ఏకాత్మ అభియాన్ - హార్ట్ఫుల్నెస్
హార్ట్ఫుల్నెస్ సంస్థ 2024 వ సంవత్సరంలో ఆనాటి మధ్య ప్రదేశ్ ప్రభత్వ సహకారంతో ఏకాత్మ అభియాన్ పేరుతో, ఆ రాష్ట్రంలోని 42000 గ్రామాల్లో కోటి మందికి పైగా హార్ట్ఫుల్నెస్ ధ్యానం నేర్పించడం జరిగింది. ఈ మహా యజ్ఞంలో స్వచ్ఛందంగా ఎందరో ప్రశిక్షకులు, వలంటీర్లు భారత దేశ నలుమూలల నుండి వచ్చి నెలరోజులకు పైగా నిస్స్వార్థ సేవలనందించడం జరిగింది.
అటువంటి కార్యక్రమమే ఈసారి, తెలంగాణాతో సహా మరో ఎనిమిది రాష్ట్రాలలో ఒక సంవత్సరంపాటుగా చేయాలని సంస్థ సంకల్పించింది. ఇందుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రకటన పూజ్య దాజీ జనవరి 1 వ తేదీన చేస్తూ, ఆసక్తిగల అభ్యాసులను, ప్రశిక్షకులను, అందరినీ ఈ యజ్ఞంలో పాల్గొనమని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ అందరికీ ఒక ముఖ్య సూచన చేశారు: "అందరినీ శ్రీరామ చంద్ర మిషన్ సభ్యులుగా చేయడం మన లక్ష్యం కాదు. వారు నమ్ముతున్న దైవాన్ని, ధ్యానం ద్వారా అనుభూతి చెందవచ్చని, ఆ అనుభవాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేయడం. " ఇది మనందరి మనసులో ఉంచుకుంటూ పని చేద్దాం.
కావున అటువంటి ధ్యానానుభూతిని తెలంగాణాలోని అన్ని గ్రామాల్లో ఒక సంవత్సర కాలంలో పూర్తి చేయడానికి మనందరమూ మనకున్న భక్తిప్రపత్తులతో, ఉత్సాహంగా పాల్గొందాం; రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుదాం.