14, ఏప్రిల్ 2025, సోమవారం

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

 


శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్  

శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున్నాయి. ప్రకంపనాన్నే వైబ్రేషన్ అంటారు, ఆంగ్లంలో. నిజానికి పరిశీలిస్తే పదం అన్నా, ధ్వని అన్నా, నాదం అన్నా అన్నీ ప్రకంపనలే. స్థూల ప్రకంపనాన్ని పదం అని గాని, ధ్వని అని గాని అనవచ్చు; నాదం అంటే సూక్ష్మ ప్రకంపనం అనవచ్చు; శబ్దం అంటే సూక్ష్మాతిసూక్ష్మ ప్రకంపనం, మూల ప్రకంపనం అని ఆధ్యాత్మిక సందర్భాలలో అర్థం చేసుకోవాలి. లాలాజీ తన గ్రంథాలలో శబ్ద యోగం గురించి ప్రస్తావిస్తారు. పూజ్య లాలాజీ తన గ్రంథాలలో వారు ఎక్కడెక్కడ శబ్దం అని ప్రయోగించారో, అక్కడ ఆ పదానికి బదులుగా ప్రాణాహుతి అని మార్చి చదువుకుంటే వారు వ్రాసిన ఆధ్యాత్మిక సూక్ష్మాలు తేలికగా అర్థం చేసుకోవచ్చునన్నారు, పూజ్య దాజీ. కాబట్టి శబ్దం అంటే ప్రాణాహుతి శక్తి అని కూడా అర్థం చేసుకోవాలి. ప్రాణాహుతి కంటే అతి సూక్ష్మ శక్తి సృష్టిలో లేదంటారు దాజీ. అందుకే దీన్ని ఆది శక్తి అని కూడా సంబోధిస్తారు వారు. 
మనలను, మన చుట్టూ ఉన్న సృష్టిని పరికించి చూస్తే, విశ్వమంతా మనతో సహా అన్నీ ప్రకంపనలే, వైబ్రేషన్సే. సర్వం శబ్ద మయం. కొన్ని స్థూలమైనవి (గ్రహాలు,,,  మనుషులు, వస్తువులు త్యాదివి), కొన్ని సూక్ష్మమైనవి (పరమాణువు స్థాయిలోనివి), మరికొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనవి (వివిధ రకాల చేతనా స్థాయిలు) , చివరిగా  అతి సూక్ష్మాతి సూక్ష్మ శక్తి - ప్రాణాహుతి, అనే ప్రకంపనలతో నిండి ఉంది ప్రపంచం. చివరికి చేతనం కూడా వైబ్రేషనే. ఆత్మ కూడా వైబ్రేషనే. గ్రహాలు, చెట్లు, జంతువులు అన్నీ వైబ్రేషన్లే.  అంటే మనందరమూ శబ్దాలమే. ఓంకార నాదం కూడా శబ్దమే. శబ్దమే పరమ సత్యం. ఈ సత్యాన్ని, ఈ మూలశబ్దంతో అనుసంధానమై, తాదాత్మ్యం చెందిన అనుభవం ద్వారా సాక్షాత్కరించుకునే యోగమే, శబ్దయోగం. హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ యోగసాధన ఈ దృక్కోణంలో చూస్తే శబ్దయోగమే. ప్రాణాహుతి ద్వారా అన్నీ స్థాయిల్లో సాక్షాత్కారం సుగమం అయిపోతుంది. వ్యక్తిగత అనుభవమే దీనికి నిదర్శనం. 

12, ఏప్రిల్ 2025, శనివారం

భక్త హనుమాన్ జయంతి

 

 భక్త హనుమాన్ జయంతి 

హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హనుమంతుని పాత్ర ఎంత విశిష్ఠమైనదో మనందరికీ తెలిసినదే. భారతీయ సనాతన ధర్మంలో హనుమంతులవారు భక్తాగ్రేశ్వరులుగా పూజింపబడతారు.  భక్తికి పరాకాష్ఠగా హనుమంతులవారినే స్మరిస్తాం మనం. అలాగే వారి అమేయ శక్తికి, అపూర్వ వ్యక్తిత్వానికి, సౌశీల్యానికి, నడవడికి, ఆదర్శప్రాయులు. వీరి వ్యక్తిత్వాన్ని జూచి సాక్షాత్తు శ్రీరాములవారే, స్వయంగా, మొట్టమొదటసారి చూచినప్పుడే ముగ్ధులయిపోయారట. 

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ 

మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ 

హనుమత్ స్మరణాద్భవేత్.

తాత్పర్యం: కేవలం హనుమంతులవారి స్మరణ మాత్రం చేత బుద్ధిబలం, యశస్సు(సత్కీర్తి), నిర్భయత్వం, రోగరాహిత్యము, అజాడ్యము, వాక్పటుత్వం  సిద్ధిస్తాయట. అటువంటిది వారి వ్యక్తిత్వం. 

వారి భక్తి స్వార్థరహితమైనది, అచంచలమైనది, పరిశుద్ధమైనది. తన కోసం యేమీ కోరని వ్యక్తి, కేవలం శ్రీరామ సేవ తప్ప. భౌతిక శక్తికి, పరాక్రమానికి మారు పేరు. రాక్షసులను చంపినవారు, విశాల  మహాసముద్రాన్ని లంఘించినవారు, లక్ష్మణుడిని రక్షించే నిమిత్తం హిమాలయాల నుండి ఒక పర్వతాన్నే మోసుకువచ్చిన ఘనులు హనుమంతులవారు. అద్భుతమైన వక్త, తర్కంలో నిష్ణాతులు, సమర్థవంతమైన రాయబారి. వేదాల జ్ఞానం కలిగినవారు, మొట్టమొదటి వయ్యాకరణులు (అంటే వ్యాకరణంలో నిష్ణాతులు) - ఒకసారి వాల్మీకి మహార్షినే సరిదిద్దినవారు. అస్సలు భయం లేనివారు, ముఖ్యంగా దుష్టశక్తులతో పోరాడటంలో అమితమైన ధైర్యాన్ని కనబరచేవారు. అమితమైన ఆత్మవిశ్వాసం, జన్మతః దివ్య ప్రయోజనం పట్ల ఆమోఘమైన స్పష్టత గలవారు. అసాధ్యమైనవి సాధించినప్పటికీ కూడా వారిలో అహంకారం ఉండేది కాదు, తన శక్తి-పరాక్రమాలను గురించిన ఆడంబరము ఉండేది కాదు. గొప్ప వినమ్రత గలవారు. తన విజయాలకు కారణం అంతా కేవలం శ్రీరాముని అనుగ్రహమేనని, తన శక్తులు కావని భావించేవారు హనుమంతుల వారు విధేయతలో పరాకాష్ఠ, ఇంద్రియ నిగ్రహము, స్థిరచిత్తము, గలవారు.
 
కాన్హా శాంతి వనంలో, యాత్రా గార్డెన్ లో సీతారామలక్ష్మణహనుమత్సమేత విగ్రహం
   
సహజమార్గ గురుపరంపరలోని మాస్టర్లు కూడా ఆధ్యాత్మిక చైతన్య వికాసాన్ని గురించి వివరిస్తున్నప్పుడు హనుమంతులవారిని స్మరించడం మనం గమనిస్తాం. ముఖ్యంగా 13 చక్రాల మన ఆధ్యాత్మిక యాత్రలో సాధకుడు 9 వ చక్రం చేరుకున్నప్పుడు హనుమంతులవారి చేతనాన్ని అనుభూతి చెందడం జరుగుతుందన్నారు. హను అంటే లేకపోవడం అని, మాన్ అంటే అహం. అంటే అహం లేనివాడు మాత్రమే భాకతుడవుతాడాని అర్థం. ఈ వాక్యాలు పూజ్య లాలాజీ పలికినవి. ఇదే అర్థం పూజ్య దాజీ కూడా పడే పడే ఇటమకించడం మనం గమణిస్తూనే ఉన్నాం. భక్తికి ప్రధాన యోగ్యత ఆహాన్ని త్యజించడమేనన్నారు లాలాజీ. అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోడాలచుకున్నవారు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు. అలాగే పూజ్య దాజీ, హనుమాన్ లో రెండు గొప్ప లక్షణాలను ఉల్లేఖించారు 1) నేను నా స్వామితో కూడి ఉన్నంత సేపూ యేదీ తప్పవడానికి వీల్లేఎదన్న ధీరత్వం 2) వినమ్రత




1, ఏప్రిల్ 2025, మంగళవారం

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం 
ఒక పెద్ద వరం 

మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే బుద్ధి వికసించకపోయినా, ఆత్మ వికాసం జరుగకపోయినా మనిషి మనుగడ అసంపూర్ణమే, సమతౌల్యతలో కొరతే ఉంటుంది. ఈ వెలితుల కారణంగా ప్రతీ మనిషి అనుభవిస్తూనే ఉంటాడు. వ్యక్తిత్వం సమగ్రంగా ఉండదు కూడా. పర్యవసానాలు అనుభవిస్తూనే ఉంటాడు మనిషి. వ్యక్తిలో ఇటువంటి సమగ్ర పరివర్తన హార్ట్ఫుల్నెస్ సరళ ప్రాణాహుతితో కూడిన ధ్యానపద్ధతి సహజంగా తీసుకువస్తుంది; కొద్దిగా సమయం పట్టినా కూడా తప్పక జరుగుతుంది; ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. 
ఎందుకు వారం అంటే 
ఈ ధ్యాన పద్ధతి చాలా సరళమైనది. 
ఆధునిక జీవన విధానంలో తేలికగా ఇమిడిపోతుంది. 
నియమ-నిబంధనలు ఇంచుమించు లేవు. 
అర్హతలు చూడారు. చూసేదీ ఒక్క అరహాతే, మనలను మనం మార్చుకోటానికి సంసిద్ధంగా ఉన్నామా, లేమా? వ్యక్తి తనలో పరివర్తన రావాలని పరితపిస్తున్నాడా లేదా? అన్నదే ముఖ్యం. 
పూర్తిగా జీవిత పర్యంతం, ప్రతి వ్యక్తికీ వ్యక్తిగతంగా  మార్గదర్శనం అందుబాటులో ఉంటుంది, 
ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదు. ఆధ్యాత్మిక శిక్షణ పూర్తిగా ఉచితం.  
అన్నీ సంస్కృతులలోనూ, ఎటువంటి నేపథ్యం కలిగినా, అందరిలో ఇబ్బంది లేకుండా తేలికగా ఇమిడిపోతుంది. 
దీనికి నమ్మకం కూడా అవసరం లేదు. నమ్మకం అనుభవంపై ఆధారపడఉంటుంది. అనుభవం ఉన్నచోట నమ్మకంతో పని లేదు. 
క్రతువులలేవు, తాంబూలాలు లేవు, గురువు పాదస్పర్శలు లేవు, గురు దక్షిణలు లేవు (కృతజ్ఞతతో కూడిన హృదయంతో, యథాశక్తి అందించే గురుదక్షిణలు తప్ప). 
ఈ ధ్యాన పద్ధతి, మనిషిలో సాధారణ ఒత్తిడిని తొలగించడం దగ్గర నుంచి దైవసాక్షాత్కారం వరకూ, ఇంకా మాట్లాడితే, అఆ తరువాత కూడా కొనసాగే అనంత యాత్ర వరకూ అడుగడుగునా సహాయపడే పద్ధతి. 
చాలా వరకు మనస్సాక్షిని అనుసరించడానికి సహాయపడే మార్గం. హయాఉతిక జీవనంలో రోజు-రోజుకూ హృదయంలో శాంతిని వృద్ధి చేసే జీవన విధానం. 
శాస్త్రాలలో ఉల్లేఖించిన నిగూఢమైన ఆధ్యాత్మిక స్థితులను తేలికగా అనుభవంలోకి తీసుకుయయగలిగే మార్గం. ఉదాహరణకు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తామరాకుపై నీటి బొట్టు వలె జీవించడం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా అందులోని ఆనందాన్ని పొందగలుగుతాం;  ఆత్మసమర్పణ యొక్క నిజమైన అర్థాన్ని ప్రత్యక్షానుభవం ద్వారా, సమీప అనుభూతిని  పొందవచ్చు. విలువలు అప్రయత్నంగా నెమ్మది-నెమ్మదిగా చోటు చేసుకోవడం ప్రారంభిస్తాయి. 
వ్యక్తిలో ఉండే అపరిశుద్ధ తత్త్వాలను, జటిల మనస్తత్వాలను నిర్మూలించి, సరళంగా, స్వచ్ఛంగా తయారు చేసే మార్గం. 
కేవలం మూడు మాసాలలోనే,  త్రికరణ శుద్ధిగా చేసే ఈ యోగసాధన ద్వారా అపూర్వమైన మార్పులు చోటు చేసుకోవడం ఎవరైనా గమనించవచ్చు. ఇది ముందుకు సాగడానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  
మోక్షసాధన మనకు అందుబాటులో ఉన్న విషయం సత్యమేనని,  మహాపురుసులు మనకు బోధిస్తున్నవి కేవలం గ్రంథాలకే పరిమితం కావని, అనుభవ జ్ఞానంలో సాధించవచ్చునన్న విశ్వాసం సగటు మనిషిలో కూడా ఏర్పడటం ఈ అనంత యాత్రలో పాల్గొనాలన్న ఉత్సాహం నిత్యనూతనంగా ఎన్నో ఇంతలు పెరుగుతూ ఉంటుంది.    

చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం

దాజీజూలై భండారా సందేశం చారీజీ 98 వ జయంతి సందర్భంగా దాజీ సందేశం