మార్పు, పరివర్తన, పరిణామం/ఆత్మ-వికాసం
ప్రతి మనిషీ మారాలనుకుంటాడు; మరింత
మెరుగైన విధంగా మారాలనుకుంటాడు. ఎంతవరకూ మారాలి? పరిణామానికి/వికాసానికి అంతు ఉందా? అసలు మారడం అంటే
ఏమిటి? ఏ విధంగా మారాలి? పరివర్తన అంటే
ఏమిటి? పరిణామం లేక ఆత్మ-వికాసం అంటే ఏమిటి? మనిషి అసలు మారతాడా? మారితే ఎప్పుడు మారతాడు? మారాలంటే ఎలా మారాలి? ఎక్కడ ప్రారంభించాలి? మారితే మనలో మారవలసినది ఏది? మారడానికి ఎవరైనా సహకరించగలరా? ఏమైనా ఉపాయాలున్నాయా? లేక మనం ఏమీ చెయ్యక్కర్లేకుండానే
ఏ ప్రయత్నమూ లేకుండానే మారిపోతామా?వికాసం చెందుతామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
·
మనిషిలో
పశు తత్త్వాలు, మనిషి తత్త్వాలు, దైవ తత్త్వాలు మూడూ ఉన్నాయి. పశుత్వం
ఎక్కువగా ఉంటే మనిషివా, పశువ్వా? అంటారు; అదే మానవీయ లక్సణాలతో నిండి ఉంటే – అతను మహా మనీషి అంటారు; అలాగే మనిషిలో దైవత్వం ఉట్టిపడుతూ ఉంటే – మనిషి కాదండీ, దేవుడండీ అంటాం. కాబట్టి ఆకారఁ మనిషిదే అయినా ముందు సరైన మనిషిగామారవలసి ఉంది, ఆ తరువాత మనిషి దైవంగా మారవలసి ఉంది తత్త్వపరంగా.
·
అలాగే
ఈ మానవ వ్యవస్థలో మూడు శరీరాలున్నాయి:
o
స్థూల
శరీరం (అంటే కనిపించే ఈ భౌతిక శరీరం), దీనికి వయసు వస్తుంది తప్ప పెద్దగా మారేది ఉండదు; దీని
వికాసానికి పరిమితులున్నాయి.
o
సూక్స్మ
శరీరం (ప్రధానంగా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారాలు) ఈ
నాల్గింటినీ కలిపి అంతఃకరణ అని కూడా అంటారు. స్థూల శరీరంతో పోలిస్తే దీనికి మారే అవకాశాలెక్కువ, వికాసానికి పరిమితులు తక్కువ.
o
కారణ
శరీరం (అంటే ఆత్మ). ఇది ఏకపోతే తక్కిన రెండు శరీరాఅకు అస్తిత్వమే ఉండదు. ఇది మార్పులేనిది, నాశనము లేనిది.
o
కాబట్టి
మనిషి మారాలంటే మన సూక్స్మ శరీరం మారాలి; అంటే మంసు, బుద్ధి, అహంకారము, చిత్తము లేక చైతన్యం మారాలి. మనిషి ఎలా ఉన్నాడోఅలా ఉండటానికి కారణం అతని చైతన్య
స్థితే; అందులో నిక్షిప్తమై ఉన్నవే మనసు, బుద్ధి, అహంకారము. ఇవి తమ పవిత్రతను కోల్పోయి, కలుషితమైపోయాయి. వీటిని శుద్ధి చేస్తే గాని మనిషిలో నిజమైన మార్పు, పరివర్తన/వికాసం జరుగదు.
·
మనిషి
అసలు మారేదెప్పుడు? మనిషి అతను మారాలనుకున్నప్పుడే మారగలుగుతాడు. లేకపోతే మనలను సృష్టించిన భగవంతుడు
కూడా మార్చలేడు. కావున మనిషి హృదయపూర్వకంగా మారాలనుకుంటేనే మారతాడని బాగా అర్థం చేసుకోవాలి.
·
మనిషి
తనంత తాను ఎవరి సహాయం లేకుండా తన సూక్స్మ శరీరాలను శుద్ది చేసుకోగలడా అంటే అది సాధ్యపడినట్లయితే
గనుక మనిషి ఎప్పుడో మారి ఉండేవాడు; అది జరగడం లేదు గనుక బయట నుండిఒక మార్గదర్శి లేక గురువు రూపంలో, ఆ గురువుబోధించే యోగ విధానాన్ని అనుసరించడం ద్వారా మనిషికి సహాయం అందుతుంది.
·
చివరిగా
మార్పుకు,
పరివర్తనకు వ్యత్యాసం ఏమైనా ఉందా? రెండూ ఒక్కటేనా? మనం వాడుకలో రెండూ ఒక్కటిగానే ఉపయోగిస్తున్నా, ఈ రెంటి
మధ్య తేడా ఉందనే చెప్పాలి. ఉదాహరణకు, గొంగళిపురుగు సీతాకోక చిలుకగా
మారడం, పరివర్తన; రత్నాకరుడు అనే బందిపోటు
వాల్మీకి మహర్షిగా తయారవడం పరివర్తన. సీతాకోక చిలుకలో గొంగళి పురుగుకు సంబంధించిన లక్షణాలేవీ
కనిపించవు. అలాగే వాల్మీకి మహర్షిలో రత్నాకరుడు లక్షణాలేవీ కనిపిఁచవు. అదీ పరివర్తన.
పరివర్తన చెందే దశకు ముందు అనేక మార్పులు జరుగుతాయి గొంగళిపురుగులో. మార్పులో విషయం
మారదు, విషయంలోని అంశాల అమరిక మారుతుంది. పరివర్తనలో విషయమూ పూర్తిగా
మారిపోతుంది, విషయం లోని అంశాల అమరిక కూడా పూర్తిగా మారిపోతుంది.
·
కాబట్టి
ముఖ్యంగా ఆధునిక పరిస్థితుల్లో తనకు తాను సమయఁ ఇచ్చులేకుండా తీరిక లేకుండా జీవిస్తున్న మానవులకు అనుకూలమైన, చాలా ప్రభావపూరితమైన సర్ళమైన
యౌగిక ప్రక్రియలు మన హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన పద్ధతిలో ఎన్నో ఉన్నాయి. కేవలం మూడు నెలల
కాలం అభ్యాసం నిర్దేశించిన విధంగా చేసినప్పుడు పైన చెప్పిన వాటిల్లో నిజాన్ని ఎవరికి
వారు ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. ప్రయత్నించి చూడాలి. మానవ ప్రయత్నం ఉన్నప్పుడే
దైవం యొక్క అనుగ్రహం పని చేస్తుంది, త్వరితంగా ఫలితాలు అనుభవంలోకి
వస్తాయి. కాబట్టి మానవ ప్రయత్నఁ ఉంటేనే ఆత్మ వికాసం, ఆత్మోన్నతి, జీవిత సార్థక్యం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి