడి ఉండటం. సాధకులు నిరంతరాయంగా ...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...