మనం నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలుసుకున్న తెలుసుకోకపోయినా, మానవ ప్రయత్నం, భగవంతుని కృప, ఈ రెండూ లేకుండా ఎ పనీ జరగదు. కేవలం మానవ ప్రయత్నం సరిపోదు; అందుకే అన్ని పనులూ జరుగకపోవడానికి కారణం. అలాగే కేవలం భగవంతుని కృప మాత్రమే సరిపోదు; భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది; లేనిది మానవ ప్రయత్నం; అందుకే ఆయన కృప ఉన్నా పనులు జరుగకపోవడానికి కారణం.
ఇక్కడ మరొక్క విషయం తెలుసుకోవాలి; భగవత్సంకల్పానికి అనుగుణంగా మానవ సంకల్పం ఉంటేనే అది దివ్య జీవనం అవుతుంది; యోగాభ్యాసం యొక్క పరమ లక్ష్యం అదే. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన అనేవి భగవత్ కృపను ఆకర్షించే విధంగా మన జీవితాలను మలచుకునే ప్రయత్నమే.
భగవద్గీత 18 అధ్యాయంలో 78 వ శ్లోకంలో చెప్పినది దీనికి నిదర్శనం.
యత్ర యోగీశ్వర కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః |
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి