లక్షలమందిలో బహుశా ఒక్కరికీ ఉండవచ్చు. అటువంటి లక్షల మందిలో కొన్ని వందల మందిని ఒక్కచోటుకు చేరిస్తే, వాళ్ళల్లో ఒక్కరో ఇద్దరో గమ్యాన్ని చేరకోగలుగుతారంటారు, శ్రీకృష్ణభగవానుడు.
కానీ ఈ పరిస్థితిని మనం మార్చవలసి ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి మనం అంత బలహీనులం కాదని నిరూపించాలి. మనం ఈ గమ్యాన్ని సాధించగలం. మార్గాలున్నాయి. - దాజీ
మానవ జీవన యదార్థ లక్ష్యం - మానవ జీవిత ప్రయోజనం
మానవ జీవిత యదార్థ లక్ష్యము, మానవ జీవిత ప్రయోజనము - ఈ రెండిటి అర్థం ఒక్కటే అన్నట్లుగా అనిపిస్తూంటుంది. పూజ్య చారీజీ ఈ రెండింటిలో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాన్ని తెలియజేయడం జరిగింది.
మానవ జీవిత యదార్థ లక్ష్యం మనుషులందరికీ ఒక్కటే, అందరికీ సమానమే. మన ప్రార్థనలో చెప్పినట్లుగా, ఆ పరమాత్మే మన యదార్థ లక్ష్యం; ఆ పరమాత్మలో సంపూర్ణంగా లయమవడమే జీవిత పరమార్థం. ఇది అందరికీ సమానంగా ఉండే లక్ష్యం. కానీ మానవ జీవిత ప్రయోజనం వ్యక్తిగతమైనది. ప్రతీ మనిషి జీవితమూ చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికీ తనకంటూ ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుందన్నారు పూజ్య చారీజీ. కాబట్టి మనిషి తన జీవిత ప్రయోజనాన్ని తనకు తానే తెలుసుకోవాలి; అక్కడ ధ్యానం సహకరిస్తుంది. వ్యక్తిగత జీవిత ప్రయోజనాన్ని తనకు తానే ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవడం, ఆ తరువాత ఆ జీవితాన్ని మానవ జీవిత యదార్థ లక్ష్యం దిశగా మలచుకోవడం, ఇదే మానవ జీవిత ప్రయోజనం.
ఉదాహరణకు ఈ భూమ్మీద అవతరించిన, ఇప్పటికీ అవతరిస్తున్న, ఎందరో మహానుభావుల చరిత్రలు గనుక పరిశీలిస్తే, ప్రతి ఒక్కరూ తమదైన ప్రయోజనం కోసం జీవించి వెళ్ళినట్లుగా, మానవాళికి ఆదర్శంగా మార్గదర్శకంగా జీవించినట్లుగా గమనిస్తాం. ఒక్కొక్కరూ ఒక్కొక్క ప్రయోజనం కోసం జీవించి మానవాళికి ఉదాహరణలుగా ఉన్నారు. స్వామి వివేకానంద భరత జాతిని మేలుకొల్పడానికి జన్మించినట్లుగా అనిపిస్తుంది; ఏసు క్రీస్తు కరుణను నేర్పించడానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది; శ్రీకృష్ణ భగవానుడు ధర్మస్థాపన కోసం, కర్మాభక్తిజ్ఞాన యోగాలను బోధించడం కోసం, లాలాజీ ప్రాణాహుతి విద్యను పునరుద్ధరించడం కోసం, బాబూజీ, ప్రాణాహుతితో కూడిన ధ్యానపద్ధతికి పరిపూర్ణత చేకూర్చి మనుషులు సరళంగా పరిపూర్ణతను సాధించడానికి, పూజ్య చారీజీ అభ్యాసుల్లో చక్కటి పునాదులు ఏర్పరచి నూరు దేశాలలో వ్యాపింపజేయడానికి, పూజ్య దాజీ ఇంటింటా ప్రపంచమంతటా వ్యాపియమపజేయడానికి ఇలా వివిధ ప్రయోజనాలతో మహాత్ములు జన్మిస్తారు. అలాగే ప్రతి వ్యక్తికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. దాన్ని ఎవరికి వారు ధ్యాన లోలోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవలసినదే. ఏదోక దశలో తమ జీవిత ప్రయోజనం ఏమిటో స్ఫురించిన క్షణం నుండి ఆ వ్యక్తి ఆ దిశగా నిస్స్వార్థంగా తనను తాను మరచిపోయి జీవించడం ప్రారంభిస్తాడు.
మనలో ఎంతమందికి మానవ జీవితం యొక్క పరమ గమ్యాన్ని గురించిన అవగాహన ఉంది?
లక్షలమందిలో బహుశా ఒక్కరికీ ఉండవచ్చు. అటువంటి లక్షల మందిలో కొన్ని వందల మందిని ఒక్కచోటుకు చేరిస్తే, వాళ్ళల్లో ఒక్కరో ఇద్దరో గమ్యాన్ని చేరకోగలుగుతారంటారు, శ్రీకృష్ణభగవానుడు.
కానీ ఈ పరిస్థితిని మనం మార్చవలసి ఉంది. శ్రీకృష్ణ భగవానుడికి మనం అంత బలహీనులం కాదని నిరూపించాలి. మనం ఈ గమ్యాన్ని సాధించగలం. మార్గాలున్నాయి. - దాజీ
పైన దాజీ చెప్పిన వాక్యాలు వింటూ ఉంటే, చదవుతూ ఉంటే, వారి సంకల్పాలను అర్థం చేసుకుంటూ ఉంటే, వారు నిర్దేశించిన బాటలో నడుస్తూ ముందుకు సాగుతూ ఉంటే కూడా, ఏదోక క్షణంలో మనుషులందరూ తమ జీవిత ప్రయోజనాన్ని గుర్తించి తమ జీవనం కొనసాగించినప్పుడు ఈ భూమాత పులకరించి ఈ భూలోకమే బ్రైటర్ వరల్డ్ గా మారే రోజు తప్పక వస్తుంది; మనం చూసినా చూడకపోయినా; కనీసం అందుకు తోడ్పడినవారుగా మిగిలిపోవచ్చు; మన జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు; దివ్యంగా మార్చుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి