
నమస్తేజీ! హ్యాపీ జన్మాష్టమి.
గీతాబోధలు సనాతనమైనవి, కాలాతీతమైనవి. మనకు ఏదో రకంగా
ప్రేరణనందిస్తూనే ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రేరణలు ఎంత గొప్పవైనప్పటికీ
కూడా మనం
తపిస్తున్నటువంటి ఆ సత్యాన్ని సాక్షాత్కరించే దిశలోకి తీసుకువెళ్ళవు.
ఉన్నతకోవకు చెందిన
ఎందరో పేరున్న ఆచార్యులు, ప్రబోధకులు మనకు స్థితప్రజ్ఞత్వ
స్థితికి చేరుకోవడం చాలా శ్రేష్ఠం అని
చెప్పడం జరిగింది. అందులో సందేహం
లేదు. అలాగే మనిషికి ఎప్పుడూ కర్తృత్వభావం
ఉండకూడదన్నారు, తానే అన్ని
పనులు చేస్తున్నానన్న స్పృహ ఉండకూడదు. నిజమే బాగానే ఉంది.
ఆకలిగా ఒక 5 స్టార్ హోటల్ కు వెళ్ళి కేవలం
మెనూ చదివితే కడుపు
నిండుతుందా? తృప్తిగా
ఉంటుందా? మనం వీటిని చదువుతున్నాం. ఈ భావాన్ని
ద్రష్టగా చూడటం ఎలా? ఆ స్థితప్రజ్ఞ స్థితికి, ఆ సమతౌల్య స్థితికి
చేరుకోవడం ఎలా?
అటువంటి ఉన్నతస్థితులకు చేరుకోవడం ఎలా?
ప్రత్యక్షానుభవంతో ఈ స్థితులకు
చేరుకోగలిగే
సాధనను చేపడితే తప్ప, కేవలం చదవడం
వల్ల గాని, కేవలం
శ్రవణం చేయడం వల్ల గాని ఏ ప్రయోజనమూ లేదని మన పరిశీలన తెలుపుతూ
ఉన్నది. ఈ ప్రయోజనం సిద్ధించడం కోసం అవసరమైన మార్గాల
విషయంలో
మనందరమూ ఎప్పుడూ అంధకారంలోనే ఉన్నాం. వాళ్ళు చేసిన, చేస్తున్న
అన్ని
ప్రవచనాల్లో కూడా ఈ మేరకు ఎటువంటి జాడ
కానరాదు. ఫలితంగా వీటిని
వింటున్నవారందరూ కేవలం పదే పదే
గీతా పారాయణం చేస్తే చాలన్న పొరపాటు
నిర్ధారణకు వచ్చేస్తున్నారు. “నేను
కర్తను కాదు”, “అహం బ్రహ్మాస్మి” అని
మనసులో అనుకుంటే సరిపోతుందా? పారయణ
చేయడంతో మన వంతు
ప్రయత్నం
అయిపోయిందనుకోవడం నిజానికి ఒక భ్రమలో
ఉండిపోవడం
అవుతుంది; ఇది మన పురోగతికి అడ్డుగోడవుతుంది. సరైన ఫలితాలు
సాధించాలంటే సరైన మార్గాలను అనుసరించాలి మనం. సరైన సాధన వల్ల కలిగే
స్థితప్రజ్ఞ స్థితి గాని,
గీతాచార్యుడు చెప్పినటువంటి పద్మపత్రమివాంభస అనే
స్థితి
గాని, సాక్షి భావం గాని, శరణాగతివంటి
ఆనందకరమైన స్థితులు గాని లేక
నిష్కామ కర్మ
స్థితి గాని అప్పుడే కలిగే అవకాశం ఉంటుంది. కేవలం “నేను
సాక్షిని”, “అహం
బ్రహ్మాస్మి” అని మనసులో జపించడం వల్ల ఈ స్థితులు
సిద్ధిస్తాయా? దయచేసి
ఆలోచించండి.
ఇది అంత
తేలికై ఉంటే ఈపాటికి విన్నవారూ, ఇలా
జపం చేసినవారందరూ
శ్రీకృష్ణ
భగవానుడు ఎన్నో రకాలుగా
గీతలో సూచించిన స్థితులను సాధించి
ఉండేవారు.
నా పరమపూజ్య గురుదేవులు పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ ఎంతో
కృపతో వెల్లడించిన గొప్ప
సత్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దయచేసి
సావధానంగా ఎంతో జాగ్రత్తగా వినండి.
మనం ఒక్కసారి మహాభారత యుద్ధ సన్నివేశంలోకి వెడదాం.
యుద్ధం
ప్రారంభమవబోతోంది. అర్జునుడు విషాదంలోకి
కూరుకుపోయి యుద్ధం
చెయ్యకూడదని నిశ్చయించుకున్నాడు. మనకు ఈరోజు అందుబాటులో
ఉన్న
700 శ్లోకాల గీత చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడికి అక్కడ
ఎంత సమయం ఉందో
ఒక్కసారి అంచనా వెయ్యండి.
రెండు సైన్యాలు ఎదురెదురుగా యుద్ధానికి
సన్నద్ధమై ఉన్నాయి, యుద్ధం
ప్రారంభించడానికి శంఖాలు పూరించడం
జరిగిపోయింది. శ్రీకృష్ణ భగవానుడి వద్ద విషాదంతో
నిండిపోయిన అర్జునుడికి
బోధలు చేసి మళ్ళీ
సరైన త్రోవలో పెట్టడానికి, అతన్ని యుద్ధానికి సన్నద్ధుడిని
చెయ్యడానికి భగవానుడికి ఎంత సమయం ఉందో
కొంచెం ఆలోచించండి.
పద్దెనిమిది
అధ్యాయాల్లో ఉన్న 700 శ్లోకాలు చెప్పాలంటే
కనీసం కొన్ని గంటలైనా
పడుతుంది. అటువంటి కీలకమైన క్షణంలో ఇది కుదిరే పనేనా? ఆయన కొద్ది
నిముషాలు మాత్రమే అర్జునుడికి చెప్పవలసినది చెప్పడానికి తీసుకుని ఉంటాడని
అర్థమవుతుంది,
పరిశీలిస్తే.
వాస్తవం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు నిజానికి అర్జునుడికి, ఆ క్షణంలో
అతనికి అవసరమైన మానసిక స్థితులన్నిటినీ కేవలం కొద్ది నిముషాల్లోనే
అతనిలోకి ప్రసరించడం జరిగింది. నిజానికి ఆ స్థితులన్నీ కూడా సాధకుడు తన
ఆధ్యాత్మిక యాత్రలో వీటి గుండా ప్రయాణించే
స్థితులు. ఈ ప్రక్రియ అర్జునుడిని
వెంటనే
ఒక ఉన్నత ఆధ్యాత్మిక స్థితికి జేర్చి, అతని హృదయంలో ఉన్న అవసరం
లేని మోహాన్ని తొలగించి వేస్తుంది.
అటువంటి సమ్ర్థుడైన
వ్యక్తిత్వం అందుబాటులో ఉన్నట్లయితే అది ఈ
రోజు
కూడా సాధ్యమే.కాని మనం సాధారణంగా గమ్నిస్తున్నదేమిటంటే జనం గీతను
తమ
జీవితం అంతా వింటూనే ఉంటారు, పారాయణం చెస్తూఁటారు తప్ప
అందులో ఉన్న
స్థితులను అనుభవంలోకి కొంచెం కూడా తెచ్చుకోలేకపోతున్నారు.
గీతా సారం వాళ్ళ
హృదయాన్ని అస్సలు స్పృశించదు. గీతను ఇన్ని
సంవత్సరాలుగా వింటున్నప్పటికీ కూడా
ఎమతమది అర్జునుడిలా తమ విషాదంలో
నుండి బయట
పడగ్లిగారు?
వాస్తవానికి
శ్రీకృష్ణ భగవానుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ప్రసరించడం జరిగింది,
వ్యాస
మహర్షి ఈ సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది.. ఆయన ఈ
ప్రసరించిన జ్ఞానాన్ని శ్లోక రూపంలో తర్జుమా
చేయడం జరిగింది. ఇది అర్థం
చేసుకోవడం
చాలా ముఖ్యం - అక్కడ
యుద్ధరంగంలో శ్రీకృష్ణుడికి,
అర్జునుడికీ
మధ్య జరిగిందేమిటంటే, మాటల్లో
కాకుండా మరోరకంగా ఆ
జ్ఞానాన్ని ప్రసరించడం జరిగింది; ఈ
ప్రసరణను వ్యాస భగవానుడు ఆ
తరువాత శ్లోకాల రూపంలో తర్జుమా
చేయడం జరిగింది.
ఈ విధంగా, వ్యాసమహర్షి
సాక్షిగా, శ్రీకృష్ణ భగవానుడు తన
హృదయం నుండి
అర్జునుడి హృదయానికి,హృదయంనుండి హృదయానికి ప్రసరించిన
జ్ఞానాన్నే
అందులో నిక్షిప్తమైయున్న
ఆధ్యాత్మిక స్థితులను, ఉద్వేగాలను, శ్లోకాల
రూపంలో
తర్జుమా చేసినదాన్నే మనం ఈ
రోజున భగవద్గీతగా చదువుకుంటున్నాం.
నిజానికి మౌఖికంగా పలికిన శ్లోకాలు కేవలం ఏడు మాత్రమే. అర్జునుడికి ఈ ఏడు
రత్నాలను ఏడు
శ్లోకాల ద్వారా అందించడం జరిగింది. వ్యాస మహర్షి వారివురి
హృదయాల మధ్య
జరిగిన సంభాషణ యొక్క తర్జుమా గాకుండగా కాలక్రమేణా
ఎందరో మహర్షులు అనేక శ్లోకాలను
వీటికి అదనంగా జోడించడం జరిగింది. ఆ
హృదయాల మధ్య జరిగిన సంభాషణకున్న ప్రాధాన్యత ఏమీ
తాకువ కాదు. బహుశా
ఆ ఏడు శ్లోకాల
కంటే ముఖ్యమైన శ్లోకాలు కావచ్చు కూడా.
భగవానుడి పట్ల ఎంతో
పూజ్య భావంతోనూ, నా ప్రియతమ
గురుదేవులైన పూజ్య
బాబూజీ మహారాజ్ పట్ల హృదయపూర్వక కృతజ్ఞతాభావంతోనూ, ఆ ఏడు
రత్నాలను, అదే ఆ ఏడు శ్లోకాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను:
1)
అధ్యాయం
2, శ్లోకం 55, సాంఖ్య యోగం
శ్రీ భగవానువాచ:ప్రజాహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ఆత్మన్యేవాత్మనాతుష్ఠః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే. //2:55//ఓ పార్థా, మనసులో
ఉద్భవించే కోరికలన్నిటినీ ఎవరైతే
త్యజిస్తాడో, ఆత్మసంతృప్తి కలిగి ఉంటాదో, ఆత్మలో
సంతుష్ఠుడై అంతరంగంలో స్థిరంగా ఉంటాడో అటువంటి
వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు. 2)
అధ్యాయం
2, శ్లోకం 62, సాంఖ్య యోగం
యతో విషయాంపుంసః సంగస్తేషూపజాయతేసంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోపిజాయతే. //2:62//ఇంద్రియాలపైనే
దృష్టిని సారించినవాడు వాటికి
ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ నుండి కోరిక
పుడుతుంది; కోరిక నుండే కోపం పుడుతుంది. 3)
అధ్యాయం
2, శ్లోకం 63, సాంఖ్యయోగం
క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ప్రణశ్యతి. //2:63//కోపం మనసును
గందరగోళానికి గురి చేసి భ్రమకు లోనవుతుంది; ఫలితంగా
జ్ఞాపక శక్తి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి
నాశనమవడంతో మనిషి అథోగతిపాలవుతాడు. 4)
అధ్యాయం
2, శ్లోకం 64, సాంఖ్య యోగం
రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైః చరన్యైఃఆత్మవశైః విధేయాత్మా విధేయాత్మాప్రసాదమధిగచ్ఛతి. //2:64//మనసును అదుపులో ఉంచుకున్నవాడు రాగద్వేషాల (ఇష్టాయిష్టాల)నుండి ఇంద్రియములతో వస్తువులను
వినియోగిస్తున్నప్పటికీ వాటి నుండి విముక్తుడవుతాడు;భగవదనుగ్రహాన్ని
పొందుతున్నాడు. 5)
అధ్యాయం
2, శ్లోకం 66, సాంఖ్య యోగం
నాస్తి బుద్ధిరుక్తస్య న చా
యుక్తస్య భావనాభావనాన చా భావయతః శాంతిరశాంతస్య
కుతః సుఖమ్. //2:66//సామరస్యం లేనిదే మనిషికి విజ్ఞత ఉండదు; సామరస్యం
లేకుండా ధ్యానం కుదరదు; ధ్యానించకుండా శాంతి
రాదు. మనశ్శాంతి లేనప్పుడు మనిషికి సంతోషం ఎక్కడుంటుంది? 6)
అధ్యాయం 3, శ్లోకం 35, కర్మయోగం
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావః //3:35//
పరధర్మాన్ని
ఎంతబాగా నిర్వర్తించినప్పటికీ గుణము లేనిదైనా
స్వధర్మమే
మేలు; స్వధర్మ
ఆచరిస్తూ మృత్యువు సంభవించినా
మంచిదే పరధర్మాన్ని
నిర్వహించడం
కంటే కూడా.
క్లుప్తంగా
చెప్పలంటే, “నీ పని
నువ్వు చూసుకో” అని అనుండేవారు బాబూజీ.
7)
అధ్యాయం 3, శ్లోకం 4, కర్మయోగం
నకర్మణామనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్నన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్ఛతి.
//3:04//
కర్మ చేయకుండా ఉండటం వల్ల మనిషికి కర్మ నుండి
విముక్తి కలగదు. కేవలం
కర్మ పరిత్యాగం వల్ల పరిపూర్ణతను సాధించడం కుదరదు.
ఇవి ఈ ఏడూ
రత్నాలు. ఆ తరువాత మొదటి రోజు యుద్ధం పూర్తయిన తరువాత
అర్జునుడిని భగవానుడు
ఓదారుస్తూ మూడు వ్యక్తిగత రహస్యాలను వెల్లడించాడు:
1)
అధ్యాయం 4, శ్లోకం 7, జ్ఞానయోగం
యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం
అధర్మస్య తదానాత్మానం సృజామ్యహం.
ధర్మానికి ఎప్పుడు గ్లాని కలుగుతుందో అధర్మం ఎప్పుడు
హద్దులు మీరుతుందో ఓ అర్జునా, అప్పుడు
నేను ఈ
భూమ్మీదకు అవతరిస్తూంటాను.
2)
అధ్యాయం 4, శ్లోకం 8, జ్ఞానయోగం
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే
యుగే.
దుష్టులను
శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి,
ధర్మాన్ని
స్థాపించడం కోసం నేను
ప్రతీ యుగము నందు
ఈ
భూమిపై అవతరిస్తూ ఉంటాను.
అన్నిటి కంటే ముఖ్య శ్లోకం,
3)
అధ్యాయం 18, శ్లోకం 66, మోక్షసన్యాసయోగం
సర్వధర్మాన్పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వపాపేభ్యోః మోక్షయిష్యామి మా శుచ.
అన్ని ధర్మాలు
పరిత్యజించి, నన్ను మాత్రమే శరణాగతి వేడినచో
నేను నిన్నుసర్వపాపముల
నుండి విడుదల చేయగలను:
భయపడకు.
కాబట్టి
సోదరసోదరీమణులారా, ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని మీరందరూ అత్యంత
ఆనందోత్సాహాలతో
జరుపుకోవాలని కోరుకుంటున్నాను; అలాగే మీలో
కొంతమంది ఉపవాసం చెయ్యగలరేమో
చూడండి.
ఈ శ్లోకాల భావంపై దీర్ఘంగా ఆలోచించండానికి ప్రయత్నించండి.
నేను
చెప్పినట్లుగా ఈ శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడితో మౌఖికంగా చెప్పిన
శ్లోకాలు.
అలాగని, మౌఖికంగా చెప్పని శ్లోకాలు, హృదయాల మధ్య
జరిగిన సంభాషణకు
ప్రాధాన్యత లేదని కాదు దీనర్థం.
గీత మొత్తం
ఈ రోజున అందరికీ వర్తిస్తుంది; ఇంతకు పూర్వం కంటే కూడా, ఈ
జీవితానికే గాక భవిష్యత్తులో రానున్న
తరాలు కూడా దీని నుండి ఎంతో
ప్రయోజనం పొందుతాయి.
ధన్యవాదాలు ఈ
సాంప్రదాయాన్ని తరువాతి తరాలకు అందించండి.
(ఆగష్టు 29 2021 న కాన్హా శాంతివనమ్లో పూజ్య దాజీ ఇచ్చిన ప్రసంగం.
)