'భండారా' అనే పదం ఉత్తర భారతదేశంలో పెద్ద-పెద్ద ఆధ్యాత్మిక సమావేశాలకు పెట్టిన పేరు. 'భండారా' అనే పదం భండార్ అంటే భాండాగారం తెలుగులో. ఈ పదం నుండి వచ్చిందే భండారా అనే పదం. వనరులన్నీ ఒకే చోట పెద్ద రాసిగా దాచి ఉంచే ప్రదేశం. అక్కడి నుండి ఎవరికి అవసరమైనంత వారు తీసుకు వెడుతూ ఉండేవారు. అదే విధంగా ఈ సందర్భంలో ఈ భండారాలో ఆధ్యాత్మిక సంపద ఆ ఉత్సవం జరిగినంత సేపూ వర్షిస్తూనే ఉంటుంది. అందులో పాల్గొన్నవారు వాళ్లకు వీలైనంత సంపద అర్హత లేకుండానైనా పొందవచ్చు. తాత్పర్యం ఏమిటంటే, ఎవరి పేరున భండారా జరుపబడురతున్నదో, వారి కృప అభ్యాసుల అర్హత చూడకుండా వర్షించడఁ జరుగుతుఁది. అర్హతలు చూడకుండా ప్రసాదించేదాన్నే కృప లేక అనుగ్రహం అంటారు.
మన సంస్థలో భండారాల ప్రాముఖ్యత ఏమిటి?
- మన సంస్థలో కూడా మన గురుపరంపర జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతీ సంవత్సరమూ మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక సమావేశాలుగా ఇవి జరుగుతూ ఉంటాయి. మన మాస్టర్లు మన నిరంతర స్మరణలో ఉన్నా కూడా ఈ మూడు రోజుల్లో వారిని ప్రత్యేకంగా స్మరించుకోవడం జరుగుతుంది - వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ కూడా.
- గురువులు వారి అపార కృపచే తమ అభ్యాసులకు అర్హతలు చూడకుండా ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదించే రోజులు ఈ భండారా జరిగే రోజులు.
- అంతేకాదు, ప్రతి అభ్యాసి తన ఆధ్యాత్మిక ప్రగతిని ఒక్కసారి సరి చూచుకొని, ఎక్కడున్నాం? ఏమి చెయ్యలేదు? ఏమి చెయ్యాలి? నా అలవాట్లలో, నా ప్రవర్తనలో, నా ఆలోచనా విదానంలో, నా సాధనలో, మాస్టరు పట్ల నిబద్ధతలో ఇత్యాది అంశాల్లో ఎటువంటి సవరణలు చేసుకోవాలి? ఇటువంటి ప్రశ్నలను తనకు తాను ప్రతి సాధకుడు వేసుకొని, కొత్త తీర్మానాలు చేసుకొని, ఇందులో వారి సహాయం అర్థించడానికి ఒక అద్భుత అవకాశం.
- ఈ సమయంలో సజీవ మాస్టరు ద్వారా నిర్వహింపబడే ధ్యానాలు అతి శక్తివంతంగా ఉంటాయి; అలౌకికంగా ఉంటాయి; విపరీతమైన శుద్దీకరణలు జరుగుతాయి; ఊహించని పేరు పెట్టలేని అనిర్వకనీయమైన ఆధ్యాత్మిక స్థితులు కలిగే అవకాశం ఉంటుంది; దానితో రానున్న కాలంలో మన జీవితాల్లో అనేకా మార్పులు రావడం అమనించుకోవచ్చు.
- అంతే కాదు, మన గురుపరంపరలోని మహాత్ములే గాక ఎందరో మహాత్ములు ఆ సందర్భంలో సూక్స్మ రూపంలో మనలను ఆశీర్వదించడానికి విచ్చెస్తారు. అందుకే ఆ వాతావరణం చాలా ప్రత్యేకంగా, చాలా సూక్ష్మంగా, ఎంతో పవిత్రంగా, తెలియని ఆనందం, వర్ణనాతీతంగా ఉంటుంది.
వాటిల్లో పాల్గొనవలసిన అవసరం ఏమిటి?
- మనం ప్రతిరోజూ చేసే ప్రార్థనలోని మొట్టమొదటి వాక్యం గనుక నిజంగా హృదయంలో స్థిరపడిన సాధకుడికి, ఆధ్యాత్మికంగా ఎదగాలన్న వ్యక్తికి, మరింత మెరుగైన మనిషిగా తయారవ్వాలనుకున్న అభ్యాసికి, పైన వ్రాసిన చదివిన కారణాలు సరిపోతాయి, ఎందుకు పాల్గొనాలో తెలియడానికి.
- అనివార్య కారణాల వల్ల ఇందులో పాల్గొనలేకపోయినట్లయితే కనీసం మానసికంగా గురువుతో శృతి కలిగి అనుసంధానమై ఉండటానికి ప్రయత్నించండి. అనివార్య కారణాలైతేనే....
- ఈ కోవిడ్ వాతావరణంలో మన గురుదేవులు ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ధ్యాన్నించడానికి అనుమతినివ్వడం జరిగింది. ప్రతీ ఇంట్లోనూ ఇటువంటి భండారా వాతావరణం ఏర్పరచుకోవడఁ మన బాధ్యత.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి