గురుపూర్ణిమ
రేపు అంటే జూలై 13, 2022 తేదీన గురుపూర్ణిమ అయ్యింది. ప్రతీ సంవత్సరమూ ఆషాఢ పూర్ణిమ నాడు, వేదవ్యాస మహర్షి జన్మదిన సందర్భంగా ఈ రోజును గురుపూర్ణిమగా భారతీయ సాంప్రదాయంలో అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు. వేదవాజ్ఞ్మయాన్ని అంతటినీ క్రోడీకరించి, ఒక్కచోటుకు జేర్చిన మహాత్ముడు, మహర్షి వ్యాసమహర్షి. వీరి జన్మదినాన అన్ని సాంప్రదాయాలకు సంబంధించినవారు, శిష్యులందరూ కూడా వ్యాసమహర్షిని స్మరించుకుంటూ తమతమ గురుపరంపరను తమ గురుదేవులను పూజించుకోవడం ద్వారా ఇది జరుగుతూ ఉంది.
ఈ రోజున వివిధ సాంప్రదాయాలకు సంబంధించినవారు, వారి-వారి సంప్రదాయాలకనుగుణంగా వివిధ రకాలుగా ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున గురువుతో భౌతికంగా కూడి ఉండగలిగినప్పుడు సాధకుడి ఆధ్యాత్మిక పురోగతి ఎన్నో ఇంతలు త్వరితంగా గురువు అనుగ్రహం చేత జరిగే అవకాశం ఉందని చెప్తారు.
హార్ట్ఫుల్నెస్, శ్రీరామచంద్ర మిషన్ సంప్రదాయంలో గురుపూర్ణిమ
కాని ఈ సంస్థలో అది సాధకుడు లేక అభ్యాసి అంతరంగ తయారీని బట్టి, ఆతని అంతరంగ స్థితిని బట్టి, అతని తపనను బట్టి ఆధారపడుంటుందని చెప్తారు మన గురువులు.
ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహానుపూరుకు చెందిన శ్రీరామచంద్రజీ, ఆప్యాయంగా పిలుచుకొనే బాబూజీ స్థాపించిన శ్రీరామచంద్ర మిషన్ లో, ఈ సంప్రదాయంలోని గురుపరంపర యొక్క గురువులు, గురుపూర్ణిమ ప్రతీ సంవత్సరం ఒక ఆచారంలా ఒక క్రతువులా చెయ్యద్దంటారు. ఈ సంప్రదాయం వాటన్నిటికీ అతీతంగా చాలా దూరంగా ప్రయాణించిన సంస్థ అంటారు. యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా మనం ఆ రోజున గురువుతో కూడి ఉన్నట్లయితే అది వేరే విషయం, కాని ఆ రోజున ప్రత్యేకంగా గురువుతో ఉండాలని ప్రణాళిక అవసరం లేదంటారు. దానికి బదులుగా ఆ రోజున, అభ్యాసి లేక సాధకుడు ఎక్కడున్నా తన గురుదేవుల స్మరణలో ఎంతగా లీనమైపోయి ఉండటానికి ప్రయత్నించాలంటే ఆ స్మరణలో సాధకుడు ఆహుతి అయిపోవాలంటారు. "Consume yourself in His remembrance" అంటారు.
స్మరణ అంటే మళ్ళీ కేవలం జ్ఞాపకాలు కావు. ఆ జ్ఞాపకాలు ఎలా ఉండాలంటే మనం స్మరిస్తున్న వ్యక్తి లేక గురువు సాక్షాత్తు మనతో ఆయన ఉనికి ఉన్నట్లుగా అనుభూతి చెందగలగాలి. వారి ఉనికిని అనుభూతి చెందుతూ, వారు గడిపిన జీవన విధానాన్ని, వారు సాధన చేసిన విధానాన్ని, వారి క్రమశిక్షణ, వారి వ్యక్తిత్వం, వారి ఆధ్యాత్మిక సాన్నిధ్యాన్ని... వీటన్నిటినీ స్మరిస్తూ వారి ఉనికిని నిజంగా అనుభూతి చెందే ప్రయత్నంలో ఉంటూ మన జీవితం ఎంత వరకూ దీనికి దగ్గరగా ఉంది అని ఆత్మావలోకనం జరిగినప్పుడు కనీసం మనం చేసుకోవలసిన సవరణలు ఏమిటో అయినా మనకు తెలిసే అవకాశం ఉంటుంది.
కావున ఈ పరమపవిత్ర దినాన అభ్యాసులుగా మనందరమూ గురువుల అభీష్తాన్ని అనుసరించి తమ గురుదేవుల దివ్యస్మరణలో తమను తాము ఆహుతి చేసుకోగలరని ప్రార్థిస్తూ....
గురుపూర్ణిమ - గురుదేవుల దివ్య స్మరణలో మనలను మనం ఆహుతి చేసుకోవడమే గురు పూర్ణిమనాడు సాధకుడు చెయ్యవలసినది.
“గురుపూర్ణిమ రోజున గురువుతో కూడి ఉన్నట్లయితే అది వేరే విషయం, కానీ ఆ రోజున ప్రత్యేకంగా గురువుతో ఉండాలని ప్రణాళిక అవసరం లేదు. దానికి బదులుగా ఆ రోజున, అభ్యాసి లేక సాధకుడు ఎక్కడున్నా తన గురుదేవుల స్మరణలో లీనమైపోయి ఉండటానికి ప్రయత్నించాలి”.
రిప్లయితొలగించండిచాలా చక్కగా వివరించారు.
నమస్తే!
Beloved Daaji Pranams,
రిప్లయితొలగించండిYou are explained about Gurupurnima, I like the quotation is given by Beloved Daaji that is " Consume yourself in His Reberence". Thank you.
గురు పూర్ణిమ రోజు శిష్యుడి కర్తవ్యం ఎలా ఉండాలో తెలిపినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి