ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
13, సెప్టెంబర్ 2024, శుక్రవారం
తపన తీవ్రతను పెంచుకోవడం ఎలా?
తపన , ఆధ్యాత్మిక తృష్ణ
తపన , ఆధ్యాత్మిక తృష్ణ
స్వతః సిద్ధంగా ప్రతీ ఆత్మలోనూ దేని కోసమో తెలియని ఆరాటం, తపన, ఒకరకమైన ఆకలి, దాహం ఉంటుంది. దీన్నే మనం ఆధ్యాత్మిక తృష్ణ అని అంటాం. ఇది హృదయంలో ఒక విధమైన అశాంతిని కలిగిస్తుంది. వన్నీ హృదయాలు దీన్ని స్పష్టంగా అనుభూతి చెందుతాయి; చాలామందిలో ఇది నిద్రాయణ స్థితిలో గాని, బలహీనంగా గాని ఉంటుంది. కానీ తప్పక ప్రతి ఆత్మలోనూ ఉంటుంది.
ఈ దాహం యొక్క తీవ్రతను బట్టి ఆయా ఆత్మల దాహం తీరే వరకు వాటి మార్గాలు అవి వెతుక్కుంటూ ఉంటాయి. దీన్నే మనం జీవితం అంటాం. ఆత్మ యొక్క తీవ్రతకు అనుగుణంగానే జీవితం అభివ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వ్యక్తమయ్యే క్రమంలోనే కోరికలు, స,మస్కారాయాఉ, అహంకారాల పాత్ర ఉంటుంది.
గాయితమ బుద్ధుడైనా, స్వామి వివేకానంద అయినా, శ్రీ రామకృష్ణ పరమ హంస అయినా, లాలాజీబాబూజీలయినా, సామాన్య సాధకుడైనా అందరిలో ఉండే ఆధ్యాత్మిక దాహం ఒక్కటే. కేవలం తీవ్రతల్లో వ్యత్యాసం ఉంది అంటే. కానీ ఆ వ్యత్యాసం మాత్రం విపరీతంగా ఉంటుంది. వాళ్ళకు వాళ్ళ దాహం పూర్తిగా తీరే వరకూ నిద్ర పట్టేది కాదట, మనకు నిద్ర పడుతోంది. ఆ తేడా తపనలో ఊహించలేనంత ఉంది.
ఈ తపనే గమ్యాన్ని చేరువ చేసేది. ఆకలి ఎంత ఎక్కువగా ఉంటే ఆహారానికి అంతా దగ్గరగా ఉంటాం; అలాగే దాహం ఎంత ఎక్కువగా ఉంటే నీరు అంతా చేరువవుతుంది. పరమ గమ్యం చేరే వరకూ మనలను నడిపించేది ఈ తపనే. ఈ తపన యే గమ్యాన్ని చేరుకోవాలన్నా అవసరమే.
మన మహాత్ముల జీవితాల్లో ఈ తపన-ఘట్టాన్ని పరిశీలిస్తే కొంతవరకైనా అర్థమవుతుంది, వాళ్ళు యే విధంగా ఆ పరమాత్ముని కోసం పరితపించేవారో.
బుద్ధుడు సిద్ధారథుడిగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడిని, ఒక శవాన్ని, ఒక వ్యాధిగ్రస్త వ్యక్తిని చూసి, ఆయన మనసు యే విధంగా చలించిపోయిందో, తాను మహా సామ్రాజ్యానికి రాజునన్న విషయం కూడా మరచిపోయి, భార్య, తనయుడు ఉన్నారన్న స్పృహ లేకుండా, కేవలం ఆతను చూసిన వాటి వెనుక ఉన్న పరమ సత్యం ఏమిటో, మానవుడి కష్టాలకు అసలు కారణం ఏమిటో కనుగొనాలన్న తపనతో అంతర్ముఖుడై శోధించి సమాధానాలను కనుగొనడం జరిగింది. ఆయనకు ఆయనలో కలిగిన ప్రశ్నలకు సమాధానం దొరికే వరకూ మరేమీ ఆయన మనసులోకి రాలేదు. ఆ విధంగా ఉండింది వారి తపన, వారి జిజ్ఞాస. మనం కూడా ఆయన చూసినవన్నీ చూస్తున్నాం కానీ ఆ తీవ్రత మనలో ఎందుకు కలగడం లేదు? ఇది మనలను మనం ప్రశ్నించుకోవాలి.
అలాగే స్వామి వివేకానంద 18 యేళ్ళ యువకుడిగా ఉన్నప్పుడే దారిలో వెళ్ళే ప్రతీ వ్యక్తిని, "మీరు దేవుడిని చూశారా? మీరు దేవుడిని చూశారా?" అని అడిగేవారట. అలా దేవుడిని చూసిన వ్యక్తిని కలిసే వరకూ ఆయన నిద్ర పోయేవారు కాదట. మనకూ కూడా ఇదే ప్రశ్న ఉంది. కానీ మనకు ఇంకా నిద్ర పడుతోంది. ఇదే తపణలో తీవ్రతలో తేడా అంటే.
ఇక శ్రీ రామకృష్ణ పరమహంస వారి విషయానికొస్తే, వారు సాధన చేసుకునే రోజుల్లో ప్రతీ రోజు చీకటి పడేసరికి, ఏకాంతంలో భగవంతుడిని చూడకుండా మరో రోజు గడిచిపోయిందేనని కన్నీరు పెట్టుకునేవారట. వారి సాధనా ప్రకరణం అంత దీక్షగా, తీక్షణంగా గడచింది.
అలాగే బాబూజీ మహారాజ్ వారి చిన్నప్పటి నుండి దైవాన్ని అనుభూతి చెందడం కోసం ఆ వయసు నుండే అనేక ప్రయోగాలు చేసేవారట. ఆ అన్వేషణలో లాలాజీ పాదాల చెంత చేరే వరకూ ఆ దాహం తీరలేదు.
ఇలా మనం మహాత్ముల జీవితాల్లో ఈ ఘటాలను పరిశీలిస్తే మన అపన తీవ్రమవడానికి దోహదపడువచ్చునేమోనని నా అభిప్రాయం. కావున తపన అందరిలో తీవ్రతరమవుగాక. గమ్యము చేరుకునేంత వరకూ విశ్రమింపకుందురుగాక.
11, సెప్టెంబర్ 2024, బుధవారం
సాధనా పంచకం - ఆది శంకరాచార్యులవారు
సాధనా పంచకం
ఆదిశంకరులవారు సాధకులు పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఎక్కవలసిన 40 మెట్లను ఈ చిన్ని 5 శ్లోకాల గ్రంథంలో నిక్షిప్తం చేశారు. దీన్నే సాధనా పంచకం అంటారు. గంభీర సాధకులకు అద్భుత మార్గదర్శకాలివి:
1. నిత్యం వేదాధ్యయనం చెయ్యండి. అంటే మన శాస్త్రాలను అధ్యయనం చెయ్యండి.
2. మన శాష్టరాలు నిర్దేశించిన విధంగా మీ ధర్మాలను, మీ కర్మలను మీరు జాగారూకతతో నిర్వర్తించండి.
3. ఈ కర్మలన్నీటినీ భగవంతునికి అర్పించి ఆరాధించండి.
4. మనసులో ఉన్న కోరికాలన్నీటినీ తొలగించేయండి.
5. గుండెల్లో దాచుకున్న పాపాల భారాన్ని కడిగివేయండి.
6. సాంసారిక విషయాల వల్ల కలిగే సుఖాలన్నీ వేదనపూరితమైనవని గుర్తించండి.
7. నిత్యానుష్ఠానం ద్వారా పరమాత్మ కోసం తపించండి.
8. గృహము అనే బంధం నుండి తప్పించుకోండి. అంటే మీ చేతనను గృహానికే పరిమితం గాకుండగా మరింత విస్తృతంగా విస్తరింపజేయండి.
9. వివేకవంతుల సాంగత్యం కోసం పరితపించండి.
10. భగవంతుని పట్ల భక్తిలో మిమ్మల్ని మీరు సుస్థిరపరచుకోండి.
11. శాంతి వంటి సుగుణాలను మీలో పెంపొందించుకోండి.
12. కోరికతో కూడిన చర్యలన్నీ నివారించుకోండి.
13. పరిపూర్ణుడైన మాస్టరు పట్ల శరణాగతి కలిగి ఉండండి.
14. నిత్యం గురువును సేవించండి.
15. పరివార్తనకు ఆస్కారం లేని ఓంకారం పై ధ్యానించండి.
16. ఉపనిషత్తుల్లో ఘోషించిన అంశాలను లోతుగా విని అర్థం చేసుకోండి.
17. ఉపనిషత్తుల్లో నిర్దేశించిన వాటి భావాన్ని నిత్యం మననం చేసుకుంటూ ఉండండి.
18. బ్రహ్మపదార్థం అనేది సత్యము అన్న సత్యాన్ని ఆశ్రయించండి.
19. వితండవాదాలకు దూరంగా ఉండండి.
20. శ్రుతులు నిర్దేశించే వివేకపూరిత విధానాన్ని అనుసరించండి.
21. 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో ఎప్పుడూ నిమగ్నమై ఉండండి.
22. దర్పాన్ని విడిచేపెట్టేయండి.
23. 'నేను శరీరం' అన్న భావాన్ని విడిచి పెట్టేయండి.
24. విజ్ఞులతో వాదనలు చేయకండి.
25. ఆకలిని, వ్యాధిని తగిన విధంగా చూసుకోండి.
26. నిత్యం భిక్ష ద్వారా పొందిన ఆహారం అనే ఔషధాన్ని గ్రహించండి.
27. రుచికరమైన ఆహారాన్ని యాచించకండి.
28. లభించినడానితో సంతుష్టులయి భగవంతునిచ్చే ప్రసాదింపబడినట్లుగా స్వీకరించండి.
29. శీతోష్ణ, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలన్నీటినీ సహనంతో భరించండి.
30. అర్థంలేని ప్రశంగాలకు దూరంగా ఉండండి.
31 చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి; వాటిని పట్టించుకోకుండా ఉండండి,
32. ఇతరుల దాయకు పాత్రులు గాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
33. ఏకాంతంలో ఆనందంగా జీఈమచండి.
34. ఆ పరమాత్మునిలో మీ మనసును ప్రశాంతంగా ఉంచండి.
35. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించి సాక్షాత్కరించుకోండి.
36. పరింతమైన ప్రపంచం పరమాత్మ యొక్క మితయేనని గుర్తించండి.
37. గత జన్మలలో చేసిన కర్మల (సంచిత) ప్రభావాలపై ప్రస్తుతం చేసే సరైన కర్మల ద్వారా జయం సాధించండి.
38. వివేకం సహాయంతో భవిష్యత్ కర్మల నుండి (ఆగామి నుండి) మామత్వాన్ని పోగొట్టుకోండి.
39। గతలోని కర్మల ప్రభావాన్ని (మొదలైన ప్రారబద్ధాన్ని)
అనుభవించడం ద్వారా పూర్తిగా అవగొట్టండి.
40. ఆ తరువాత 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో లీనమై జీవించండి.
ఆచార్య వినోబా భావే
5, సెప్టెంబర్ 2024, గురువారం
ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5
4, సెప్టెంబర్ 2024, బుధవారం
చైతన్య వికాసం - 1
మానవ జీవిత యదార్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ... నీటి చుక్క మహాసాగరంలో లయమైపోవాలంటే, మనిషిలో అనుక్షణమూ పరిణతి సంభవించలంటే, మానవ పరిపూర్ణాటను సిద్ధింపచేసుకోవాలంటే, ఆత్మవికాసం జరగాలంటే, చైతన్య వికాసం జరగాలంటే, దివ్యప్రేమగా మారాలంటే, జీవిత ప్రయోజనం సిద్ధించాలంటే మహనీయులు సూచించిన క్రమం ఈ క్రింది విధంగా ఉంది:
భగవంతునిలో (ప్రేమలో)సంపూర్ణ ఐక్యం
↡
అంతరంగం దివ్యప్రేమగా పరివర్తన చెందినప్పుడు
↡
సమర్పణ, ప్రపత్తి, శరణాగతి సంభవించినప్పుడు
↡
నిరంతర స్మరణ సిద్ధించినప్పుడు
↡
సరైన భావనతో నిత్య సాధన నిష్ఠగా కొనసాగించినప్పుడు
(ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన, దశ నియమాలకనుగుణంగా జీవిత నిర్వహణ, స్వాధ్యాయం)
↡
అలసత్వాన్ని అంటే బద్ధకాన్ని ప్రక్కకు పెట్టి, గమ్యం పట్ల ఆసక్తి పెంచుకున్నప్పుడు
↡
మనిషి తనను తాను మరింత-మరింత మెరుగైన విధంగా పరివర్తన చెండాలన్న ఆలోచన కలిగినప్పుడు
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...